softball tourny
-
ప్రేయసికి వెరైటీగా ప్రపోజ్ చేసిన ఆసీస్ మహిళ.. ఎలాగో చూడండి..!
పెర్త్: ఆస్ట్రేలియాలో జరిగిన ఓ సాఫ్ట్ బాల్ టోర్నీ సందర్భంగా ఓ మహిళా క్రీడాకారిణి.. తన ప్రేయసికి వినూత్నంగా ప్రపోజ్ చేసింది. మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో గాయపడినట్లు నటించి ప్రియురాలి ముందు పెళ్లి ప్రపోజల్ ఉంచింది. పిచ్‌పైనే తనను మనువాడాలని కోరి మైదానంలో ఉన్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. Wait for it… pic.twitter.com/gZ3tTxnJ9w — Rex Chapman🏇🏼 (@RexChapman) December 10, 2021 వివరాల్లోకి వెళితే.. సారా రియో, జసింతా కమాండే రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. ప్రొఫెషనల్ సాఫ్ట్‌బాల్ క్రీడాకారిణులైన ఈ ఇద్దరు ఓ లీగ్ గేమ్‌లో ఆడుతుండగా.. సారా రియో స్టాండ్స్‌లో ఉన్న ప్రేయసి జసింతా ముందు వెరైటీగా పెళ్లి ప్రతిపాదనను ఉంచింది. సారా మ్యాచ్ మధ్యలో గాయపడినట్లు నటించడంతో స్టాండ్స్‌లో ఉన్న జసింతా మైదానంలోని పరిగెత్తుకుంటూ వచ్చింది. అప్పటివరకు పడిపోయినట్లు నటించిన సారా.. జసింతా రావడంతోనే మోకాళ్లపై నిల్చోని తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. ఊహించని ఈ పరిణామంతో జసింతా సహా మైదానంలో ఉన్న వారంతా అవాక్కయ్యారు. అనంతరం తేరుకున్న జసింతా ప్రేయసి సారాను హత్తుకోవడంతో మైదానం మొత్తం చప్పట్లతో హోరెత్తింది. కాగా, టోర్నీలోని కీలక మ్యాచ్ కావడంతో సారా తన మిత్రులు, కుటుంబ సభ్యులనందరీని ఆహ్వానించి మరీ వారందరి సమక్షంలోనే ఇష్ట సఖి ముందు పెళ్లి ప్రతిపాదనను ఉంచింది. చదవండి: విజయ్ హజారే ట్రోఫీలో తెలుగు కుర్రాడి విధ్వంసం.. -
ఛత్తీస్‌గఢ్ హ్యాట్రిక్
–ముగిసిన 38వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీ –వరుసగా మూడోసారి విజేతగా నిలిచిన ఛత్తీస్‌గఢ్ బాలుర జట్టు –బాలికల విజేత పంజాబ్ అనంతపురం సప్తగిరి సర్కిల్ : జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీలో ఛత్తీస్‌గఢ్ బాలుర జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. శనివారం అనంత క్రీడాగ్రామంలో జరిగిన 38వ టోర్నీ ఫైనల్æమ్యాచ్‌లో మహారాష్ట్రను 6–2 స్కోరు తేడాతో ఓడించింది. ఈ జట్టు ఇంతకుముందు నాగ్‌పూర్‌లో జరిగిన 36వ టోర్నీ, చండీఘడ్‌లో జరిగిన 37వ టోర్నీలోనూ విజేతగా నిలవడం గమనార్హం. కాగా..ప్రస్తుత టోర్నీలో కేరళ బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో పంజాబ్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఫైనల్లో కేరళను 5–2తో ఓడించింది. మధ్యప్రదేశ్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. క్రీడాభివద్ధికి కృషి : పల్లె రాష్ట్రంలో క్రీడాభివద్ధికి కృషి చేస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. 38వ జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి పల్లెతో పాటు జెడ్పీ చైర్మన్ చమన్, జాయింట్ కలెక్టర్–2 ఖాజామోహిద్దీన్, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్, అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎమీబ్రాన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, నియోజకవర్గానికో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు సిలబస్‌లో క్రీడలను పాఠ్యాంశంగా చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జాతీయ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సీఈఓ ప్రవీణ్అనౌకర్, ట్రెజరర్ శ్రీకాంత్ థోరట్, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు, చైర్మన్ నరసింహం, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డీఈఓ అంజయ్య, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆఖరి ఘట్టం
తుదిపోరులో ఉత్తరాది రాష్ట్రాలు సెమీస్‌లో ఓడిన ఆంధ్ర బాలుర జట్టు సత్తాచాటుకున్న మధ్యప్రదేశ్ బాలికలు అనంతపురం సప్తగిరి సర్కిల్ : మూడు రోజులుగా అనంత క్రీడాగ్రామంలో జరుగుతున్న జాతీయ 38వ సాఫ్ట్‌బాల్ టోర్నీ తుదిదశకు చేరుకుంది. శనివారం జరిగే ఫైనల్స్‌లో ఉత్తరాది జట్లు తలపడనున్నట్లు రాష్ట్ర సాఫ్ట్‌బాల్ కార్యదర్శి వెంకటేశులు, జిల్లా అధ్యక్షుడు నాగరాజు తెలిపారు. టోర్నీ ఫెవరేట్‌గా బరిలో దిగిన ఆంధ్ర బాలుర జట్టు శుక్రవారం మహారాష్ట్ర జట్టుతో సాగిన ఉత్కంఠభరిత పోరులో పరాజయం పాలైంది. దీంతో అతిథ్య జట్టు టోర్నీ నుంచి వైదొలిగినట్లైంది. ఉత్తరాది క్రీడాకారుల ధాటికి దక్షిణాది ఆటగాళ్లు తాళలేకపోయారు. సూపర్ లీగ్ పోటీల వివరాలు ఇలా... సూపర్‌లీగ్ బాలుర విభాగంలో హర్యానపై ఆంధ్ర, కర్ణాటకపై మహారాష్ట్ర, మరో మ్యాచ్‌లో కర్ణాటకపై మధ్యప్రదేశ్ జట్లు భారీ విజయాన్ని నమోదు చేశాయి. ఏకపక్షంగా సాగిన ఈ పోటీల్లో ప్రత్యర్థి జట్టుకు ఒక్క పాయింట్ కూడా దక్కకపోవడం గమనార్హం. ఇక పంజాబ్‌పై చత్తీస్ఘడ్ (1–9), మధ్యప్రదేశ్‌పై కేరళ (7–10), పంజాబ్‌పై హర్యానా (4–7), మహారాష్ట్రపై కేరళ (3–5) జట్లు గెలుపొందాయి. బాలికల విభాగంలో ఒడిశాపై మధ్యప్రదేశ్ క్రీడాకారిణులు 6–0 పాయింట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేశారు. హిమాచల్‌ప్రదేశ్‌పై మహారాష్ట్ర (1–3), ఢిల్లీపై పంజాబ్ (2–3), ఒడిశాపై కేరళ (5–9), చండీఘడ్‌పై మధ్యప్రదేశ్ (1–6), ఢిల్లీపై మహారాష్ట్ర (1–9), చండీఘడ్‌పై కేరళ (6–17) జట్లు గెలుపొందాయి. సెమీస్ విజేతలు వీరే.. సెమీస్‌లో తలపడిన బాలుర విభాగంలో ఆంధ్ర జట్టు క్రీడాకారులపై మహారాష్ట్ర క్రీడాకారులు ఆది నుంచి ఆధిపత్యం కొనసాగిస్తూ వచ్చారు. ఉత్కంఠగా సాగిన పోరులో ఎనిమిది పాయింట్ల తేడాతో మహారాష్ట జట్టు గెలుపొందింది. కేరళపై జరిగిన ఆసక్తికర పోరులో చత్తీస్ఘడ్ క్రీడాకారులు భారీ విజయాన్ని నమోదు చేశారు. ఈ పోటీలో ప్రత్యర్థి జట్టుకు ఒక్కపాయింట్ కూడా దక్కకుండా చేసి ఫైనల్స్‌కు చేరుకుంది. శనివారం జరిగే తుదిపోరులో మహారాష్ట్ర, చత్తీస్ఘడ్ జట్లు తలపడనున్నాయి. అలాగే బాలికల విభాగంలో కేరళపై పంజాబ్ (4–5), మహారాష్ట్రపై మధ్యప్రదేశ్ (2–8) జట్లు గెలుపొందాయి. బాలిక విభాగంలో తుదిపోరు పంజాబ్ మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరగనుంది.