'అతడి కోసమే బాహుబలి 2 చూస్తా' | I just to watch Baahubali 2 for Kattappa, says Shobhaa De | Sakshi
Sakshi News home page

'అతడి కోసమే బాహుబలి 2 చూస్తా'

Published Fri, Jul 24 2015 12:29 PM | Last Updated on Sun, Sep 3 2017 6:06 AM

'అతడి కోసమే బాహుబలి 2 చూస్తా'

'అతడి కోసమే బాహుబలి 2 చూస్తా'

ముంబై: 'బాహుబలి' సినిమాలో కట్టప్ప పాత్ర తనకెంతో నచ్చిందని ప్రముఖ రచయిత్రి, కాలమిస్టు శోభా డే పేర్కొన్నారు. రాజకుంటుబానికి నమ్మిన బంటుగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ ఒదిగిపోయారని ప్రశంసించారు. కట్టప్ప పాత్ర కోసమే 'బాహుబలి 2' టిక్కెట్ ను ముందుగా బుక్ చేసుకుంటానని వ్యాఖ్యానించారు. 'బాహుబలి' సినిమాపై తన అభిప్రాయాన్ని 'ఎన్డీటీవీ'కి రాసిన వ్యాసంలో నిర్మోహమాటంగా వెల్లడించారు.

ప్రభాస్, రానా ఆయా పాత్రలకు సరిగ్గా సరిపోయారని పేర్కొన్నారు. రాజమాతగా నటించిన రమ్యకృష్ణ కట్టిన తొమ్మిది గజాలు చీరలు సూపర్ గా ఉన్నాయన్నారు. అయితే గిరిజనులను శత్రువులుగా చూపిన విధానం అభ్యంతరకరమన్నారు. ఇంగ్లీషులో హిట్టైన సినిమాలను బాగా స్టడీ చేసి అవసరమైన ఎలిమెంట్స్ 'బాహుబలి'లో ఉండేలా దర్శకుడు రాజమౌళి జాగ్రత్త పడ్డారని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement