ఒబామా భారత పర్యటన తాజా షెడ్యూల్ ఇదే | barack obama india tour schedule | Sakshi
Sakshi News home page

ఒబామా భారత పర్యటన తాజా షెడ్యూల్ ఇదే

Published Sat, Jan 24 2015 3:36 PM | Last Updated on Sat, Sep 2 2017 8:02 PM

ఒబామా భారత పర్యటన తాజా షెడ్యూల్ ఇదే

ఒబామా భారత పర్యటన తాజా షెడ్యూల్ ఇదే

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పర్యటన షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేశారు. భారత గణతంత్ర ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు వస్తున్న ఒబామా నిర్ణీత షెడ్యూల్ ప్రకారం జనవరి 25వ తేదీన ఢిల్లీ రానున్నారు. మూడు రోజుల పాటు భారత్లో పర్యటించనున్నారు. కాగా ఈ నెల 27న ఒబామా ఆగ్రా తాజ్మహల్ పర్యటనను రద్దు చేసుకున్నారు. సౌదీ అరేబియా రాజు మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఒబామా ఇక్కడి నుంచి నేరుగా ఆ దేశం వెళ్లనున్నారు.

భారత్లో ఒబామా పర్యటన షెడ్యూల్ ఇదే:

జనవరి 25:

ఉదయం 10 గంటలకు ఢిల్లీకి రాక
12 గంటలకు రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మోదీ స్వాగతం పలుకుతారు.
12:40: రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులు అర్పిస్తారు
మధ్యాహ్నం 2:45 గంటలకు  హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీతో భేటీ,
సాయంత్రం 4:10 గంటలకు మోదీ, ఒబామా మీడియా సమావేశం
రాత్రి 7:35 గంటలకు మౌర్య హోటల్లో అమెరికా ఎంబసీ సిబ్బంది కుటుంబ సభ్యులతో సమావేశం
7:50 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో విందు

జనవరి 26:

ఉదయం 10.00 గంటలకు గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు, అనంతరం రాష్ట్రపతి భవన్‌కు రాక
మధ్యాహ్నం మోదీతో కలసి సీఈవో సదస్సులో ప్రసంగం
రాత్రి: ప్రధానితో విందు
 
జనవరి 27:


ఉదయం 10.40: ఢిల్లీలోని సిరి కోటకు రాక
12.20-1.30: హోటల్‌లో మధ్యాహ్న భోజనం
అనంతరం సౌదీకి బయల్దేరడంతో ఒబామా పర్యటన ముగుస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement