తప్పుదిద్దుకున్న శోభా డే | Shobhaa De Hails 'Hero' PV Sindhu's Olympic Feat | Sakshi
Sakshi News home page

తప్పుదిద్దుకున్న శోభా డే

Published Sun, Aug 21 2016 9:18 AM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

తప్పుదిద్దుకున్న శోభా డే

తప్పుదిద్దుకున్న శోభా డే

ముంబై: ఒలింపిక్ లో రజత పతక విజేత, తెలుగు తేజం పీవీ సింధు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి శోభా డే తన తప్పును తెలుసుకున్నారు. వెండి పథకాన్ని సాధించిన  సింధు 24 కారెట్ల బంగారమని, ఆమె  హీరో అని పొగడ్తల వర్షం కురిపించారు.
ధైర్యశాలి సింధు నిజమైన హీరో అని వ్యాఖ్యానించారు. 24 క్యారెట్ల బంగారమా, మేము నిన్ను ప్రేమిస్తున్నాము అని ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.

పీవీ సింధు, దీపా కర్మాంకర్,  సాక్షి మలిక్ విజయ గాథలను పోస్ట్ చేశారు. సింధు జీవితంపై సినిమా తీయాలని, ఇందులో దీపికా పదుకోన్ లీడ్ రోల్ లో  నటించాలని అన్నారు. దీపిక కన్నా బాగా ఇంకెవరు నటిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు.భారత క్రీడాకారులను పతకాలు రావని వారు కేవలం సెల్ఫీలు తీసుకోవడానికే రియోకు వెళ్లారని, వారిపై చేసే ఖర్చంతా వృధా  అని గంతంలో శోభా ట్వీట్ చేశారు. దీనిపై  వివిధ రంగాల ప్రముఖుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement