ఆ ఫొటో ట్వీట్‌పై పోలీసుల ఘాటు రిప్లై! | Police gave a reply to writer punny tweet | Sakshi
Sakshi News home page

ఆ ఫొటో ట్వీట్‌పై పోలీసుల ఘాటు రిప్లై!

Published Wed, Feb 22 2017 12:34 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

ఆ ఫొటో ట్వీట్‌పై పోలీసుల ఘాటు రిప్లై! - Sakshi

ఆ ఫొటో ట్వీట్‌పై పోలీసుల ఘాటు రిప్లై!

ముంబై: ప్రముఖ రచయిత్రి శోభా డే పోలీసులను ఎద్దేవా చేస్తూ పెట్టిన ఓ ట్వీట్‌ పెద్ద దుమారమే రేపింది. అధిక బరువున్న ఓ పోలీసు కానిస్టేబుల్‌ ఫొటోను పెట్టి.. 'ముంబైలో ఈ రోజు హెవీ పోలీసు బందోబస్తు ఉందం'టూ పరిహాసపు వ్యాఖ్యను పెట్టారు. ఆమె ట్వీట్‌పై ముంబై పోలీసులు ఒకింత ఘాటుగా స్పందించారు. బాధ్యతయుతంగా ఉండాలంటూ పరోక్షంగా మదలించారు. 'శోభా డేగారు మీ హాస్యపు వ్యాఖ్యలను మేం కూడా ఇష్టపడుతాం. కానీ ఈసారి మీరు పూర్తిగా పొరపాటు వ్యాఖ్య చేశారు. ఆ యూనిఫామ్‌ గానీ, అధికారిగానీ ముంబై పోలీసుశాఖకు చెందినవారు కాదు. ఒక బాధ్యతాయుతమైన మీ లాంటి పౌరుల నుంచి మరింత హుందాతనాన్ని మేం ఆశిస్తున్నాం' అంటూ చురకలు అంటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement