'నా తమ్ముడు ఏం మారలేదు' | Hardik Pandya Throwback Picture With Brother Krunal Pandya | Sakshi
Sakshi News home page

'నా తమ్ముడు అప్పుడు.. ఇప్పుడు ఏం మారలేదు'

Published Tue, Apr 21 2020 3:06 PM | Last Updated on Thu, Apr 23 2020 8:06 PM

Hardik Pandya Throwback Picture With Brother Krunal Pandya - Sakshi

ముంబై : కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో క్రీడలన్ని వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన ఆటగాళ్లలో కొందరు తమవాళ్లతో సరదాగా గడుపుతుంటే.. మరికొందరు మాత్రం తమ చిన్ననాటి జ్ఞాపకాలను ఫోటోల రూపంలో షేర్‌ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 2011లో తన సోదరుడు కృనాల్‌ పాండ్యాతో కలిసి దిగిన ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. ఆ ఫోటోలో కృనాల్‌ వైట్‌ టీషర్ట్‌తో ఉండగా, హార్దిక్‌ మాత్రం బ్లాక్‌ టీషర్ట్‌, మెడలో చైన్, కళ్లకు గాగుల్స్‌తో కాస్త కొత్తగా కనిపించాడు. ఈ ఫోటోకు 'త్రో బ్యాక్‌ టు 2011.. స్వాగ్‌ మేరా దేశ్‌ హై విత్‌ కృనాల్‌ పాండ్యా' అనే క్యాప్షన్‌ జత చేశాడు. (లాక్‌డౌన్‌: నటాషాకు హిందీ నేర్పిస్తూ..)

'కాలం ఎంతలా మారిపోయింది.. అప్పటిరోజులు తలచుకుంటే మళ్లీ అప్పటి కాలానికి వెళ్లిపోవాలనిపిస్తుంది.. నా సోదరుడు హార్ధిక్‌ అప్పుడు ఎంత స్టైల్‌గా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడంటూ' కృనాల్‌ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా హార్ధిక్‌ పాండ్యా తరచూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటాడు. కరోనాతో ఆటకు విరామం దొరకడంతో తన వాళ్లతో సంతోషంగా గడుపుతున్న మూమెంట్స్‌ను ఒక్కొక్కటిగా రివీల్‌ చేస్తున్నాడు.

ఏప్రిల్‌ మొదటివారంలో సోదరుల దినోత్సవం సందర్భంగా కృనాల్‌, తన సోదరులతో కలిసి ఉన్న ఫోటోను పంచుకున్నాడు. తనకు కాబోయే భార్య నటాషా స్టాన్‌కోవి​క్‌తో సరదాగా గడిపిన వీడియోలతో పాటు తన వర్కౌట్‌ వీడియోలను కూడా షేర్‌ చేశాడు. గతేడాది సెప్టెంబర్‌లో వెన్నునొప్పితో ఆటకు దూరమైన హార్దిక్‌ దక్షిణాఫ్రికాతో జరగబోయే వన్డే సిరీస్‌లో ఆడేందుకు సన్నద్ధమయ్యాడు. ఈలోగా కరోనా మహమ్మారి విజృంభించడంతో సిరీస్‌ రద్దయింది. అయితే కరోనా నేపథ్యంలో ఐపీఎల్‌ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. (క్రికెట్‌ తరహా తప్పిదాలు చేయకండి..!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement