ఒబామా కూతురు పేరు నటాషా అని తెలిసి.... | we've been living a lie!' twitter has meltdown when it discovers that sasha obama's real name is natasha | Sakshi

ఒబామా కూతురు పేరు నటాషా అని తెలిసి....

Jun 14 2017 2:43 PM | Updated on Sep 5 2017 1:37 PM

ఒబామా కూతురు పేరు నటాషా అని తెలిసి....

ఒబామా కూతురు పేరు నటాషా అని తెలిసి....

అమెరికా మాజీ అధ్యక్షడు బరాక్‌ ఒబామా పెద్ద కూతురు సాశా ఒబామా శనివారం నాడు తన 16వ పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నారు.

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షడు బరాక్‌ ఒబామా చిన్న కూతురు సాశా ఒబామా శనివారం నాడు తన 16వ పుట్టిన రోజు ఘనంగా జరుపుకున్నారు. ఇది పెద్ద వార్త కాలేదుగానీ సాశా ఫస్ట్‌ నేమ్‌ నటాషా అని తెలిసి తాను ఏడాది క్రితం అమితాశ్చర్యానికి గురయ్యానని ఆశ్లే సీ ఫోర్డ్‌ ట్వీట్‌ చేయడం పెద్ద దుమారమే లేపింది. వేలాది మంది నటాషా పేరును షేర్‌ చేసుకున్నారు. వారంతా తమదైన శైలిలో స్పందించారు.

‘సాశా పేరు నటాషా అని తెలియని ఓ అబద్ధాల ప్రపంచంలో మనం ఇంతకాలం బతుకుతున్నామైతే’ అని కొందరు స్పందించగా, అమెరికా అధ్యక్షుల వెనక రష్యా కుట్ర ఉందడానికి నటాషా పేరే సాక్ష్యమని కొందరు వ్యాఖ్యానించారు. నటాషా అనే పేరు రష్యన్లు ఎక్కువ మంది పెట్టుకుంటారని, అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ విజయం వెనక రష్యా కుట్ర ఉందనే ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే. సాశా అసలు పేరు నటాషా అయితే ఒబామా పెద్ద కూతురు మాలియా అసలు పేరు చెల్సియానా? అంటు కొందరు ట్విట్టర్‌లో ప్రశ్నించారు. మరికొందరు మారియా అసలు పేరు బోరిస్‌ అంటూ ఖాయం చేశారు.


సాశా పూర్తి పేరు సాశా అకా నటాషా ఒబామా. ఆమె పూర్తి పేరు ఎప్పుడూ ప్రస్తావనకు రాకపోవడంతో అందరికి నటాషా పేరు తెలిసి ఉండకపోవచ్చు. కానీ మార్తాస్‌ వైన్‌యార్డ్‌ దీవిలోని ఓ రిస్టారెంట్‌లో గత వేసవిలో సాశా పనిచేసినప్పుడు ఆమె పూర్తిపేరును మొదటిసారి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement