పెళ్లికి అంగీకరించలేదని యువకుడు బాలికపై కత్తితో దాడిచేసి గాయపరిచాడు.
జగిత్యాల: పెళ్లికి అంగీకరించలేదని ఆగ్రహించిన యువకుడు బాలికపై కత్తితో దాడిచేసి గాయపరచిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
తిమ్మాపూర్ గ్రామానికి చెందిన రాకేష్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికను(16) పెళ్లి చేసుకోమని తరుచుగా వేధిస్తూండేవాడు. అందుకు ఆమె అంగీకరించకపోవడంతో ఆగ్రహించిన రాకేష్ ఆదివారం ఉదయం ఒంటరిగా ఉన్న బాలికపై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకునే సరికి రాకేష్ పరారయ్యాడు. గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు.