Viral Meme Video: Shaheen Afridi Dismisses Shahid Afridi With Suno Sasurji Song - Sakshi
Sakshi News home page

'మామా.. ఇప్పటికైనా మీ పంతం వదిలేయండి'

Published Wed, Mar 10 2021 2:06 PM | Last Updated on Wed, Mar 10 2021 3:01 PM

Video Of Shaheen Afridi Dismissing Shahid Afridi Goes Viral Hit Song - Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ యంగ్‌ క్రికెటర్‌ షాహిన్‌ అఫ్రిది.. ఆ జట్టు మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది ఇంటి అల్లుడిగా అడుగుపెట్టనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అఫ్రిది పెద్ద కూతురు అక్సాను షాహిన్‌కు ఇచ్చి చేయనున్నారని.. త్వరలోనే వీరి నిశ్చితార్థం జరగనుందనే పుకార్లు కూడా ఉన్నాయి. షాహిన్‌ అఫ్రిది తండ్రి అయాజ్‌ ఖాన్‌ షాహిద్‌ కుటుంబాన్ని కలిసి పెళ్లి ప్రపోజల్‌ తీసుకువచ్చారని.. అందుకు వారి కుటుంబం అంగీకరించారంటూ కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించాయి. ఈ విషయంపై షాహిద్‌ తన ట్విటర్‌లో స్పందించాడు. ''వారు సంప్రదించిన మాట నిజమే.. కానీ ఇంకా చర్చల దశలోనే ఉంది.'' అంటూ తెలిపాడు.

ఇదిలా ఉండగా.. కాబోయే మామ, అల్లుడిపై మాత్రం సోషల్‌ మీడియాలో విపరీతమైన మీమ్స్‌ వస్తున్నాయి. పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ సందర్భంగా షాహిద్‌ అఫ్రిది ముల్తాన్‌ సుల్తాన్‌కు,  షాహిన్‌ అఫ్రిది క్వెటా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఒక మ్యాచ్‌ సందర్భంగా.. షాహిన్‌ వేసిన ఒక ఓవర్‌లో షాహిద్‌ అఫ్రిది సిక్స్‌ కొట్టాడు. అయితే ఆ తర్వాతి బంతికే అఫ్రిది షాహిన్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఈ సన్నివేశాన్ని అభిమానులు తమదైన  శైలిలో మీమ్‌ చేశారు. బాలీవుడ్‌ హిట్‌ సినిమా దుల్హే రాజాలోని ''సునో సస్రూజీ అబ్‌ జిద్‌ చాడో'' అంటూ సాగిన పాటను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టారు. ''మామా.. ఇప్పటికైనా మీ మొండితనాన్ని వదిలేయండి'' అనేది ఈ పాట అర్థం. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 
చదవండి:
అఫ్రిది కూతురితో షాహిన్‌ అఫ్రిది నిశ్చితార్థం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement