పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి... ఆ తర్వాత అతను | Madhya Pradesh Girl Injured Man Stabbed Rejected Marriage Proposal | Sakshi
Sakshi News home page

పెళ్లికి నిరాకరిస్తోందని యువతిపై దాడి...ఆ తర్వాత అతను

Aug 31 2022 3:17 PM | Updated on Aug 31 2022 3:17 PM

Madhya Pradesh Girl Injured Man Stabbed Rejected Marriage Proposal - Sakshi

పెళ్లి చేసుకుందామంటూ ఆమె వెంటపడ్డాడు. ఐతే ఆమె అందుకు అస్సలు అంగీకరించటం లేదు. దీంతో ఆమె పై పలుమార్లు కత్తితో దాడి చేసి హతమార్చేందుకు యత్నించాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే...మధ్యప్రదేశ్‌లోని 20 ఏళ్ల యువతిని బబ్లు అనే వ్యక్తి పెళ్లి చేకుందామంటూ వేధించసాగాడు. ఐతే ఆ యువతి అందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహం చెందిన బబ్లు ఆమె ఇంట్లో ఒంటిరిగా ఉన్నసమయంలో కత్తితో దాడి చేసి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని, సదరు యువతిని చికిత్సి నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కానీ ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీస్‌ అధికారి వివేక్‌ సింగ్‌ తెలిపారు. నిందితుడు కోసం గాలిస్తున్న పోలీసులకు బబ్లు ఖడ్వాలోని ఇందిరా సాగర్‌ డ్యామ్‌ సమీపంలో శవమై కనిపించాడని తెలిపారు. బహుశా ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి సోదరి బబ్లు అనే వ్యక్తి పక్కనే ఉన్న గ్రామంలో వాచ్‌మేన్‌గా పనిచేస్తుంటాడని తెలిపింది.

ఐతే ఆ బబ్లు అనే వ్యక్తి తన అక్కను పెళ్లి చేసుకోవాలని పదే పదే బలవంతం చేస్తున్నాడని పేర్కొంది. వాళ్ల అమ్మనాన్నలు ఊరెళ్లడంతో తామిద్దరమే ఇంట్లో ఉన్నామని, ఆ సమయంలోనే బబ్లు వచ్చి అక్క పై దాడి చేసి వెళ్లిపోయాడని చెప్పింది. తాను ఆ సమయంలో ఇంటి బయట బకెట్‌లో నీళ్లు నింపుతుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితురాలి చెల్లెలు చెప్పిందని పోలీసులు పేర్కొన్నారు. ఐతే ఈ ఘటనపై తాము పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని పోలీసులు వెల్లడించారు.

(చదవండి: కుడి చేతిపై లవ్‌ సింబల్‌.. భార్య ప్రవర్తనతో భర్త షాక్‌.. చివరికి ఏం చేశాడంటే?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement