‘‘విడుదల–1’లో కేవలం పాత్రలు ఎస్టాబ్లిష్ మాత్రమే జరిగింది. అయితే కథ అంతా ‘విడుదల–2’ లోనే ఉంటుంది. మొదటి భాగానికి మించి పదిరెట్లు అద్భుతంగా రెండో భాగం ఉంటుంది. ఇందులో పెరుమాళ్ పాత్రలో విజయ్ సేతుపతి అద్భుతమైన నటన, భావోద్వేగాలు చూస్తారు’’ అని నిర్మాత చింతపల్లి రామారావు అన్నారు.
విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో, సూరి, మంజు వారియర్, సూరి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘విడుదల–2’. వెట్రిమారన్ దర్శకత్వంలో ఎల్‌రెడ్ కుమార్ నిర్మించిన ఈ మూవీ తమిళ్, తెలుగులో ఈ నెల 20న విడుదల కానుంది. శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా చింతపల్ల రామారావు మాట్లాడుతూ– ‘‘అణగారిన వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం.. పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి ప్రజల్ని ఎలా బయటపడేలా చేశారు? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలతో తీసిన చిత్రమిది. ఇళయరాజాగారి నేపథ్య సంగీతం ప్రాణంగా నిలుస్తుంది. నేను నిర్మించిన ‘శ్రీ శ్రీ రాజావారు’ చిత్రం రిలీజ్ కానుంది. త్వరలోనే ‘డ్రీమ్ గర్ల్’ అనే మూవీని ప్రారంభించబోతున్నాం. మరో రెండు సినిమాలు సెట్స్ మీదకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయి’’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment