బాలయ్య వందో సినిమా ఆయన చేతిలో?
'డిక్టేటర్' హిట్ తర్వాత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలయ్య వందో సినిమాకు సంబంధించి ఓ సరికొత్త వార్త హల్ చల్ చేస్తుంది. మొదట్లో 'ఆదిత్య 369' కు సీక్వెల్ 'ఆదిత్య 999' బాలయ్య వందో సినిమాగా రాబోతుందని భావించారు. అయితే అది గాసిప్ గానే మిగిలిపోయింది. ఆ తర్వాత 100 వ సినిమా బోయపాటి దర్శకత్వంలో ఉండబోతుందని ప్రచారం జరిగింది. 'సరైనోడు' చిత్రీకరణలో బోయపాటి బిజీ అవడంతో అది కూడా రూమరేనని తేలిపోయింది.
ఇక 'పటాస్' ఫేమ్ అనిల్ రావిపూడి, క్రిష్ లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపించాయి. అయితే ఫైనల్ గా ఆ అవకాశం కృష్ణవంశీకి వచ్చిందని సమాచారం. వీలైనంత త్వరగా స్క్రిప్ట్ పూర్తి చేయమని బాలయ్య కృష్ణవంశీని పురమాయించినట్లు టాక్. ప్రస్తుతం బాలకృష్ణ తన నియోజకవర్గం హిందూపూర్ లో జరుగుతున్న లేపాక్షి సంబరాల్లో బిజీగా ఉండగా, కృష్ణవంశీ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో పడ్డారు.