మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి | Dhanush sister says it’s act of revenge, reveals family in pain | Sakshi
Sakshi News home page

మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి

Published Wed, Mar 8 2017 4:43 AM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి

మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి

పెరంబూర్‌ : మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి అని నటుడు ధనుష్‌ సోదరి, దంత వైద్యురాలు గీత వేడుకున్నారు. ధనుష్‌కు ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేనట్టున్నాయి.  ఒక వైపు మదురై జిల్లా మేలూరుకు చెందిన కదిరేశన్  దంపతులు ఆయన్ని తమ కొడుకు అంటూ కోర్టుకు ఈడ్చారు.

మరో వైపు గాయని సుచిత్ర ధనుష్‌ రాసలీలలు అంటూ తన ట్విట్టర్‌లో ఫొటోలను విడుదల చేస్తూ పరువును బజారున పడేస్తున్నారు. ఇవన్నీ మౌనంగానే ధనుష్‌ బరిస్తున్నా ఆయన సోదరి గీత మాత్రం సహించలేకపోతున్నారు. తన ట్విట్టర్‌ ద్వారా ఆమె స్పందిస్తూ, కొన్ని నెలలుగా తమ కుటుంబం గురించి ప్రచారం అవుతున్న పలు విషయాలు తమను కలచివేస్తున్నాయన్నారు. అయినా తాము సహనం పాటిస్తున్నామని, పేద కుటుంబం నుంచి వచ్చిన తమకు ఈ స్థాయి అంత సులభంగా రాలేదని అన్నారు. అందుకు తన సోదరులు సెల్వరాఘవన్, ధనుష్‌ల శ్రమ, త్యాగం ఉన్నాయని అన్నారు.

ధనుష్‌ పెద్ద నటుడిగా ఎదిగాడంటే ఆయన నిరంతర శ్రమే కారణంగా పేర్కొన్నారు. ట్విట్టర్‌లో ఎవరైనా ఎలాంటి దృశ్యాలనైనా పోస్ట్‌ చేయవచ్చని, ఇప్పుడు 12 ఏళ్ల పిల్లలు కూడా ట్విట్టర్‌ను ఫాలో అవుతున్నారని అన్నారు. అలాంటిది ప్రస్తుతం ధనుష్‌ గురించి ట్విట్టర్‌లో ప్రచారం అవుతున్న అశ్లీల దృశ్యాలు తీవ్ర మనస్తాపానికి గురి చేస్తున్నాయని, దయ చేసి మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయండి. ఇకపై అలాంటి చర్యలను ఆపాలని గీత విజ్ఞప్తి చేశారు.

(హీరో, హీరోయిన్ల ప్రైవేట్‌ ఫోటోలు లీక్‌..హల్‌చల్‌!)
(నా భార్య మానసిక రోగి!)
(కోర్టుకు హాజరైన హీరో ధనుష్‌)
(అమ్మా అప్పా ఓ తమిళబ్బాయి)


 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement