
ప్రియుడు మోసం చేశాడని.. కోసి పారేసింది!
న్యూఢిల్లీ: ప్రియుడు తనను మోసం చేస్తున్నాడని గ్రహించిన ప్రేయసి తెలివిగా అతడి పురుషాంగాన్ని కోసి పారేసింది. ఈ ఘటన న్యూఢిల్లీలోని మంగోల్‌పురిలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రవి(35) ఓ చిరు వ్యాపారి. స్థానిక మంగోల్‌పురిలో నివాసం ఉండే 23 ఏళ్ల యువతిని గత కొన్నేళ్లుగా ప్రేమిస్తున్నాడు. మొదట్లో యువతి ఇతడిని పట్టించుకోలేదు. కానీ క్రమంగా వీరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. గత నాలుగేళ్లుగా ప్రేమించుకున్న ఈ జంటకు పెళ్లి విషయంలో విభేదాలొచ్చాయి.
యువతి తన కుటుంబాన్ని పెళ్లికి ఒప్పించగా, ప్రియుడు రవి మాత్రం విషయం వచ్చేసరికి దాటవేసేవాడు. ఈ క్రమంలో గత బుధవారం రాత్రి యువతి ఇంటికి రవి వెళ్లగా.. పెళ్లి చేసుకోవాలంటూ యువతి గట్టిగా నిలదీసింది. మా ఇంట్లో వాళ్లు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదని, తనని మరిచిపోవాలిని సూచించగా యువతికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నాలుగేళ్లుగా తనవెంట తిప్పుకుని మోసం చేసిన ప్రియుడికి బుద్ధి చెప్పాలనుకుంది. ఇంట్లో వాళ్లకు కొద్దిసేపు బయటకు వెళ్లమని సూచించిన ఆ యువతి.. ఈ ఒక్కసారి తనతో శృంగారం చేస్తే పెళ్లి మాట ఎత్తనని ప్రియుడిని నమ్మించింది. చివరకు అతడిని నగ్నంగా బాత్రూమ్‌లోకి తీసుకెళ్లింది. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న చాకుతో ప్రియుడి పురుషాంగాన్ని కోసిపారేసింది.
నొప్పిని భరించలేక అతడు సాయం చేయాలని అరుస్తూ బటయకు పరిగెత్తాడు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు బాధితుడు రవిని సంజయ్ గాంధీ మెమొరియల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. సర్జరీ చేసిన వైద్యులు పేషెంట్‌ను జైపూర్ గోల్డెన్ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. యువతి సహా ఆమె కుటుంబసభ్యులు పరారీలో ఉన్నారని విచారణ చేపట్టిన మంగోల్‌పురి పోలీసులు తెలిపారు.