
మౌనదీక్ష చేపట్టిన పద్మ
కామేపల్లి: మండల పరిధిలోని పొన్నెకల్లు గ్రామపంచాయతీ పరిధిలోని బర్లగూడెం గ్రామంలో ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు మౌనదీక్ష చేపట్టిన ఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కామేపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరాంనగర్‌కు చెందిన అమ్మాయి భూక్య పద్మ, బర్లగూడెం గ్రామానికి చెందిన నూనావత్ కిశోర్ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. కిషోర్ పాల్వంచ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. పద్మ బీఈడీ చదువుతోంది.
అయితే ఇరువురి కుటుంబ సభ్యులు వివాహానికి ఒప్పుకొని కట్నంగా రూ.15 లక్షలు ఇస్తామని చర్చలు జరిపారు. కొంతకాలంగా కిశోర్ ముఖం చాటేయడంతోపాటు, వేరే సంబంధాలు చూస్తుండటంతో పద్మ కిషోర్ ఇంటి ఎదుట దీక్షను చేపట్టింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment