రైతుగా... | balakrishna act to former role | Sakshi
Sakshi News home page

రైతుగా...

Published Wed, Jun 29 2016 10:29 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

రైతుగా... - Sakshi

రైతుగా...

రైతు లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోగలమా? ఎవరెంత కష్టపడినా.. ఎన్నెన్ని గొప్ప పనులు చేసినా.. ప్రతి మనిషి ఆకలి తీర్చేది మాత్రం రైతే. మనిషి తినే ప్రతి మెతుకు పండించేది అతనే. మనిషి మనుగడకు ముఖ్య కారణమైన రైతుకు ఈ రోజు ఎదురవుతున్న సమస్యలేంటి? దేశానికి రైతు అవసరం ఎంతుంది? అనే విషయాల సమాహారంతో రూపొందనున్న చిత్రం ‘రైతు’. ఇదే తన 101వ చిత్రమని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు.

 

ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకుడు. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న నూరవ చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ తర్వాత ‘రైతు’ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement