ఢిల్లీ : తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన బాహుబలి సిరీస్ గురించి ప్రత్యేకంగా మాట్లాడనవసరం లేదు. భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రంగా బాహుబలి ఫ్రాంచైజీ నిలిచింది. ముఖ్యంగా బాహుబలి 2 సినిమా ఇండియన్ సినిమా రికార్డులన్నింటిని తిరగరాసింది. ఇప్పటికీ భారతీయ సినిమాల్లో తనకంటూ ప్రత్యేకస్థానం సంపాదించిన బాహుబలి 2 సినిమా రష్యాలోనూ ఇరగదీస్తోంది. అయితే థియోటర్లో అనుకుంటే మాత్రం పొరపాటే.. ఎందుకంటే ఇప్పుడు ఆ సినిమా అక్కడి టీవీ చానెల్‌లో ప్లే అవుతుంది. రష్యన్ వాయిస్‌ఓవర్‌తో డబ్బింగ్ చేసి విడుదల చేసిన బాహుబలి 2 సినిమా అక్కడి టీవీల్లో దుమ్ముదులుపుతుంది. (నిరాడంబరంగా నటుడి వివాహం)
తాజాగా సినిమాలోని ఒకసన్నివేశాన్ని రష్యన్ వాయిస్ ఓవర్‌తో ఉన్న డైలాగ్‌తో రష్యన్ ఎంబసీ తమ ట్విటర్లో షేర్ చేసింది. ఈ సందర్భంగా ' ఒక ఇండియన్ సినిమా రష్యాలో ఇంత పాపులారిటీ దక్కించుకోవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు. బాహుబలి 2 సినిమా రష్యన్ వాయిస్ ఓవర్‌లో టీవీల్లో ప్లే అవుతుంది' అంటూ క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. భారతీయ నెటిజన్లు ఒక భారతీయ సినిమాను రష్యాలో విడుదల చేయడం సంతోషంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. బాహుబలి తర్వాత కేజీఎఫ్ సినిమాను కూడా రష్యన్ వాయిస్‌ఓవర్‌తో విడుదల చేయాలంటూ కోరుతున్నారు.(బాలయ్య వ్యాఖ్యలపై సి. కళ్యాణ్ వివరణ)
దాదాపు రూ. 250 కోట్లతో తెరకెక్కిన బాహుబలి 2 ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక బాహుబలి సిరీస్ ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాలం, కన్నడ, హిందీ, చైనీస్, జపనీస్ భాషల్లో రిలీజై దాదాపు రూ. 2600 కోట్లు కొల్లగొట్టింది. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రెండు బాగాలుగా తెరకెక్కిన బాహుబలి సిరీస్‌లో యంగ్ రెబల్ స్టార్ ప్రబాస్, అనుష్క, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌లు కీలక పాత్రలు పోషించారు.
Comments
Please login to add a commentAdd a comment