South Actress Andrea Sing a Pub Song for Web Movie Deets Inside - Sakshi
Sakshi News home page

Actress Andrea: వెబ్‌ కోసం నటి ఆండ్రియా పబ్‌ పాట

Published Wed, Apr 6 2022 8:50 AM | Last Updated on Wed, Apr 6 2022 11:20 AM

South Actress Andrea Sing a Pub Song for Web Movie - Sakshi

పుష్ప చిత్రంలోని ‘ఊ అంటావా మామ’ పాటను తమిళంలో ఓ సొల్వియా మామ అంటూ పాడి కుర్రకారును ఉర్రూతలూగించిన నటి ఆండ్రియా. తాజాగా వెబ్‌ చిత్రం కోసం పబ్‌ పాట పాడారు. నట్టి, శిల్పా మంజునాథ్‌ జంటగా నటిస్తున్న చిత్రం వెబ్‌. వేలన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.ఎం.మునివేలన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హారూన్‌ దర్శకత్వం వహిస్తున్నారు.

మొట్టై రాజేంద్రన్‌ ముఖ్య భూమిక పోషిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్‌రాజా సంగీతాన్ని, క్రిస్టఫర్‌ జోసెఫ్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఐటీ రంగం నుంచి ఇటీవల సముద్రతీరంలో ఏర్పాటు చేసిన బార్, పబ్బుల సంస్కృతి వరకు తెరపై ఆవిష్కరించే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రం ఇదని దర్శకుడు తెలిపారు. ఆవిష్కరణ త్వరలో నిర్వహించినట్లు ఆయ న తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement