
‘పైసా’ వసూల్‌కి రెడీ
మనకు దశావతారాల గురించి బాగా తెలుసు. మరి పదకొండో అవతారం గురించి తెలుసా? కృష్ణవంశీ చెబుతోన్న పదకొండో అవతారం డబ్బు. ‘డబ్బు లేనివాడు డుబ్బుకి కొరగాడు’, ‘పైసా మే పరమాత్మ హై’లాంటి సూక్తులన్నీ డబ్బు గురించి పుట్టినవే. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ ‘పైసా’ చిత్రాన్ని తీర్చిదిద్దారు. నాని, కేథరిన్ ఇందులో హీరో హీరోయిన్లు.
రమేష్ పుప్పాల నిర్మాత. ఈ నెల మూడోవారంలో విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘కృష్ణవంశీ, నాని కెరీర్‌ల్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. సాయికార్తీక్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కచ్చితంగా ఈ పైసా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌కుమార్‌రాయ్, రచన: కెకె బినోజ్, శ్రీనివాసరెడ్డి, పాత్రికేయ.