మిషెల్లీ ఒబామా వైరల్‌ వీడియో! | Michelle Obama Imitates Barack Obama In Hilarious Video Going Viral | Sakshi
Sakshi News home page

మిషెల్లీ ఒబామా వైరల్‌ వీడియో!

Published Thu, Sep 22 2016 4:42 PM | Last Updated on Mon, Sep 4 2017 2:32 PM

మిషెల్లీ ఒబామా వైరల్‌ వీడియో!

మిషెల్లీ ఒబామా వైరల్‌ వీడియో!

భర్తను బాగా ఇమిటేట్‌ చేయడంలో భార్యలే ముందుంటారేమో.. తాజాగా మిషెల్లీ ఒబామా భర్త బరాక్‌ను చిలిపిగా ఇమిటేట్‌ చేసి నవ్వులు పూయించారు. ఎనిమిదేళ్లు అధ్యక్షుడిగా అమెరికాకు సేవలు అందించిన ఒబామా త్వరలో ఈ పదవి నుంచి దిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ హోస్ట్‌ స్టీఫెన్‌ కాల్బర్ట్‌ నిర్వహించే ’ద లేట్‌ షో’లో ఫ్లోటస్‌ మిషెల్లీ ముచ్చటించింది. వైట్‌హౌస్‌లో కుటుంబమంతా కలిసి డిన్నర్‌ చేస్తున్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో మిషెల్లీ ఈ సందర్భంగా వివరించింది.

డిన్నర్‌ చేస్తున్నప్పుడు పెద్ద కూతురు మలియా తండ్రి ఒబామాను గ్లోబల్‌ వార్మింగ్‌ వంటి సీరియస్‌ ప్రశ్నలను అడుగుతూ ఉండేదని మిషెల్లీ చెప్తూ.. ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో ఒబామా ఎలా సమాధానమిస్తాడో ఇమిటేట్‌  చేసి మరీ చూపించింది. ’వెల్‌.. నువ్వు ఈ ప్రశ్న అడగడం సంతోషంగా ఉంది. మూడు పాయింట్లతో సమాధానాన్ని నీకు వివరిస్తాను. పాయింట్‌ 1, పాయింట్‌ 1a, పాయింట్‌ 1ab అంటూ’ ఒబామా వివరిస్తూ పోతారని ఆయనను అచ్చం ఇమిటేట్‌ చేస్తూ మిషెల్లీ ప్రేక్షకుల్లో ఆనందం నింపింది. తాను, చిన్న కూతురు సాషా మాత్రం ఫేవరెట్‌ పాటల గురించి చర్చించుకుంటామని చెప్పింది. బుధవారం సాయంత్రం యూట్యూబ్‌లో ఈ పెట్టిన ఈ వీడియో ఇప్పటికే 10 లక్షలకుపైగా వ్యూస్‌ సాధించి వైరల్‌ గా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement