
నూతన సంవత్సరం రోజున టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిక్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా హార్దిక్, నటాషాలు దుబాయ్‌లో స్పీడ్ బోట్‌లో విహరిస్తూ నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలను పాండ్యా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అతనికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా హార్దిక్ సోదరుడు కృనాల్ పాండ్యా నిశ్చితార్థంపై ట్విటర్‌లో స్పందించాడు.
' మొదట హార్దిక్, నటాషాలకు నా బిగ్ కంగ్రాట్స్. నటాషా మీకు మా కుటుంబంలోకి స్వాగతం. నటాషా నీవు మా క్రేజీ ఫ్యామిలీతో కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది. వెల్‌కమ్ టూ మ్యాడ్‌నెస్.. లవ్ బోత్ ఆఫ్ యూ గాయ్స్' అని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా కృనాల్ దంపతులతో పాటు హార్దిక్, నటాషాలున్న ఫోటోను ట్విటర్‌లో షేర్ చేశాడు. అంతకుముందు కోహ్లి దంపతులు, ధోని దంపతులు, టీమిండియా క్రికెటర్లు కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, ఇషాన్ కిషన్ తదితర ఆటగాళ్లు హార్దిక్, నటాషాలకు శుభాకాంక్షలు తెలిపారు.
కాగా హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పితో బాధపడుతూ బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లతో జరిగిన వన్డే, టీ20 సిరీస్‌లకు దూరమయ్యాడు. రానున్న శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లకు కూడా జట్టు మేనేజ్‌మెంట్ అతన్ని ఎంపిక చేయలేదు. కానీ న్యూజిలాండ్ టూర్‌లో ఆడనున్న ఇండియా-ఏకు మాత్రం హార్దిక్ పాండ్యా పేరును బీసీసీఐ ప్రకటించింది. (చదవండి : సెర్బియా నటితో హార్దిక్ పాండ్యా నిశ్చితార్థం)
Big, big, congratulations @hardikpandya7 and Natasa ❤🤗 Natasa, we're so happy to have you join our crazy fam ❤ Welcome to the madness!! Love both of you guys 🤗 pic.twitter.com/iKFAbqyl42
— Krunal Pandya (@krunalpandya24) January 2, 2020