నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్! | Telangana MLA Raja Singh Shocking Comments On Nayanathara Annapoorani Movie, Interesting Deets Inside - Sakshi
Sakshi News home page

Annapoorani Movie Controversy: నయనతార 'అన్నపూరణి'.. తెలంగాణ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్!

Published Fri, Jan 12 2024 6:50 PM | Last Updated on Fri, Jan 12 2024 7:11 PM

Telangana MLA Shocking Comments On Nayanathara Annapoorani Movie - Sakshi

కొత్త ఏడాదిలో నయనతార కలిసి రావడం లేదు. ఆమె నటించిన అన్నపూరణి చిత్రం పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఇప్పటికే ఈ చిత్రంపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సైతం స్ట్రీమింగ్‌ నుంచి తొలగించింది. తాజాగా ఈ చిత్రంపై తెలంగాణ భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన జీ స్టూడియోస్‌పై పూర్తిగా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి సినిమాలు గతంలో కూడా వచ్చాయని.. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు తలెత్తకుండా దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోమంత్రి అమిషాకు విజ్ఞప్తి చేశారు. 

అన్నపూరణి సినిమాపై ఎమ్మెల్యే టి.రాజా సింగ్ మాట్లాడుతూ..'జీ స్టూడియోస్ క్షమాపణలు చెప్పిందని విన్నా. కానీ క్షమాపణలు చెప్పినా ఇలాంటివీ రిపిట్ అవుతూనే ఉంటాయి. గతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఇలాంటి సినిమాలు చేయడం మనం చాలాసార్లు చూశాం. ఈ వివాదానికి కారణమైన జీ స్టూడియోస్‌ను పూర్తిగా నిషేధించాలని.. ఇలాంటి సినిమాలు తీసే దర్శకులు, నటీనటులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేస్తున్నా' అని వీడియోలో కోరారు.

 కోలీవుడ్ సూపర్‌ స్టార్ నయనతార నటించిన చిత్రం అన్నపూరణిపై ఇప్పటికే మహారాష్ట్రలో మాజీ శివసేన లీడర్ రమేశ్ సోలంకి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా మధ్యప్రదేశ్‌లోనూ ఈ సినిమాపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్ తమ ఫ్లాట్‌ఫామ్ నుంచి పూర్తిగా తొలగించింది. ఈ సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతియడమే కాకుండా.. లవ్‌ జీహాద్‌ను ప్రొత్సహించేలా ఉందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజైన సంగతి తెలిసిందే.

స్పందించిన మేకర్స్

అన్నపూరణి వివాదం తర్వాత జీ స్టూడియోస్ ఒక ప్రకటన విడుదల చేసింది. అభ్యంతరకర సన్నివేశంలో అవసరమైన మార్పులు చేసేవరకు సినిమాను నెట్‌ఫ్లిక్స్ నుంచి తీసివేస్తామని హామీ ఇచ్చారు. మాకు  ఎవరీ మనోభావాలను దెబ్బతీసే  ఉద్దేశ్యం లేదని తెలిపింది. ఈ విషయంపై క్షమాపణలు కోరుతున్నాం అంటూ ప్రకటనలో వెల్లడించింది. కాగా..  నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన అన్నపూరణిలో నయనతార ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రంలో కార్తీక్ కుమార్, జై, సత్యరాజ్, పూర్ణిమ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement