హీరోలకే కాదు హీరోయిన్లకూ వీరాభిమానులు ఉంటారు. కాకపోతే అభిమాన తారలను దగ్గరనుంచి చూడాలని మురిసిపోయే వారు కొందరైతే, కుదిరితే ఆ తారలతో సెల్ఫీ దిగాలని, మరీ కుదిరితే ఏకంగా ఆమె చేయి పట్టుకుని నడవాలని పగటికలలు కనేవాళ్లు మరికొందరు. ఇక్కడ కూడా ఓ నెటిజన్.. తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్‌తో ప్రేమలో పడ్డాడు. కానీ తన ప్రేమను ఆమెకు ఎలా వ్యక్తం చేయాలి? ఆమెను ఎలా బుట్టలో వేసుకోవాలి? అసలు పెళ్లికి ఎలా ఒప్పించాలో అర్థం కాక సతమతమయ్యాడు.
దీనికి పరిష్కారం సూచించమని సదరు హీరోయిన్‌నే సూటిగా ప్రశ్నించాడు. "మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే ఏం చేయాలో చెప్పండి" అని సోషల్ మీడియాలో అడిగేశాడు. దీనికి సదరు నటి స్పందిస్తూ.. "నాతో ప్రయాణం అంటే కొత్తవారికి కొంత కష్టమే! కాబట్టి మీకు నన్ను ఎలా పెళ్లి చేసుకోవాలన్న విషయం తెలియకపోతేనే మంచిది, సురక్షితం కూడా! అని బదులిచ్చింది.
కాగా న్యూస్‌రీడర్‌గా పని చేసిన ప్రియాభవానీ శంకర్ తర్వాత బుల్లితెరపై సందడి చేసింది. ఆ తర్వాత వెండితెరవైపు అడుగులు వేసిన ఆమె పలు తమిళ చిత్రాల్లో నటించింది. గత కొన్నేళ్లుగా ఆమె రాజవేల్‌తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు షికారు చేశాయి. కానీ దీనిపై ప్రియా భవానీ ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఆమె చివరగా బ్లాక్‌బస్టర్ మూవీ 'మాఫియా'లో కనిపించింది. ప్రస్తుతం ఆమె నటించిన నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మంచు మనోజ్ సరసన 'అహం బ్రహ్మాస్మి'లోనూ ప్రియాభవానీ నటిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
చదవండి: రజనీకాంత్ ‘శివాజీ’ మూవీకీ 14 ఏళ్లు: అప్పటి కలెక్షన్స్ ఎంతంటే..
Comments
Please login to add a commentAdd a comment