పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
హైదరాబాద్ : పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. సుచిత్ర ప్రాంతం విఘ్నేశ్వర రెసిడెన్సీలో నివాసం ఉండే సత్యనారాయణ కుమార్తె భార్గవి(21) శుక్రవారం ఇంట్లోనే ఉరి వేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ వ్యవహారంలో విఫలం కావడమే ఆమె ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.