విమర్శలను గౌరవిస్తా: కృష్ణవంశీ | Krishna Vamsi highly satisfied with Govindudu Andarivadele | Sakshi
Sakshi News home page

విమర్శలను గౌరవిస్తా: కృష్ణవంశీ

Published Wed, Oct 8 2014 11:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:32 PM

విమర్శలను గౌరవిస్తా: కృష్ణవంశీ

విమర్శలను గౌరవిస్తా: కృష్ణవంశీ

చెన్నై: తన సినిమాలపై వచ్చే విమర్శలను గౌరవిస్తానని క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ప్రేక్షకులు విమర్శలు పట్టించుకోరని, వారికి నచ్చితే సినిమా చూస్తారని చెప్పారు. తాను తెరకెక్కించిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా విజయవంతం కావడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా తీశానని కృష్ణవంశీ చెప్పారు. యాక్షన్ హీరో రామ్చరణ్ ను కుటుంబ కథా చిత్రంలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని ముందు కొంచెం భయపడ్డానని వెల్లడించారు. కొత్త అవతారంలో రామ్చరణ్ ను ప్రేక్షకులు ఆదరించడంతో తన అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement