మిస్‌ యూ నాన్న: కృనాల్‌ | Krunal Pandya Emotional Tweet About His Father Himashu Pandya | Sakshi
Sakshi News home page

మిస్‌ యూ నాన్న: కృనాల్‌

Published Wed, Feb 3 2021 8:00 PM | Last Updated on Wed, Feb 3 2021 8:44 PM

Krunal Pandya Emotional Tweet About His Father Himashu Pandya - Sakshi

ముంబై: టీమిండియా క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యా తన తండ్రి హిమాన్షు పాండ్యాను తలచుకుంటూ ఎమోషనల్‌ ట్వీట్‌ చేశాడు. తండ్రితో కలిసి ఉన్న మొమరబుల్‌ మూమెంట్స్‌ను వీడియో రూపంలో పంచుకున్నాడు. 'మీరు దూరమయ్యారన్న బాధ నుంచి బయటికి రావడం కష్టంగా ఉంది. మీ జ్ఞాపకాల నుంచి ఇప్పటికి బయటికి రాలేకపోతున్నాం. మీరు భౌతికంగా దూరమైనా.. మీ గురించి చెప్పాల్సినవి.. చేయాల్సినవి చాలా ఉన్నాయి.. మిస్‌ యూ పప్పా..' అంటూ ఎమోషన్‌ల్‌ అయ్యాడు. చదవండి: 'నేను కావాలని చేయలేదు.. క్షమించండి'

కృనాల్‌ పాండ్యా టీమిండియా తరపున 18 టీ20లు ఆడి 121 పరుగులు చేయగా.. బౌలింగ్‌లో 14 వికెట్లు తీశాడు. కాగా మంగళవారం కృనాల్‌ సోదరుడు, ఆల్‌రౌండర్‌‌ హార్దిక్‌ పాండ్యా కూడా తన తండ్రిని స్మరించుకుంటూ ఎమోషన్‌ల్‌ ట్వీట్‌ చేశాడు. గత జనవరి 16న హిమాన్షు పాండ్యా గుండెపోటుకు గురై మరణించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement