మౌర్య హోటల్కు చేరుకున్న ఒబామా | barrack obama reaches itc mourya hotel | Sakshi
Sakshi News home page

మౌర్య హోటల్కు చేరుకున్న ఒబామా

Published Sun, Jan 25 2015 10:39 AM | Last Updated on Sat, Sep 2 2017 8:15 PM

barrack obama reaches itc mourya hotel

పాలం విమానాశ్రయం నుంచి ద బీస్ట్ వాహనంలో బయల్దేరిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు ఐటీసీ మౌర్య హోటల్కు చేరుకున్నారు. ప్రోటోకాల్ను పక్కన పెట్టి స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ విమానం వద్దకు వచ్చి మరీ ఒబామా దంపతులకు స్వాగతం పలికిన విషయం తెలిసిందే.

విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్, ఇతర అధికారులు కూడా ఒబామాకు స్వాగతం పలికినవారిలో ఉన్నారు. కాగా, ఒబామా దంపతులు బస చేస్తున్న ఐటీసీ మౌర్య హోటల్ వద్ద కనీ వినీ ఎరుగని భద్రతా ఏర్పాట్లు చేశారు. 20 మీటర్లకు ఒకటి చొప్పున హాలోజన్ దీపాలను ఏర్పాటుచేశారు. అక్కడకు సమీపంలో ఉన్న తాజ్ హోటల్ను కూడా భద్రతాధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement