వడచెన్నైకి ధనుష్ రెడీ | Samuthirakani, Daniel Balaji in `Vada Chennai` | Sakshi
Sakshi News home page

వడచెన్నైకి ధనుష్ రెడీ

Published Wed, Jun 22 2016 2:30 AM | Last Updated on Wed, Apr 3 2019 9:01 PM

వడచెన్నైకి ధనుష్ రెడీ - Sakshi

వడచెన్నైకి ధనుష్ రెడీ

నటుడు ధనుష్ వడచెన్నై చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ప్రభుసాలమన్ దర్శకత్వంవలో తొడరి, దురెసైంథిల్‌కుమార్ దర్శకత్వంలో కొడి చిత్రాలను పూర్తి చేశారు. వీటిలో తొడరి చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా వెట్ట్రిమారన్ దర్శకత్వంలో వడచెన్నై చిత్రానికి రెడీ అవుతున్నారు. వీరిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.పొల్లాదవన్,ఆడుగళం వంటి విజయవంతమైన చిత్రాలు ధనుష్, వెట్ట్రిమారన్ కాంబినేషన్‌లో వచ్చాయి.
 
  వీటిలో పొల్లాదవన్ కమర్షియల్‌గా పెద్ద విజయం సాధించింది. ఇక ఆడుగళం చిత్రం ధనుష్‌కు జాతీయ అవార్డును అందించింది. దీంతో వడచెన్నై చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడం సహజం. దర్శకుడు వెట్ట్రిమారన్ వడచెన్నై చిత్ర కథను చాలా కాలంగా వండుతున్నారు. ముందు ఈ చిత్రంలో నటుడు శింబును హీరోగా ఎంచుకున్నారు. ఆ తరువాత ఏం జరిగిందో గానీ ధనుష్ హీరో అయ్యారు. సమంత హీరోయిన్‌గా నటించనున్నారు. ఒక ముఖ్య పాత్రలో నటి ఆండ్రియా వేశ్యగా నటించనున్నట్లు సమాచారం.
 
  ఇందులో విలన్‌గా డేనియల్ బాలాజీ నటించనున్నారు. తాజాగా నటుడు సముద్రకనిని ముఖ్యపాత్రకు ఎంపిక చేశారు. ఈ చిత్రం కోసం భారీ సెట్‌ను రూపొందిం చారు. వడచెన్నై చిత్ర ఫ్రీ పొడక్షన్స్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. వచ్చే నెలలో చిత్రం సెట్‌పైకి వెళ్లనుందని తెలిసింది. ఈ చిత్రాన్ని బాహుబలి చిత్రం తరహాలో రెండు భాగాలుగా రూపొందించనున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement