మందు కొట్టాలి, సిగరెట్‌ తాగాలన్నారు: హీరోయిన్‌ | heroin andrea doing two tamil films | Sakshi
Sakshi News home page

మందు కొట్టాలి, సిగరెట్‌ తాగాలన్నారు: హీరోయిన్‌

Published Thu, Aug 17 2017 7:02 PM | Last Updated on Sun, Sep 17 2017 5:38 PM

మందు కొట్టాలి, సిగరెట్‌ తాగాలన్నారు: హీరోయిన్‌

మందు కొట్టాలి, సిగరెట్‌ తాగాలన్నారు: హీరోయిన్‌

చెన్నై: నటి ఆండ్రియా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా సెలెక్టివ్‌ పాత్రల్లోనే కనిపించే ఆండ్రియా నటించిన తాజా తమిళ చిత్రం తరమణి. ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రంలో ఆండ్రియా నటనకు ప్రశంసలతో పాటు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆండ్రియా ఐటీ కంపెనీలో పని చేసే మహిళగా నటించింది. అంతే కాదు ఒక పిల్లాడికి తల్లిగానూ నటించింది. అసలు విషయం ఇవేవీ కాదు. తరమణి చిత్రంలో మద్యం సేవించడం, దమ్ము కొట్టడం వంటి సన్నివేశాలలో నటించడమే విమర్శలకు దారి తీస్తోంది.

అయితే తనపై వచ్చే విమర్శలను అస్సలు పట్టించుకోనంటోంది ఆండ్రియా. అదే విధంగా ఇమేజ్‌ గురించి కూడా ఆలోచించనని అంటోంది. తనకు కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి రెడీ అంటుంది. దర్శకుడు రామ్‌ తరమణి చిత్ర కథ«ను చెప్పి ఇందులో మందు కొట్టాలి, సిగరెట్‌ తాగాలి అని చెప్పారనీ, కథ, తన పాత్ర నచ్చడంతో వెంటనే ఓకే అన్నాననీ తెలిపింది. ప్రస్తుతం వడచెన్నై, తుప్పరివాలన్‌ చిత్రాలలో నటిస్తున్నాననీ, ఈ రెండు చిత్రాలలోనూ తన పాత్రలు వైవిధ్య నటనకు అవకాశం ఉంటుందనీ చెప్పింది. ముఖ్యంగా వడచెన్నై చిత్రంలో తనను చూసిన వారు ఈమె ఆండ్రియానేనా అని ఆశ్చర్య పోతారనీ అంది. ఇకపై కూడా విభిన్న కథా పాత్రలనే పోషించాలని నిర్ణయించుకున్నాననీ, అలాంటప్పుడు ఇమేజ్‌ గురించి పట్టించుకోననీ, ఎవరెలా విమర్శించినా బాధలేదని అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement