Sasha Obama
-
ఒబామా కూతురు పేరు నటాషా అని తెలిసి....
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షడు బరాక్ ఒబామా చిన్న కూతురు సాశా ఒబామా శనివారం నాడు తన 16వ పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నారు. ఇది పెద్ద వార్త కాలేదుగానీ సాశా ఫస్ట్ నేమ్ నటాషా అని తెలిసి తాను ఏడాది క్రితం అమితాశ్చర్యానికి గురయ్యానని ఆశ్లే సీ ఫోర్డ్ ట్వీట్ చేయడం పెద్ద దుమారమే లేపింది. వేలాది మంది నటాషా పేరును షేర్ చేసుకున్నారు. వారంతా తమదైన శైలిలో స్పందించారు. ‘సాశా పేరు నటాషా అని తెలియని ఓ అబద్ధాల ప్రపంచంలో మనం ఇంతకాలం బతుకుతున్నామైతే’ అని కొందరు స్పందించగా, అమెరికా అధ్యక్షుల వెనక రష్యా కుట్ర ఉందడానికి నటాషా పేరే సాక్ష్యమని కొందరు వ్యాఖ్యానించారు. నటాషా అనే పేరు రష్యన్లు ఎక్కువ మంది పెట్టుకుంటారని, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం వెనక రష్యా కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. సాశా అసలు పేరు నటాషా అయితే ఒబామా పెద్ద కూతురు మాలియా అసలు పేరు చెల్సియానా? అంటు కొందరు ట్విట్టర్లో ప్రశ్నించారు. మరికొందరు మారియా అసలు పేరు బోరిస్ అంటూ ఖాయం చేశారు. సాశా పూర్తి పేరు సాశా అకా నటాషా ఒబామా. ఆమె పూర్తి పేరు ఎప్పుడూ ప్రస్తావనకు రాకపోవడంతో అందరికి నటాషా పేరు తెలిసి ఉండకపోవచ్చు. కానీ మార్తాస్ వైన్యార్డ్ దీవిలోని ఓ రిస్టారెంట్లో గత వేసవిలో సాశా పనిచేసినప్పుడు ఆమె పూర్తిపేరును మొదటిసారి పేర్కొన్నారు. -
మిషెల్లీ ఒబామా వైరల్ వీడియో!
భర్తను బాగా ఇమిటేట్ చేయడంలో భార్యలే ముందుంటారేమో.. తాజాగా మిషెల్లీ ఒబామా భర్త బరాక్‌ను చిలిపిగా ఇమిటేట్ చేసి నవ్వులు పూయించారు. ఎనిమిదేళ్లు అధ్యక్షుడిగా అమెరికాకు సేవలు అందించిన ఒబామా త్వరలో ఈ పదవి నుంచి దిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ హోస్ట్ స్టీఫెన్ కాల్బర్ట్ నిర్వహించే ’ద లేట్ షో’లో ఫ్లోటస్ మిషెల్లీ ముచ్చటించింది. వైట్‌హౌస్‌లో కుటుంబమంతా కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుందో మిషెల్లీ ఈ సందర్భంగా వివరించింది. డిన్నర్ చేస్తున్నప్పుడు పెద్ద కూతురు మలియా తండ్రి ఒబామాను గ్లోబల్ వార్మింగ్ వంటి సీరియస్ ప్రశ్నలను అడుగుతూ ఉండేదని మిషెల్లీ చెప్తూ.. ఈ ప్రశ్నలకు తనదైన శైలిలో ఒబామా ఎలా సమాధానమిస్తాడో ఇమిటేట్ చేసి మరీ చూపించింది. ’వెల్.. నువ్వు ఈ ప్రశ్న అడగడం సంతోషంగా ఉంది. మూడు పాయింట్లతో సమాధానాన్ని నీకు వివరిస్తాను. పాయింట్ 1, పాయింట్ 1a, పాయింట్ 1ab అంటూ’ ఒబామా వివరిస్తూ పోతారని ఆయనను అచ్చం ఇమిటేట్ చేస్తూ మిషెల్లీ ప్రేక్షకుల్లో ఆనందం నింపింది. తాను, చిన్న కూతురు సాషా మాత్రం ఫేవరెట్ పాటల గురించి చర్చించుకుంటామని చెప్పింది. బుధవారం సాయంత్రం యూట్యూబ్‌లో ఈ పెట్టిన ఈ వీడియో ఇప్పటికే 10 లక్షలకుపైగా వ్యూస్ సాధించి వైరల్ గా మారింది.