
బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్‌ల బంధం ఓపెన్ సీక్రెట్. చాలా కాలం పాటు ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో కానీ 2009లో వారిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. బ్రేకప్ చెప్పుకుని వేరే పెళ్లిళ్లు చేసుకున్నారా? అంటే అదీ లేదు. మోస్ట్ వాంటెడ్ బ్యాచిలర్‌గా సల్మాన్ ఖాన్ ఉండగా.. ఇటు మాజీ ప్రేయసి కత్రినా కూడా పెళ్లి ప్రస్తావ ఏమీ లేకుండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికీ వీళ్లిద్దరూ మంచి స్నేహితులుగానే మెలుగుతున్నారు కూడా. సల్మాన్‌తో డేటింగ్‌లో ఉండగానే కత్రినాను కరణ్ జోహార్ తన చాట్ షోలో ఓ ప్రశ్న అడిగారు. ఒకవేళ సల్మాన్ తనను పెళ్లి చేసుకోమని అడిగితే ఏం చెబుతావ్ అని కరణ్ కత్రినాను ప్రశ్నించారు.
దానికి ఆమె ఇచ్చిన సమాధానం కాస్త దిమ్మతిరిగేలానే ఉంది. ‘ఇది చాలా అన్యాయం. నేను ప్రమాణపూర్తిగా చెబుతున్నాను పూర్తిగా మోసం’ అంటూ సమాధానమిచ్చారు. అయితే ఇలా సల్మాన్ తనను అడిగినప్పుడు ఉంటుందని అన్నారు. సల్మాన్, కత్రినాలు దాదాపు నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. చెట్టపట్టాలేసుకుని తిరిగారు. కానీ 2009లో వీరిద్దరూ విడిపోయారు. ఇప్పటికీ వీరిద్దరూ మంచి స్నేహితులుగానే ఉంటూ అన్యోన్యతను ప్రదర్శిస్తూ ఉన్నారు. 2017లో జరిగిన ఇండియా టుడే మైండ్ రాక్స్ గువహటిలో కత్రినా... సల్మాన్‌ను అందలానికి ఎత్తేశారు. సల్మాన్ చాలా అద్భుతమైన వ్యక్తి అంటూ కొనియాడారు. అదేవిధంగా సల్మాన్ కూడా కత్రినాకు తక్కువేమీ కాకుండా.. స్వీటెస్ట్ గర్ల్స్‌లో ఆమె ఒకరంటూ ప్రశంసలు కురిపించారు. టైగర్ జిందా హై సినిమాలో ఇద్దరూ కలిసి నటించారు కూడా. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లను వసూలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment