
సాక్షి, న్యూఢిల్లీ: పెళ్లంటూ చేసుకుంటే మన దేశ ప్రధాని నరేంద్ర మోదీనే చేసుకుంటానని ఓ మహిళ అంటుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెంది శాంతి శర్మ అనే 40 ఏళ్ల మహిళ గత నెల రోజులుగా(సెప్టెంబర్ 8 నుంచి) దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తోంది. మోదీని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, తనను మోదీ అర్థం చేసుకుంటారనే నమ్మకం ఉందని మీడియాకు ఆమె తెలిపింది. అంతేకాదు ఇక్కడి నుంచి తనను పంపిస్తే నేరుగా ఆయన ఇంటి ముందు ఆందోళన దిగుతానని చెప్పింది.
శాంతి శర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమెకు 1989లో వివాహం జరిగింది. పెళ్లైయిన సంవత్సరానికే ఆమెను భర్త విడిచిపెట్టాడు. ఆ తరువాత ఆమెను చేసుకుంటామని చాలా మంది ముందుకొచ్చినా నిరాకరించింది. అయితే ప్రస్తుతం తాను నరేంద్ర మోదీని పెళ్లి చేసుకుని ఆయనకు సేవలు చేయాలని నిర్ణయించుకున్నానని.. ప్రధాని సమాధానం కోసం ఎదురు చూస్తున్నానని తెలిపారు. మోదీ తనను చేసుకుంటే తన ఆస్తి మొత్తం అమ్మి రెండు కోట్ల రుపాయలను కట్నంగా ఇస్తానని చెబుతోంది.
ఇదివరకే మోదీకి యశోదా బెన్‌తో పెళ్లి అయిన విషయం తెలిసిందే. పెళ్లైయిన కొద్ది కాలం నుంచే వారు వేరుగా ఉంటున్నారు. ప్రస్తుతం యశోదా బెన్ గుజరాత్‌లోని తన సొంత గ్రామంలోనే ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment