Paisa
-
డబ్బు చుట్టూ తిరుగుతున్న తెలుగు సినిమా.. ఎందుకు?
పైసా మే పరమాత్మ అంటారు. ఒక్క చిన్న మార్పు. ఇప్పుడు ‘పైసా మే సినిమా’ అనాలి. ఎందుకంటే రిలీజ్ తర్వాత సాధించే పైసా వసూల్ కోసం పైసల చుట్టూ కథలు అల్లి కొన్ని సినిమాలు తీస్తున్నారు. ‘పైసా మే సినిమా’... అంటూ పైసల మీద తీస్తున్న ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. వినోదం.. సందేశం వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’. భార్యాభర్తల అనుబంధాలతో అల్లుకున్న ‘ఎఫ్ 2’ అయినా.. వారసత్వం నేపథ్యంతో సాగిన ‘ఎఫ్ 3’ అయినా.. ఈ రెండు సినిమాల్లో అంతర్లీనంగా ఉన్న ప్రధానాంశం డబ్బుతో కూడుకున్న అవసరాలేనని ప్రేక్షకులకు అనిపిస్తుంది. ‘ఎఫ్ 3’లో అయితే జీవితంలో డబ్బు చాలా ముఖ్యమంటూ ‘లబ్ డబ్.. లబ్ డబ్.. డబ్బూ..’ అనే పాట కూడా ఉంది. ఈ చిత్రం ఎండింగ్లో ‘ఎఫ్ 4’ ఉంటుందన్నట్లుగా పేర్కొన్నారు. వచ్చే ఏడాది ‘ఎఫ్ 4’ సినిమా ఆరంభం కానుందట. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ల మాదిరిగానే ‘ఎఫ్ 4’ ప్రధాన కథాంశం డబ్బే అయ్యుంటుందని ఊహించవచ్చు. ఖరీదైన భవనాలు.. నోట్ల కట్టలు దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించే చిత్రాలు వినోదంతో పాటు సందేశాత్మకంగానూ ఉంటాయి. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందనున్న తాజా సినిమాలో ధనుష్ హీరోగా నటించనున్న సంగతి తెలిసిందే. ఇందులో రష్మికా మందన్నా హీరోయిన్. నాగార్జున ఓ కీలక పాత్రలో నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో ఒకవైపు అత్యంత ఖరీదైన భవనాలు, మరోవైపు మురికి వాడలు.. మధ్యలో నోట్ల కట్టలు కనిపిస్తుంటాయి. సో.. ఈ సినిమా ప్రధాన కథాంశం డబ్బు నేపథ్యంలో ఉంటుందని, సమాజంలో నెలకొన్న అసమానతల కోణంలో కథనం సాగుతుందని ఊహింవచ్చు. వచ్చే ఏడాది ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. జూదం వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న తాజా పీరియాడికల్ ఫిల్మ్ ‘మట్కా’. ఈ పాన్ ఇండియన్ సినిమాకు ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ పోస్టర్, టైటిల్‌ని బట్టి ‘మట్కా’ కథ అంతా డబ్బు చుట్టే తిరుగుతుందని తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా ‘మట్కా’ను తెరకెక్కిస్తున్నట్లు, వైజాగ్ నేపథ్యంలో 1958 – 1982 టైమ్ పీరియడ్‌లో ఈ సినిమా కథనం ఉంటుందన్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సామాన్యుడి కథ నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన ఒక సాధారణ మనిషి కథగా రూపొందనున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. దుల్కర్ సల్మాన్ టైటిల్ రోల్లో నటించనున్న సినిమా ఇది. ‘లక్కీ భాస్కర్’ టైటిల్‌ను గమనిస్తే టైటిల్లో డాలర్ సింబల్ స్పష్టంగా కనిపిస్తుంది. నమ్మశక్యం కాని విధంగా ఉన్నత శిఖరాలకు చేరిన వ్యక్తి కథ అంటూ చిత్ర యూనిట్ పేర్కొంది. సో..‘లక్కీ భాస్కర్’ కథలోని ప్రధానాంశం డబ్బే అని తెలుస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. డాలర్ కుమార్ ‘బిగ్ బాస్’ షో ఫేమ్ వీజే సన్నీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సౌండ్ పార్టీ’. ఏ ట్విస్టెడ్ ఫ్యామిలీ స్టోరీ అనేది ఉపశీర్షిక. హ్రితికా శ్రీనివాస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు సంజయ్ శేరి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డాలర్ కుమార్ అనే పాత్రలో నటిస్తున్నారు వీజే సన్నీ. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్‌లో డబ్బు కనిపిస్తుండటం ‘సౌండ్ పార్టీ’ ప్రధాన కథాంశం డబ్బేఅని స్పష్టం చేస్తోంది. డబ్బే ప్రధానాంశంగా సాగే మరికొన్ని సినిమాలు ఉన్నాయి. -
డబ్బు మనిషి
ఒక క్లాసిక్ బ్లాక్ అండ్ వైట్ తెలుగు సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ రోజుకీ తెలుగులో బెస్ట్ అనే జాబితాలో ఈ సినిమాకు చోటు ఉంటుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.... చంగయ్య ఆ ఊర్లో పెద్ద షావుకారు. పొదుపుగా పైసా పైసా కూడబెట్టుకునే అలవాటున్న మనిషి. అతనికి తన పక్కింట్లోనే ఉండే కోడలు సుబ్బులంటే బాగా ఇష్టం. బస్తీలో ఉండి చదువుకునే తన కొడుకు సత్యానికి సుబ్బులునిచ్చి పెళ్లి చేస్తే ఇంక ఈ జీవితానికి అదే చాలు అన్నట్టుగా ఉంటాడు. ఇతరుల విషయాల్లో ఏమో గానీ, కోడలికి మాత్రం సందర్భం లేకున్నా చంగయ్య నగలు చేయిస్తాడు. కొత్త బట్టలు కుట్టిస్తాడు. సుబ్బులు, సత్యానికి కూడా ఒకరంటే ఒకరికి అంతే ఇష్టం. చాలాకాలంపాటు బస్తీలో పెద్ద చదువులు చదువుకున్న సత్యం తిరిగొచ్చాడు. సుబ్బులు ఆనందానికి అవధుల్లేవు. బావ ఇంట్లోకి అడుగు పెట్టినప్పట్నుంచీ అతణ్ని తనివితీరా చూసుకుంటోంది. ‘‘ఏమంటున్నాడే మీ మావ? నాకోసం సంపాదించినా నీ చేతికే తాళాలిచ్చి పోతాడులే!’’ అన్నాడు సత్యం, సుబ్బులును ఆటపట్టిస్తూ. ‘‘మా సుబ్బులు తాళాలు ఏం చేసుకుంటుంది సత్యం! దానికిస్తే నీకే ఇచ్చేస్తుందిలే.’’ అంది సుబ్బులు వదిన నవ్వుతూ. ‘‘అరే! ఎందుకురా ఈ తగాథా. మీకెవ్వరికీ అక్కరలేకుంటే నాకు పడేద్దువులే తాళాలు..’’ అన్నాడు సుబ్బులు అన్న గట్టిగా నవ్వుతూ. అందరూ మాట్లాడుతున్నారు కానీ, అక్కడ సుబ్బులు, సత్యం మాత్రమే మాట్లాడుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి. సత్యం తిరిగొచ్చాక సుబ్బులు జీవితమంతా కొత్తగా ఉంది. సత్యాన్ని ఆట పట్టించనిదే ఆమె రోజు గడవడం లేదు.వీరి ఆటలు ఇలా ఉంటే, ఊర్లో చంగయ్య తండ్రి కట్టించిన ఒక ధర్మసత్రం ఎవరికి చెందుతునే గొడవ జరుగుతోంది. ఊరికోసం కట్టించినది అది. చంగయ్య మాత్రం దాని సర్వహక్కులూ తనవేనని చెప్పుకున్నాడు. గొడవ పెద్దదైంది. పోలీసుల వరకూ వెళ్లింది. సుబ్బులు తండ్రి రామయ్యను సాక్ష్యం చెప్పమన్నారు. సొంత బావే కదా తనకు అనుకూలంగానే సాక్ష్యం చెబుతాడనుకున్నాడు చంగయ్య. ‘‘చెప్పు బావా! సందేహిస్తావెందుకు? దీంట్లో నీకు తెలియనిది ఏముంది!’’ అన్నాడు చంగయ్య, పోలీసుల ముందు మౌనంగా నిలబడ్డ రామయ్యను కదిలిస్తూ. ‘‘ఇది ధర్మసత్రమేనండీ. చంగయ్య గారు దీనికి ధర్మకర్త మాత్రమే. దీన్ని విక్రయించడానికి కానీ, అద్దెకు ఇచ్చుకోవడానికి కానీ ఆయనకు ఎట్టి హక్కులూ లేవు.’’ అన్నాడు రామయ్య శూన్యంలోకి చూస్తూ. రామయ్య తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాడని ఊహించని చంగయ్య, ఇంటికి వెళ్లీ వెళ్లగానే కోపంతో అనాల్సిన మాటలన్నీ అన్నాడు. రెండు కుటుంబాల మధ్య దూరం. కొన్నాళ్లు ఊర్లోనే ఉండాలనుకున్న సత్యం, చంగయ్యతో గొడవ పడి ఇంట్లోంచి బయటికొచ్చాడు. రామయ్యను కలిసి అట్నుంచటే బస్తీకి వెళ్లిపోయాడు. చంగయ్య సుబ్బులుకు ఎంతో ఇష్టంగా ఇచ్చిన నగలన్నీ వెనక్కి వచ్చేశాయి. రోజులు గడుస్తున్నాయి. సత్యం నుంచి ఉత్తరాలు రామయ్య ఇంటికే వస్తున్నాయి తప్ప చంగయ్యకు రావడం లేదు. ‘‘బాబుగారి ఎర్రిగానీ, చినబాబు ఎప్పుడో ఆళ్లల్లో చేరిపోయినాడు.’’ అన్నాడు చంగయ్య ఇంట్లో పని చేసే వ్యక్తి, రామయ్య ఇంటికి ఉత్తరం వచ్చిన వార్తను మోసుకొస్తూ. చంగయ్యకు కోపం పెరిగింది. ‘‘రామయ్య మనకేదో బాకీ ఉన్నట్టున్నాడు. కొంచెం చూసి సర్దమని చెప్పు..’’ అన్నాడు తన మనిషిని పురమాయిస్తూ. ఇంట్లో నగలు తాకట్టు పెట్టినా డబ్బు సరిపడలేదు. పొలం కూడా తాకట్టు పెట్టి చంగయ్యకు తిరిగివ్వాల్సినదంతా ఇచ్చేశాడు రామయ్య. అయినా చంగయ్యకు రామయ్య మీద కోపం ఇంకా తగ్గలేదు. రామయ్య పంటను నాశనం చేస్తే అప్పులు తీర్చలేక చస్తాడనుకున్నాడు. అదీ కుదరకపోతే తానే స్వయంగా దొంగతనం కేసులో రామయ్య కొడుకును జైల్లోకి తోయాలనుకున్నాడు చంగయ్య. అనుకున్నట్టే చేశాడు. రామయ్య కొడుకు నారాయణ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అదే జైలుకు, అనుకోకుండా, కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ఒక నేరంలో దోషిగా తేలి వచ్చాడు సత్యం. ‘‘నేను ఆనాడే అనుకున్నా ఏదో కొంప మీదకొస్తుందని. అలాగే జరిగింది.’’ అన్నాడు సత్యం బాధగా. ‘‘పోన్లేరా! జరిగిందేదో జరిగింది. మనం ఊర్లో ఉంటే ఇంత సరదాగా కలుసుకోగలమో లేదో. ఇక్కడైనా ఈ నాలుగు రోజులు హాయిగా కాలక్షేపం చేద్దాం.’’ అన్నాడు నారాయణ, సత్యాన్ని కాస్తంత నెమ్మదిపరుస్తూ. ‘‘అది కాదు నారాయణ! నా మనసు ఎంతగా బాధపడుతుందో నీకు తెలియదు. రేపు మన ఊర్లో తలెత్తుకొని ఎట్లా తిరిగేది?’’ నారాయణ, సత్యం మాట్లాడుకుంటున్నారు. సత్యాన్ని విడిపించడానికి వచ్చాడు చంగయ్య. కొన్ని కాగితాలు చూపించి సంతకం పెట్టమని కోరాడు. ‘‘నారాయణ దొంగతనం చేశాడా?’’ అడిగాడు సత్యం. ‘‘అదెందుకురా ఇప్పుడు! దీనిమీద సంతకం పెట్టు.’’ సత్యం వినలేదు. గట్టిగా అరుస్తూ మళ్లీ అడిగాడు – ‘‘నారాయణ దొంగతనం చేశాడా?’’ ‘‘లేదురా నాయనా! లేదు. వాడేం చెయ్యలేదు. నేనే ఏదో ఉద్రేకంలో ఇదంతా చేశాను. జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా మాట విని ఇక్కడ సంతకం పెట్టు.’’ ఏడ్చేస్తూ అన్నాడు చంగయ్య. ‘‘ఇన్నాళ్లూ ఈ కేసు నా మీదకు ఎందుకు వచ్చిందా అనుకున్నాను. మన మేలుకే వచ్చింది. మనం నారాయణకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం.’’ అంటూ తండ్రి తెచ్చిన కాగితాలను పక్కకు తోసి మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు సత్యం. సత్యం, నారాయణ జైల్లోనే ఉన్నారు. వీళ్లిద్దరూ జైల్లో ఉన్న విషయం గురించే ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. చంగయ్యకు కొడుకు బెంగ పట్టుకుంది. తన జీవితంలో చాలా రోజులు ఎదురుచూసినట్టే, సుబ్బులు సత్యం కోసం ఎదురుచూస్తూనే ఉంది. -
9 పైసలు తగ్గిన పెట్రో ధరలు
న్యూఢిల్లీ: రూపాయి బలం పుంజుకోవడంతో పాటు అంతర్జాతీయ ముడిచమురు ధరలు పడిపోవడంతో శనివారం4 మెట్రో నగరాల్లో లీటరు డీజిల్, పెట్రోల్ ధరలు 9 పైసలు తగ్గాయి. దీంతో పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.78.20, ముంబైలో 86.01, చెన్నైలో 81.19, కోల్‌కతాలో రూ.80.84గా కొనసాగుతోంది. ఇక డీజిల్ ధరలు ఢిల్లీలో రూ.69.11, కోల్‌కతాలో రూ.71.66, ముంబైలో రూ.73.58, చెన్నైలో రూ.72.97కి పడిపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు బ్యారెల్‌కు డాలర్ చొప్పున తగ్గాయి. ఫలితంగా ఇంధన ధరలు భారత్‌లోనూ స్వల్పంగా దిగివచ్చాయి. -
పెట్రోల్ 1 పైసా తగ్గింది
న్యూఢిల్లీ: వరుసగా 16 రోజులు పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలకు బ్రేక్ పడింది. బుధవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు ఒక పైసా తగ్గిస్తున్నట్టు చమురు సంస్థలు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) తొలుత లీటర్‌కు 60 పైసల చొప్పున పెట్రో ధరలను తగ్గిస్తున్నట్టు తెలిపింది. గత ఏడాది జూన్‌లో రోజువారీ ధరల సవరణ విధానాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇదే భారీ తగ్గింపు. ఇలా ప్రకటించిన కొద్ది గంటలకే సాంకేతిక లోపం కారణంగా అలా వచ్చిందని.. వాస్తవానికి తగ్గించింది ఒక పైసా మాత్రమే అని చమురు సంస్థలు స్పష్టంచేశాయి. సాంకేతిక లోపం వల్లే..: ఐవోసీ తగ్గించిన మొత్తం 1 పైసానే అని, క్లరికల్ ఎర్రర్ కారణంగా మే 25 నాటి ధర.. బుధవారం నాటి ధరగా ప్రకటించామని, వాస్తవానికి తగ్గించింది ఒక పైసానే అని ఐవోసీ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. తర్వాత ఐవోసీ దీనిపై ఓ ప్రకటన చేసింది. ఒక పైసా తగ్గింపు అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 78.42కు, లీటర్ డీజిల్ ధర రూ. 69.30కి తగ్గింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్నాయని, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ బలపడుతోందని, దీంతో దిగుమతుల ధర తగ్గుతుందని, దీని ఫలితంగా రానున్న రోజుల్లో పెట్రో ధరలు కూడా తగ్గుతాయని ఆయన పేర్కొన్నారు. మే 12న కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి 16 రోజులుగా పెట్రో ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ పక్షం రోజుల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 3.80.. డీజిల్ ధర లీటర్‌కు రూ.3.38 పెరిగింది. పిల్ల చేష్టలా ఉంది: రాహుల్ పెట్రో ధరలను ఒక పైసా తగ్గించడంతో ప్రధాని మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ మండిపడ్డారు. ప్రజలను వేళాకోళం చేయడానికి మోదీ ఈ ఐడియా వేయలేదు కదా అని ఎద్దేవా చేశారు. ఇది పిల్ల చేష్టలా.. చౌకబారుగా ఉందని విమర్శించారు. ‘డియర్ పీఎం. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలను మీరు ఒక పైసా తగ్గించారు. ఒక్క పైసానా..!?? ప్రజలను వేళాకోళం చేయడానికి మీరు వేసిన ఐడియా కాదు కదా ఇది. ఇది పిల్ల చేష్టలా.. చౌకబారుగా ఉంది’ అని ట్వీట్ చేశారు. పెట్రో ధరలను రూ. 1 తగ్గించిన కేరళ తిరువనంతపురం: కేరళ సీఎం విజయన్ తమ రాష్ట్రంలో పెట్రో ధరలను లీటర్‌కు రూ. 1 తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. జూన్ 1 నుంచి ఇది అమలవుతుందని చెప్పారు. ఈ తగ్గింపు కారణంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.509 కోట్ల భారం పడుతుందని విజయన్ చెప్పారు. -
శ్రీరాం హీరోగా పైసా
డబ్బు డబ్బు డబ్బు ఈ రెండక్షరాల చుట్టూనే కాలం తిరుగుతోందన్నది ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలా డబ్బే లోకంగా భావిస్తున్న మనిషికి అవసరాలకు మించిన డబ్బు వరమా? శాపమా? అన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న చిత్రం పైసా అంటున్నారు ఆ చిత్రం దర్శకుడు అబ్దుల్ మజీద్. ఇంతకు ముందు విజయ్ హీరోగా తమిళన్ చిత్రాన్ని రూపొందించిన ఈయన తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం పైసా. కాన్ఫిడెంట్ ఫిలిం కబే, కేజేఆర్ స్టూడియోస్, ఆర్కే.డ్రీమ్ వరల్డ్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరాటే కే.ఆనంద్ సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పసంగ, గోలీసోడా వంటి జాతీయ అవార్డు చిత్రాలతో మంచి గుర్తింపు పొందిన నటుడు శ్రీరామ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆరా అనే నవ నటి హీరోయిన్గా పరిచయం అవుతోంది. నాజర్, మైయిల్సామి, మధుసూదన్,రాజసింహన్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఒక కీలక పాత్రలో నటుడు సెన్రాయన్ నటిస్తున్నారు. కేపీ.వేల్మురుగన్ చాయాగ్రహణం, జేవీ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం గురించి దర్శకుడు తెలుపుతూ మనిషికి డబ్బు అవసరమే. అయితే అదే జీవితం అయితే నరకమే మిగులుతుంది అని చెప్పే చిత్రం పైసా అని తెలిపారు. నిజ జీవిత అనుభవాలే తన చిత్రం అని దర్శకుడు అబ్దుల్ మజీద్ అన్నారు. తన చిత్రం సగటు ప్రేక్షకుడొక్కడిలో మార్పు తీసుకొచ్చినా తన ప్రయత్నం ఫలించినట్లేనని ఆయన అన్నారు. -
నాని ఆశలన్నీ 'జెండాపై...' పైనే
-
ఆ హీరోలతో పోలిస్తే నా హీరో గౌతమ బుద్ధుడే!
కృష్ణవంశీ సినిమాలే కాదు. ఆయన మాటలు కూడా ఎడ్యుకేట్ చేసేలా ఉంటాయి. ప్రేక్షకుల అంతరంగాలే ఆయనకు కథావస్తువులు. ప్రేమ, నక్సలిజం, ఫ్యాక్షనిజం, టైజం, కుటుంబం, ఫాంటసీ, దేశభక్తి... కాదేదీ కృష్ణవంశీ కథాంశానికి అనర్హం. ఫార్ములాకి అతీతంగా వెళ్లి జనాన్ని మెప్పించగలిగే స్టామినా కృష్ణవంశీ సొంతం. ‘పైసా’ సినిమా విషయంలో ఆయన చేసింది అదే. భూమిపై పుట్టిన ప్రతి వాడి బలహీనత ‘పైసా’. దాన్ని ఆసరాగా తీసుకొని ఓ సినిమా తీసేశారు. వెండితెర అనే అద్దంపై సగటు ప్రేక్షకునికి ప్రతిరూపంగా తన హీరోని నిలబెట్టి విమర్శకుల ప్రశంసలందుకుంటున్నారు. ఆ ఆనందంలోనే సోమవారం హైదరాబాద్‌లో పాత్రికేయులతో ముచ్చటించారు కృష్ణవంశీ. ‘పైసా’ కథ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ప్రస్తుతం సినిమాలన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఓ ఫార్ములాని నమ్ముకొని సినిమాలు తీసేస్తున్నారు. ఒకరిద్దరు దర్శకులు తప్ప అందరి పరిస్థితి ఇదే. అలా కాకుండా ఏదైనా కొత్తగా వెళ్లాలనిపించింది. ఆ ఆలోచనకు రూపమే ‘పైసా’. ఈ సినిమా చిత్రీకరణ విషయంలోనూ కొత్తగానే ఆలోచించాను. స్క్రీన్‌ప్లే అనేది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి.. కథ డిమాండ్ మేరకు సన్నివేశాలను పుట్టించడం. ప్రస్తుత చిత్రాల్లో రన్ అవుతోంది ఈ పద్ధతే. రెండో పద్ధతి... ప్రేక్షకుల స్పందనను ముందే ఊహించి సన్నివేశాలను తీర్చిదిద్దడం. ‘పైసా’ విషయంలో నేను అవలంబించింది అదే. ఈ కథలో హీరోకి కోటి రూపాయలు చాలు. కానీ... తనకి తెలీకుండానే... తన పక్క యాభై కోట్లు ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా... కాసేపటికైనా ఆ విషయం హీరోకు తెలుస్తుంది. కానీ ఎలా తెలుస్తుంది? ప్రేక్షకుడికి విపరీతమైన క్యూరియాసిటీ పెంచే అంశం ఇది. సాధారణంగా నేను థియేటర్లలో సినిమా చూడను. కానీ, ఈ సినిమా చూశా. ఆ సన్నివేశాల్లో ఒకటే విజిల్స్, కేకలు. అంటే... వాళ్లు ఎంతగా కనెక్ట్ అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. కోటి రూపాయల కోసం చూసేవాడికి యాభై కోట్లు దొరికితే వాడి మైండ్‌సెట్ ఎలా ఉంటుంది? ఆ డబ్బుని నొక్కేస్తాడా? లేక ప్రభుత్వపరం చేస్తాడా? ఈ నేపథ్యంలో హీరో పాత్ర చిత్రణ ఉంటుంది. అలాగే డబ్బు ఎన్నిచోట్ల ఎన్ని విధాలుగా పరావర్తనం చెందుతుందో ఇందులో చూపించాం. రాజకీయం, వ్యభిచారం, దుబాయ్ షేక్‌ల పెళ్లిళ్ల వ్యవహారం, దొంగనోట్లు, హవాలా... ఇలా అన్నింటినీ టచ్ చేశాం. అయితే క్రియాశీల రాజకీయాల జోలికి పోలేదు. తొలిరోజు టాక్ డివైడ్‌గా ఉంటుందని తెలుసు. ఎందుకంటే నా తొలి సినిమా ‘గులాబి’ నుంచి జరుగుతోంది అదే. అదే ఈ సినిమాక్కూడా జరిగింది. ఇప్పుడు మాత్రం అందరూ ఆదరిస్తున్నారు. సీనియర్ దర్శకునిగా ప్రేక్షకుల అభిరుచిలో మార్పేమైనా గమనించారా? టీజర్స్ చూసి.. ఒక కథను మైండ్‌లో డిజైన్ చేసేసుకొని థియేటర్‌కి వస్తున్నారు. వారి ఊహలకు దగ్గరగా ఉంటే ‘హిట్’ అనేస్తున్నారు. ఊహలకు భిన్నంగా ఉంటే ఫట్టుమనిపిస్తున్నారు. ప్రస్తుతం చాలా సినిమాలు అందుకే దెబ్బతింటున్నాయి. ప్రేక్షకుల్లో ‘హీరో వర్షిప్’ ఎక్కువైపోయింది. ఇది నిజంగా బాధా కరమైన విషయమే. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే... అనాదిగా ఇక్కడి ప్రజలు బానిసత్వానికి అలవాటు పడిపోయారు. రాజులు పరిపాలిస్తున్న కాలంలో వాళ్లను దైవాంశ సంభూతులుగా చూసి కొలిచారు. తర్వాత తురుష్కులు ఏలుతున్న కాలంలో వాళ్లను నవాబులుగా కొనియాడారు. బ్రిటిషర్లు పరిపాలించిన కాలంలో కూడా అదే పరిస్థితి. ఇప్పుడు నడుస్తోంది ప్రజాస్వామ్యమని గొప్పగా చెప్పుకున్నా... జరుగుతోంది రాచరికమే. వ్యక్తిపూజ జనానికి అలవాటైపోయింది. అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి. అందుకు సినీరంగం మినహాయింపేం కాదు. పోస్టర్ చూసి ఇది మా హీరో సినిమా, మా కులపోడి సినిమా అనే మైండ్‌సెట్‌తో సినిమాలకు వెళుతున్నారు. అలాంటి ప్రేక్షకులుంటే మంచి సినిమాలు ఎలా వస్తాయి. అన్ని రకాలుగా సమాజం విషపూరితం అయిపోయింది. వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. మీ మాటల్లో సామాజిక స్పృహ బాగా వినిపిస్తుంది. మరి మీ సినిమాల్లో అది ఏ మేరకు కనిపిస్తుందంటారు? సినిమా అనేది నా జీవితం, నా ఉద్యోగం. జీవితాన్ని, ఉద్యోగాన్ని బాధ్యతగా తీసుకుంటాం. సినిమా కూడా నాకంతే. ప్రజల బలహీనతల్ని ఆసరాగా తీసుకొని బాధ్యతారహితంగా నేను సినిమాలు తీయలేదు. తీయను కూడా. నా సినిమాల ద్వారా ఎంతో కొంత మంచి చెప్పడానికే ప్రయత్నిస్తా. మీ హీరోల్లో కాస్త నెగిటివ్ షేడ్స్ కనిపిస్తుంటాయి? ఈ రోజున తెలుగు సినిమా హీరో అంటే... క్రిమినల్, దొంగ, పోరంబోకు, పోకిరి, ఎందుకూ పనికిరానివాడు. శేఖర్‌కమ్ముల, క్రిష్ లాంటి దర్శకుల చిత్రాల్లోనే హీరో అనేవాడు కాస్త బాధ్యతాయుతమైన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. మిగిలిన అన్ని సినిమాల్లోనూ ఇదే పరిస్థితి. తెరపై వందల మందిని ఊచకోత కోస్తాడు. వాడిపై ఒక్క కేసు కూడా ఉండదు. కానీ నా హీరో అలా ఉండడు. మిగిలిన సినిమాల్లో హీరోలతో పోలిస్తే నా హీరో గౌతమబుద్ధుడే. వాడిలో ఏదో ఒక కొత్తకోణం ఉంటుంది. ప్రతి వ్యక్తిలోనూ ఓ నెగిటివ్ యాంగిల్ ఉన్నట్లు నా హీరోలో కూడా కనిపిస్తుంది. అంతేతప్ప ఆ యాంగిల్లోనే మొత్తం కనిపించడు. నా దృష్టిలో హీరో అనేవాడికి ఒక అంతఃసంఘర్షణ ఉండాలి. తను చేసే ప్రతి పనికీ ఓ పర్పస్ ఉండాలి. మణిరత్నం, రామ్‌గోపాల్‌వర్మ చిత్రాల్లో హీరోలు అలాగే ఉంటారు. వాళ్లనే నేనూ ఫాలో అవుతా. ‘పైసా’ తర్వాత మళ్లీ ఫామ్లోకొచ్చానని అనుకుంటున్నారా? నేను ఫామ్‌లో లేకుండా ఎప్పుడూ లేను. ఫస్ట్ ఇన్నింగ్స్, సెకండ్ ఇన్నింగ్స్ అనే వాటిని నమ్మను. సినిమా ఫెయిల్ అయితే... నా వర్క్ ఫెయిల్ అయ్యిందని భావిస్తాను కానీ... నేను ఫెయిల్ అయినట్లు ఫీలవ్వను. ఎందుకంటే... సినిమా అనేది నా ఒక్కడి కృషి కాదు. సమష్టి కృషి. సినిమా జయాపజయాలపై అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. ప్రేమకథల్ని వదిలిపెట్టేశారే? ప్రేమపట్ల నాకున్న దృక్కోణం వేరు. నేటి సినిమాల్లో చూపిస్తున్న ప్రేమను నమ్మను. ఫాల్స్ ఎమోషన్లనే ప్రేమగా చూపించేస్తున్నారు. నేనలా తీయలేను. అందుకే ప్రేమకథలకు కామా పెట్టా. అయితే, త్వరలో నానుంచి ఓ మంచి ప్రేమకథ వస్తుంది. హిందీలో వచ్చిన ‘లవ్ ఆజ్కల్’ నాకు ఇష్టమైన ప్రేమకథ. రామ్‌చరణ్‌తో చేయబోతున్న సినిమా ఎలా ఉంటుంది? పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా గొప్ప సినిమా అవుతుంది. ఆ వైబ్రేషన్స్ ముందే కనిపిస్తున్నాయి. ఇందులో రామ్‌చరణ్ తాతగా తమిళ నటుడు రాజ్‌కిరణ్ నటిస్తున్నాడు. బాబాయ్‌గా శ్రీకాంత్ చేస్తున్నాడు. ఇక తండ్రి పాత్రకు ఓ అగ్ర హీరో ‘ఓకే’ అయ్యే అవకాశాలున్నాయి. మరి మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘వందేమాతరం’ ఎప్పుడు తీస్తారు? చనిపోయేలోపు తప్పకుండా తీస్తా. ఎందుకంటే... నేటి సమాజానికి ఆ సినిమా అవసరం. -
నాని, వంశీల పైసా
-
పైసా ఎక్కువ రోజులు నిలబడే సినిమా అవుతుంది - కృష్ణవంశీ
‘‘చాలాకాలం తర్వాత థియేటర్‌కెళ్లి సినిమా చూశాను. ప్రతి సన్నివేశానికీ జనాల్లో మంచి స్పందన కనిపిస్తోంది. చూసిన చాలామంది ‘మీకు సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందంటున్నారు’’ అని కృష్ణవంశీ అన్నారు. నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మించిన చిత్రం ‘పైసా’. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో జరిగింది. కృష్ణవంశీ ఇంకా మాట్లాడుతూ-‘‘ఈ సినిమా విషయంలో దర్శకునిగా పూర్తి సంతృప్తితో ఉన్నాను. రెగ్యులర్ ఫార్మెట్లో వెళ్లకుండా కొత్తగా ట్రై చేసి తీసిన సినిమా ఇది. మెల్లమెల్లగా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుందని అనుకున్నాను. కానీ, స్పీడ్‌గా ఆదరిస్తున్నారు. డెఫినెట్‌గా ఎక్కువ రోజులు నిలబడే సినిమా అవుతుంది’’ అని నమ్మకం వ్యక్తం చేశారు. ‘‘ఇంటర్వెల్ ముందు చార్మినార్ నేపథ్యంలో నానిపై తీసిన సన్నివేశానికి మంచి స్పందన వస్తోంది. మూడే టేకుల్లో ఆ సీన్ తీశాను. అలాగే డబ్బు దొరికిన సన్నివేశంలో నాని నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. రాజారవీంద్ర కేరక్టర్, సాయికార్తీక్ నేపథ్య సంగీతం, హైదరాబాదీ ఆర్టిస్టులు ఆర్కే, తబర్, లోబోల నటన ఈ చిత్రానికి హైలైట్స్’’ అని కృష్ణవంశీ చెప్పారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ‘మురారి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీసే పనిలో ఉన్నానని, ఆ సినిమా తర్వాత తాను, నాని కలిసి ఓ సమకాలీన చిత్రం తీస్తామని, దాంట్లో నానినే హీరో అని కృష్ణవంశీ తెలిపారు. విడుదలలో జాప్యం జరిగినా ‘పైసా’కు మంచి టాక్ రావడం ఆనందంగా ఉందని, ఇందులోని తన పాత్రకు మంచి స్పందన వస్తోందని నాని ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో విజయయాత్ర కూడా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి సినిమాను విడుదల చేశాం. ఇప్పుడు స్పందన చూస్తుంటే... చెప్పలేనంత ఆనందం కలుగుతోంది. కృష్ణవంశీ టేకింగ్, నాని యాక్టింగ్, సాయికార్తీక్ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచాయి’’ అని తెలిపారు. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో తాను నిర్మిస్తున్న ‘సరదా’ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుందని, అలాగే మంచు మనోజ్ హీరోగా తాను నిర్మించనున్న ‘సన్నాఫ్ పెదరాయుడు’ చిత్రం వచ్చే నెలలో సెట్స్‌కెళుతుందని, ఓ అగ్రహీరోతో హరీష్‌శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రం ఉంటుందని రమేష్ పుప్పాల చెప్పారు. ఇంకా రాజారవీంద్ర, ఆర్కే, తబర్, సాయికార్తీక్ కూడా మాట్లాడారు. -
సినిమా రివ్యూ: 'పైసా'
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, 'ఈగ' చిత్రం విజయం తర్వాత నాని కాంబినేషన్ లో రూపొందిన చిత్రం 'పైసా'. ఆరంభంలో 'పైసా' చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే అనేక సమస్యలతో విడుదల బాగా ఆలస్యమైన ఈ చిత్రం ఎట్టకేలకూ శుక్రవారం ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనేక అడ్డంకులను ఎదుర్కొని ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'పైసా' చిత్రం కథేంటో చూద్దాం! డబ్బులంటే విపరీతమైన పిచ్చి ఉండే ప్రకాశ్ (నాని) హైదరాబాద్ పాతబస్తీలో ఓ మోడల్. జీవితంలో కోటి రూపాయలు సంపాదించి సెటిలైపోవాలనుకుంటాడు. పాతబస్తీలో ఉండే నూర్ (కేథెరీనా థెరిసా) అంటే ప్రకాశ్ కు ఇష్టం. అలాగే ప్రకాశ్ అంటే నూర్ కు చెప్పలేనంత ప్రేమ. పైసా అంటే పడిచచ్చే ప్రకాశ్ కు అనుకోకుండా యాభై కోట్ల రూపాయలు చేతికి చిక్కుతాయి. ప్రకాశ్ కు చిక్కిన యాభై కోట్లు ఎక్కడివి? యాభై కోట్ల రూపాయలు దక్కించుకోవడానికి ప్రకాశ్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? భారీ మొత్తంలో చిక్కిన సొమ్ము చివరికి ఏమైంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే 'పైసా' చిత్రం. ప్రస్తుత తరం హీరోల్లో నాని ఈగ చిత్రంతో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఆ సినిమా తర్వాత చాలా గ్యాప్ వచ్చిన నానికి ఈ చిత్రంలోని ప్రకాశ్ పాత్ర టైలర్ మేడ్ క్యారెక్టర్. నటుడిగా నిరూపించుకోవడానికి లభించిన ప్రకాశ్ పాత్రను నాని చక్కగా ఉపయోగించుకున్నాడు. మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఈ పాత్రలో తనదైన స్టైల్ తో ఆకట్టుకున్నాడు. ఫైట్స్, పాటలతో ఆలరించిన నాని కీలక సన్నివేశాల్లో ఎమోషన్స్ ను చక్కగా పలికించాడు. పైసా చిత్రంలోని ప్రకాష్ పాత్రకు నాని వంద శాతం న్యాయం చేకూర్చాడని చెప్పవచ్చు. 'ఇద్దరు అమ్మాయిలు' చిత్రం తర్వాత కేథరిన్ థెరిసాకు మంచి పాత్రే లభించింది. తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని.. పర్వాలేదనిపించింది. గ్లామర్ తో పాటు, పెర్మార్మెన్స్ తో కూడా కేథరిన్ ఆకట్టుకుంది. ఎమ్మెల్యే కూతురుగా స్వీటీ పాత్రలో కనిపించిన సిద్దికా శర్మ అందాల ఆరబోతకే పరిమితమైంది. నాని ఫ్రెండ్ గా డ్రైవర్ పాత్రలో నటించిన తాబర్ గుర్తుండిపోయే పాత్రను పోషించాడు. విలన్ పాత్రలో చరణ్ రాజ్, సిద్దార్థ్ రెడ్డి, ఆర్ కే, రాజా రవీంద్ర, దువ్వాసి మోహన్ సినిమాకు సపోర్టింగ్ గా నిలిచారు. చిలక జ్యోతిష్కుడి పాత్రలో కొద్దిసేపే కనిపించిన వేణు తన హస్యంతో ఆకట్టుకున్నాడు. విశ్లేషణ: ప్రస్తుత రాజకీయ వాతావరణంలో నెలకొన్న పరిస్థితులను సెంటర్ పాయింట్ గా చేసుకుని, దానికి ప్రేమ కథను జోడించి క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ పైసా చిత్రాన్ని రూపొందించారు. చిత్రమంతా పాతబస్తీలోని చార్మినార్ నేపథ్యంగా సాగుతుంది. పాతబస్తీలో ఉండే పరిస్థితులను కృష్ణవంశీ చక్కగా చిత్రీకరించారు. ఈ చిత్రంలో పతంగి సన్నివేశాన్ని తెరకెక్కించిన తీరు కృష్ణవంశీ క్రియేటివిటీకి అద్దం పడుతుంది. చార్నినార్ వద్ద నాని తో చేయించిన ఓ లెంగ్తీ ఎపిసోడ్, హోలీ సీన్ లు బ్రహ్మండంగా ఉన్నాయి. ఈ చిత్ర ఫస్టాఫ్ ను పర్వాలేదనిపించే రితీలో తెరకెక్కించిన కృష్ణవంశీ.. సెకండాఫ్ లో కొంత గందరగోళమే సృష్టించాడు. కథకు ఉండే పరిమితుల వల్ల కథనంలో గందరగోళం తప్పలేదు. చేజారిన డబ్బును దక్కించుకోవడానికి కొన్ని బ్యాచ్ లు, అనుకోకుండా చేజిక్కిన డబ్బును కాపాడుకోవడానికి నాని వేసే ఎత్తులతో సెకండాఫ్ చేజింగ్ కొంత రొటిన్ గా అనిపించింది. పెద్దగా పేరున్న ఆర్టిస్టులు విలన్ పాత్రల్లో కనిపించకపోవడం ఈ చిత్రానికి మైనస్. సెకండరీ గ్రేడ్ విలన్ పాత్రలు అంతగా ప్రభావం చూపలేకపోయాయి. అయితే సెకండాఫ్ చేజింగ్ కథనం ప్రేక్షకుడ్ని ఆకట్టుకుంటుందా అనేది సందేహమే. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ ను పలికించడంలో తనదైన మార్క్ ను కృష్ణవంశీ చూపించాడని చెప్పవచ్చు. గత కొద్దికాలంగా టాలీవుడ్ కు దూరమయ్యారనే ఫీలింగ్ కలిగించిన కృష్ణవంశీ ప్రస్తుత ట్రెండ్ ను మిస్ అవుతున్నాడా అనే ప్రశ్నను రేకెత్తించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే.. పైసాలో చిత్రంలో టెంపోను కొనసాగించడానికి రీరికార్డింగ్ బాగా ఉపయోగపడింది. పాటల్లో 'నీతో ఏదో' పిక్చరైజేషన్ బాగుంది. 'జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందన్నటు నాకు క్యాష్ కావాలి', 'పైసా ఎవర్నైనా పాగల్ (పిచ్చి) వాణ్ని చేస్తుంది' లాంటి డైలాగ్స్ అక్కడక్కడ ఆకట్టుకున్నాయి. పాతబస్తీ పరిస్థితులను సంతోష్ రాయ్ చక్కగా తెరకెక్కించారు. ఎప్పటిమాదిరిగానే కృష్ణవంశీని ఎక్కువ ఆశించి సినిమా కెళ్లిన ప్రేక్షకుడికి నిరాశ కలిగినా.. నాని తన ఫెర్మార్మెన్స్ తో చక్కటి విందును ఇచ్చాడని చెప్పవచ్చు. పైసా కోసం వెంపర్లాడితే కష్టాలు తప్పవనే సందేశంతో క్రియెటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ అందించిన ఈ చిత్రం నిర్మాతలకు 'పైసా' వసూలు చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. -
రిలీజ్‌కు సిద్ధమైన మూడు సినిమాలు
-
ఒకేసారి కోటి రూపాయలు దొరికితే..!?
‘‘దేవుని 11వ అవతారం ‘పైసా’ అని చెప్పే సినిమా ఇది. ప్రస్తుతం పైసా చుట్టే భూమి తిరుగుతోంది. డబ్బు వల్ల సంబంధాలు తెగుతాయి. అలాగే బలపడతాయి. మనుషుల మానసిక స్థితిగతుల్ని శాసించేది డబ్బు మాత్రమే. ‘పైసా’లో ఈ విషయాలన్నింటినీ చర్చించాం’’ అని కృష్ణవంశీ చెప్పారు. నాని హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో పుప్పాల రమేష్ నిర్మించిన చిత్రం ‘పైసా’. ఈ నెల 7న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణవంశీ మాట్లాడుతూ ‘‘పాతబస్తీలోని ఓ బట్టలషాపులో షేర్వానీ మోడల్‌గా ఇందులో నాని కనిస్తాడు. ఇందులో తన పేరు ‘ప్రక్యాష్’. పేరులోనే క్యాష్ ఉందన్నమాట. డబ్బుని అమితంగా ఇష్టపడతాడు. అలాంటి వ్యక్తికి ఒకేసారి కోటి రూపాయలు దొరికితే.. అతని మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎంతవరకు నీతిగా ఉంటాడు? అనేది సింపుల్‌గా నాని కేరక్టరైజేషన్. విడుదల తేదీని ముందు పెట్టుకుని ఇన్నాళ్లూ షూటింగులు చేశాను. కానీ... ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. నా కెరీర్లో ఇదో అనుభవం’’ అని తెలిపారు. ‘‘నాకు ఇష్టమైన దర్శకుడు కృష్ణవంశీతో పనిచేయడం గొప్ప అనుభూతి. ఇందులో నేను కొత్తగా ఉంటాను. పాటలు విడుదలైన 5 నెలలకు విడుదలై ‘ఈగ’ మంచి హిట్ అయ్యింది. ఈ సినిమా అంతకంటే ఎక్కువ డిలే అయ్యింది కాబట్టి ‘ఈగ’ కంటే పెద్ద హిట్ కావాలి’’ అని నాని ఆకాంక్షించారు. ఖర్చు విషయంలో వెనుకాడకుండా ఈ చిత్రాన్ని నిర్మించామని, కొన్ని కారణాల వల్ల విడుదల ఆలస్యమైందని నిర్మాత చెప్పారు. కేథరిన్, సంగీత దర్శకుడు సాయి కార్తీక్, ఆర్కే, తబర్ కూడా మాట్లాడారు. -
ఒకే నెలలో మూడు సినిమాలు!!
గడిచిన సంవత్సరంలో హీరో నాని నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. చిట్టచివరిసారిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' మాత్రమే విడుదలైంది. అది బ్రహ్మాండమైన బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. సాధారణంగా రాజమౌళి సినిమాలో చేసిన హీరోలకు తర్వాత వచ్చే సినిమాలు అంతగా అచ్చిరావన్న సెంటిమెంటు ఒకటుంది. నానికైతే అసలు ఆ తర్వాత ఏడాది మొత్తం ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ లోటు తీర్చడానికా అన్నట్లు ఫిబ్రవరి నెలలో ఒకేసారి ఈ యువహీరో నటించిన మూడు సినిమాలు విడుదలై ఒకదాంతో ఒకటి పోటీ పడనున్నాయి. పైసా, జెండాపై కపిరాజు, ఆహా కళ్యాణం.. ఈ మూడు సినిమాల్లోనూ నానీయే హీరో. ఈ మూడూ కూడా ఫిబ్రవరిలోనే విడుదల అవుతుండటం విశేషం. వీటిలో కళాత్మక దర్శకుడు కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న పైసా ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. వాస్తవానికి ఇది గత సంవత్సరం చివర్లోనే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాలతో ఆలస్యం అయ్యింది. దాని కారణాలేంటో చర్చించదలుచుకోలేదు గానీ.. ఫిబ్రవరి 7న తమ సినిమా విడుదల అవుతోందని కృష్ణవంశీ చెప్పారు. ఇక సముద్రకన్ని దర్శకత్వం వహించిన జెండాపై కపిరాజు ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదల అవుతోంది. వేలంటైన్స్‌డే బహుమతిగా తమ సినిమాను అందిసు్తన్నట్లు నిర్మాత రాజా పార్థసారథి తెలిపారు. ఇక హిందీలో సూపర్ హిట్‌గా నిలిచిన బ్యాండ్ బాజా బారాత్ సినిమాను 'ఆహా కళ్యాణం' పేరుతో రీమేక్ చేశారు. దీన్ని కూడా ఫిబ్రవరి 7నే విడుదల చేయాల్సి ఉన్నా.. ఇప్పుడు మాత్రం 21వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వరుసపెట్టి మూడు శుక్రవారాల్లో నాని సినిమాలు మూడు విడుదలవుతున్నాయన్న మాట. -
ఈ పాటకు ట్యూన్ తెలుసా?
పల్లవి : మయ్యా మయ్యా మయ్యా మయ్యా మయ్యా అరేబియా ఒయాసిస్సులా ఎదురైందయ్యా అమ్మాయిలో అదేం మాయో మనసే లాక్కుందయ్యా రూపాయే పాపాయై నాకే దిల్ దే దియా మమ్మాయ మాయ మాయమా మాయా మాయా (2) ॥ హే బాల హే బాల... డూ... (3) చరణం : 1 రెయిన్బో రంగేళి రంభల్లే దిగి వస్తే నా రాంబో నువ్వంటూ రంగంలో దింపేస్తే గోలార్ గోల్డ్ ఎదురై క్యాట్వాకింగ్ చూపెడితే డాలర్ డార్లింగై ఒళ్లో వాలితే నిగనిగలాడే ఆ లేడి నన్నొల్లేసిందయ్యా ధగధగలాడే సొగసంతా నా సొమ్మేనందయ్యా ॥॥ చరణం : 2 భూటాన్ బంపర్ లాట్రీ బుగ్గే కొరికేస్తే లక్ష్మీబాంబ్ గుండెల్లో భమ్మని పేలిందంటే కాబోయే రాణి నా కౌగిట్లో పడితే కాని కుర్రగాణ్ని నన్నే లవ్వాడితే బేజా అంతా బేజారై నే బేహోష్ అయిపోయా ఇంకేం చేస్తాం రాజాలా నేన్ తయ్యారైపోయా ॥॥ చిత్రం : పైసా (2014), రచన : సిరివెన్నెల సంగీతం : సాయికార్తిక్, గానం : విజయ్‌ప్రకాష్ -
ఈ సినిమాలకు మోక్షం ఎప్పుడు?
-
‘పైసా’ వసూల్‌కి రెడీ
మనకు దశావతారాల గురించి బాగా తెలుసు. మరి పదకొండో అవతారం గురించి తెలుసా? కృష్ణవంశీ చెబుతోన్న పదకొండో అవతారం డబ్బు. ‘డబ్బు లేనివాడు డుబ్బుకి కొరగాడు’, ‘పైసా మే పరమాత్మ హై’లాంటి సూక్తులన్నీ డబ్బు గురించి పుట్టినవే. ఈ నేపథ్యంలో కృష్ణవంశీ ‘పైసా’ చిత్రాన్ని తీర్చిదిద్దారు. నాని, కేథరిన్ ఇందులో హీరో హీరోయిన్లు. రమేష్ పుప్పాల నిర్మాత. ఈ నెల మూడోవారంలో విడుదల కానున్న ఈ సినిమా గురించి నిర్మాత మాట్లాడుతూ -‘‘కృష్ణవంశీ, నాని కెరీర్ల్లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుంది. సాయికార్తీక్ చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కచ్చితంగా ఈ పైసా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సంతోష్‌కుమార్‌రాయ్, రచన: కెకె బినోజ్, శ్రీనివాసరెడ్డి, పాత్రికేయ.