ఛత్తీస్‌గఢ్ హ్యాట్రిక్
–ముగిసిన 38వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీ
–వరుసగా మూడోసారి విజేతగా నిలిచిన ఛత్తీస్‌గఢ్ బాలుర జట్టు
–బాలికల విజేత పంజాబ్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ టోర్నీలో ఛత్తీస్‌గఢ్ బాలుర జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలిచింది. శనివారం అనంత క్రీడాగ్రామంలో జరిగిన 38వ టోర్నీ ఫైనల్æమ్యాచ్‌లో మహారాష్ట్రను 6–2 స్కోరు తేడాతో ఓడించింది. ఈ జట్టు ఇంతకుముందు నాగ్‌పూర్‌లో జరిగిన 36వ టోర్నీ, చండీఘడ్‌లో జరిగిన 37వ టోర్నీలోనూ విజేతగా నిలవడం గమనార్హం. కాగా..ప్రస్తుత టోర్నీలో కేరళ బాలుర జట్టు మూడో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో పంజాబ్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. ఫైనల్‌లో కేరళను 5–2తో ఓడించింది. మధ్యప్రదేశ్ మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
క్రీడాభివద్ధికి కృషి : పల్లె
రాష్ట్రంలో క్రీడాభివద్ధికి కృషి చేస్తామని మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. 38వ జాతీయ సాఫ్ట్‌బాల్ టోర్నీ ముగింపు కార్యక్రమానికి పల్లెతో పాటు జెడ్పీ చైర్మన్ చమన్, జాయింట్ కలెక్టర్–2 ఖాజామోహిద్దీన్, ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నే ఫెర్రర్, అంతర్జాతీయ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ జనరల్ ఎమీబ్రాన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ, నియోజకవర్గానికో మినీ స్టేడియం ఏర్పాటు చేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకు సిలబస్‌లో క్రీడలను పాఠ్యాంశంగా చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జాతీయ సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సీఈఓ ప్రవీణ్‌అనౌకర్, ట్రెజరర్ శ్రీకాంత్ థోరట్, రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి వెంకటేశులు, చైర్మన్ నరసింహం, జిల్లా అధ్యక్షుడు నాగరాజు, డీఈఓ అంజయ్య, ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ నిర్మల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.