
ధనుష్ హీరోగా వడచైన్నె- 2 చిత్రాన్ని కచ్చితంగా చేస్తానని దర్శకుడు వెట్రిమారన్ పేర్కొన్నారు. 2018లో పార్ట్-1 ఎంత పెద్ద హిట్ అందుకుందో తెలిసిందే. తాజాగా తమిళ్ సినిమా చిత్ర పాత్రికేయుల సంఘం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దర్శకుడు వెట్రిమారన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు ధనుష్ కథా నాయకుడిగా వడచైన్నె - 2 చిత్రాన్ని కచ్చితంగా చేస్తానని ఆయన చెప్పారు. అంతకుముందు రెండు చిత్రాలు చేయాల్సి ఉందన్నారు.
(ఇదీ చదవండి: అర్జున్ కూతురు పెళ్లి ఎప్పుడంటే.. వారి పరిచయం మొదలైంది అక్కడే)
అదే విధంగా నటుడు సూర్య కథా నాయకుడిగా ఆజన్బీ పుస్తకాన్ని చిత్రంగా తెరకెక్కించాలని అసురన్ చిత్ర షూటింగ్ సమయంలోనే నిర్ణియించానన్నారు. షూటింగ్‌కు ప్రారంభించాలనుకున్న సమయంలో కరోనా రావడంతో అది ఆగిపోయిందని చెప్పారు. పార్ట్-2 కథ రెడీగానే ఉంది. త్వరలో హీరో ధనుష్‌తో చర్చిస్తానని ఆయన పేర్కొన్నాడు. తాజాగా తెలుగులో ఆయన దర్శకత్వం వహించిన 'విడుదల' సినిమా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందులో కమెడియన్ సూరి హీరోగా నటించగా విజయ్ సేతుపతి ముఖ్యపాత్ర పోషించాడు.
(ఇదీ చదవండి: ఆమెకు ఇష్టం లేకున్నా ఎలా పట్టుకుంటావ్.. నటుడిపై ట్రోల్స్)
Comments
Please login to add a commentAdd a comment