పెర్త్: ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సాఫ్ట్ బాల్ టోర్నీ సందర్భంగా ఓ మహిళా క్రీడాకారిణి.. తన ప్రేయసికి వినూత్నంగా ప్రపోజ్ చేసింది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో గాయపడినట్లు నటించి ప్రియురాలి ముందు పెళ్లి ప్రపోజల్ ఉంచింది. పిచ్‌పైనే తనను మనువాడాలని కోరి మైదానంలో ఉన్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది.
Wait for it… pic.twitter.com/gZ3tTxnJ9w
— Rex Chapman🏇🏼 (@RexChapman) December 10, 2021
వివరాల్లోకి వెళితే.. సారా రియో, జసింతా కమాండే రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ప్రొఫెషనల్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణులైన ఈ ఇద్దరు ఓ లీగ్ గేమ్‌లో ఆడుతుండగా.. సారా రియో స్టాండ్స్‌లో ఉన్న ప్రేయసి జసింతా ముందు వెరైటీగా పెళ్లి ప్రతిపాదనను ఉంచింది. సారా మ్యాచ్ మధ్యలో గాయపడినట్లు నటించడంతో స్టాండ్స్‌లో ఉన్న జసింతా మైదానంలోని పరిగెత్తుకుంటూ వచ్చింది.
అప్పటివరకు పడిపోయినట్లు నటించిన సారా.. జసింతా రావడంతోనే మోకాళ్లపై నిల్చోని తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఊహించని ఈ పరిణామంతో జసింతా సహా మైదానంలో ఉన్న వారంతా అవాక్కయ్యారు. అనంతరం తేరుకున్న జసింతా ప్రేయసి సారాను హత్తుకోవడంతో మైదానం మొత్తం చప్పట్లతో హోరెత్తింది. కాగా, టోర్నీలోని కీలక మ్యాచ్ కావడంతో సారా తన మిత్రులు, కుటుంబ సభ్యులనందరీని ఆహ్వానించి మరీ వారందరి సమక్షంలోనే ఇష్ట సఖి ముందు పెళ్లి ప్రతిపాదనను ఉంచింది.
చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం..
Comments
Please login to add a commentAdd a comment