![Anchor Sreemukhi Shocking Reaction When Fan Post About Marriage - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/8/Untitled-5_0.jpg.webp?itok=f1tTp2fJ)
ఓ వైపు బుల్లితెరపై యాంకర్‌గా, మరో వైపు వెండితెరపై నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించింది అందాల ముద్దు గుమ్మ శ్రీముఖి. ఇక బుల్లితెరపై పటాస్ షో శ్రీముఖిని టాప్ ప్లేస్‌కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఇటీవల నెటిజన్లతో పర్శనల్ విషయాలను షేర్ చేసుకుంటూ, వారి కామెంట్లకు తనదైన శైలిలో సమాధానాలిస్తోంది ఈ అమ్మడు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నెటిజన్‌తో ముచ్చటిస్తుండగా శ్రీముఖికి ఓ వింత ప్రశ్న ఎదురైంది.
గత కొన్నేళ్ల నుంచి తరచూ శ్రీముఖికి సంబంధించిన పెళ్లి వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. ఇందుకు ఆమె పలు షోలలో చేసిన కామెంట్లు కూడా ఇలాంటి వార్తలు రావడానికి కారణమవుతున్నాయి. యాంకర్‌గా పటాస్ షో తరువాత ఈ అమ్మడు చేసిన షోలు ఆశించిన స్థాయిలో హిట్ కాలేదనే చెప్పాలి. ఇటీవల ఇన్‌స్టాలో ఓ నెటిజన్‌తో ముచ్చటిస్తుండగా.. ఆ వ్యక్తి శ్రీముఖికి పెళ్లి సంబంధం చూసినట్టుగా చెప్పుకొచ్చాడు. ‘అక్క నీకు ఒక మంచి మ్యాచ్ ఉంది మాట్లాడమంటావా.. నీకు సరిగ్గా సరిపోతాడని తెలిపాడు. దీనకి శ్రీముఖి నవ్వుతూ ఎవరిదంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చింది. ఈ ప్రపోజల్ తెచ్చిన నెటిజన్ ఎవరనేది చెప్పకపోవడంతో శ్రీముఖికి నెటిజన్ చూసిన సంబంధంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment