ఒక్కో సినిమాకు ఒక్కో గురువు
ఒక్కో సినిమాకు ఒక్కో గురువు
Published Thu, Sep 5 2013 2:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:26 PM
నాకు చిన్నప్పట్నుంచీ చదువు మీద పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అందుకే స్కూల్, కాలేజీకి సరిగ్గా వెళ్లేవాణ్ణి కాదు. కాబట్టి.. నా గురువుల గురించి చెప్పాలంటే నా దర్శకుల గురించే చెప్పాలి. నా ఒక్కో సినిమా దర్శకుడు నాకో గురువులాంటివారు.
ఒక్కో సబ్జెక్ట్‌కి ఒక్కో టీచర్ అన్నట్లుగా ఒక్కో సినిమాకి ఒక్కో గురువుని సంపాదించుకున్నందుకు ఆనందంగా ఉంది. మన చేతి వేళ్లు ఒకలా ఉండవన్నట్లుగానే విభిన్న మనస్తత్వాలున్న గురువులతో పని చేయడంవల్ల చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎక్కువ ప్రభావితం చేసిన గురువంటే కృష్ణవంశీగారే.
ఆయన అనుభవం ఉన్న దర్శకుడు. ఆ అనుభవం నాకెంతో ఉపయోగపడింది. అందరి దర్శకులతో ఎక్కువ సమయం గడిపే వీలుండదు. కానీ కృష్ణవంశీగారితో ఆ అవకాశం దొరికింది. దాంతో తన అనుభవాలన్నీ చెప్పేవారు. ఆ అనుభవాలన్నీ నాకు మంచి పాఠాలుగా నిలిచాయి.
- నాని
Advertisement