Govindudu Andarivadele
-
రాబోయే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం
అనంతపురం సప్తగిరి సర్కిల్ : కాపులను బీసీలలో చేర్చేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాన్ని మానుకోకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేస్తామని ఏపీ బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. గత ఎన్నికల్లో టీడీపీ బీసీల ఓట్లతో గెలిచిందన్నారు. గద్దెనెక్కిన తరువాత కాపులను బీసీల జాబితాలో చేరుస్తామనే నిర్ణయంతో బీసీలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై జిల్లాకు ఈ నెల 17న జస్టిస్ మంజునాథన్ కమిషన్ బందం విచ్చేస్తోందని, ఈ సందర్భంగా తమ అభ్యంతరాన్ని తెలియచేస్తామన్నారు. ఇందుకు సంబంధించి ఈ నెల 12న స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి బీసీ కుల, ఉద్యోగ, సంక్షేమ సంఘాల నాయకులు, యువజన, విద్యార్థి సంఘాలవారు, కార్మికులు, కర్షకులు, మేథావులు హాజరుకావాలని ఆయన కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌బాబు, రజకాభివధ్ది సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమన్, జిల్లా సహాయ కార్యదర్శి కోట మల్లేష్, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు. -
ముగిసిన గోవిందుడి జ్యేష్టాభిషేకం
ముగిసిన గోవిందుడి జ్యేష్టాభిషేకం శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి నిత్యకైంకర్యాలు చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. శతకలశ స్నపనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం, చెరకు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మహాశాంతి హోమం, తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అక్షతారోహరణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. టీటీడీ స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు. -
కోలీవుడ్‌లో గోవిందుడు అందరివాడు
తెలుగులో మంచి విజయాన్ని చవిచూసిన గోవిందుడు అందరివాడు చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. యువ నటుడు రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి కుటుంబ కథా చిత్రాలను అందంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ప్రేమానుబంధాలు, ఆప్యాయతలు, చిన్న చిన్న మనస్పర్థలు అంటూ పల్లెటూరి వాతావరణంలో సాగే కుటుంబ కథా చిత్రం గోవిందుడు అందరివాడు. ఈ తరం కోరుకునే కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఐఫర్ ఇంటర్నేషనల్ పతాకంపై రఫి మతిర్ రామ్‌లీలా పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, రాజ్‌కిరణ్, కమలిని ముఖర్జి, రెహ్మాన్, ప్రగతి, శ్రీకాంత్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. చిత్ర అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు. -
నా పాట నాతో మాట్లాడుతుంది
అవును.... పాట కాగితంపైకి రాబోయే ముందు, రాస్తున్నప్పుడు, రాసిన తర్వాత నాతో మాట్లాడుతుంది. పూర్వం ధన్వంతరి దగ్గరకు ఎవరైనా వ్యాధిగ్రస్తులు రాగానే వారి శారీరక, మానసిక పరిస్థితి తెలుసుకుని, తన ఔషధమూలికల వనములోకి వెళ్లి నిశితంగా అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు చూసేవాడట. ఆ వ్యాధి తగ్గించగల ఔషధమూలిక తన కొమ్మలనో, రెమ్మలనో ఊపి, ‘ధన్వంతరీ నేను పనికొస్తానా చూడు’ అనేదట. అలా నా సన్నివేశానికి తగిన పల్లవినిస్తూ పాట నాతో మాట్లాడడం మొదలు పెడుతుంది. మైకేలేంజిలోతో శిల మాట్లాడినట్టు, కృష్ణశాస్త్రితో ప్రకృతి మాట్లాడినట్టు, రవివర్మతో కుంచె మాట్లాడినట్టు, అమరశిల్పి జక్కన్నతో ఉలి మాట్లాడినట్టు, సచిన్ టెండూల్కర్‌తో బ్యాట్ మాట్లాడినట్టు... పాట తన కవితో మాట్లాడుతుంది. నాతో మాత్రమే కాదు ఏ పాటల రచయితతోనైనా పాట మాట్లాడుతుంది. సంకల్పాన్ని పరమ ప్రాణంగా భావించుకునే ప్రతి వ్యక్తి ఆత్మకణం బ్రహ్మకణంతో ట్యూన్ అవుతూనే ఉంటుంది. అలాగే కవికి పాటకి ఒక తపస్సంబంధం ఉంటుంది. కనుకనే పాట నాతో మాట్లాడుతుంది అంటున్నాను. డా॥సుద్దాల అశోక్‌తేజ,పాటల రచయిత ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలోని ‘నీలిరంగు చీరలోన...’ : పాట పాటమాలి నానక్‌రాంగూడలో ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్ జరుగుతోంది. కృష్ణవంశీ కబురు పంపాడు. వెళ్లాక ఆయన అన్నమాట: ‘మీరు రాయబోయే పాట ఈ సినిమాకి గుండెకాయలాంటిది’. ‘ప్రతి పాట గురించి డెరైక్టరు ఇలాగే అంటారు...’ అని నవ్వాను నేను. ‘ఈ పాటలో జీవితం ఉండాలి, పండుగలుండాలి, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉండాలి... అలాగని సుత్తిపాట కాకుండా అట్రాక్ట్ చేసేవిధంగా మొదలెట్టాలి’ అన్నాడు. నాలుగురోజుల తర్వాత ఒక పాట తీసుకెళ్లాను. కృష్ణవంశీకి నచ్చలేదు. ఆ పాటలో ‘నీలిరంగు చీర’ అన్న పదమొక్కటే నచ్చిందన్నాడు. మళ్లీ ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు ‘నీలిరంగు చీర...’ అనేది కేంద్ర బిందువు. పాట పాడేది ప్రకాశ్‌రాజ్, జయసుధ. హీరో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాని పాడడు. ఇక్కడ జీవితం గురించి చెప్పాలి... అదే సమయంలో అట్రాక్షన్‌గా ఉండాలన్నది నాకు బాగా నచ్చింది. జీవితం గురించి అట్రాక్షన్‌గా చెప్పలేం. ‘ఒకటే జననం... ఒకటే మరణం...’ అన్నట్టు వెళ్లిపోతుంది. సీరియస్‌నెస్ ఉన్నదగ్గర ఆకర్షణ ఎక్కడ ఉంటుంది? మలేరియా బిళ్లను షుగర్ కోటింగ్‌తో ఇవ్వాలి. ‘నీలిరంగు చీర...’ అమ్మాయి కట్టుకునే వస్త్రం. ఆ సమయంలోనే నా మనసు పలికిన విషయం... ‘ఒరేయ్ అశోక్‌తేజా, జీవితానికి మించిన హొయలొలికించే జాణ ఇంకోటేదైనా ఉంటుందా!’ అని. ఇలాంటి సందర్భాన్నే నా పాట నాతో మాట్లాడుతుందని అన్నాను. జీవితాన్ని మించిన నెరజాణ లేదు. ఎప్పుడు ఏడిపిస్తుందో, నవ్విస్తుందో... ఎప్పుడు శిఖరానికి తీసుకెళుతుందో... పాతాళానికి పడేస్తుందో... పాపం అమ్మాయిల్ని నెరజాణలంటారుగానీ, అమ్మాయికంటే లక్ష రెట్లు ఎక్కువ నెరజాణ జీవితమే. ఇలా ఆలోచిస్తుండగా ఓ అర్ధరాత్రి వచ్చిన ఆలోచన ఏంటంటే... ‘అమ్మాయి గురించి చెబుతూ చెబుతూ వెళ్లి... అమ్మాయి కాదురా అమాయకుడా... జీవితంరా ఇది’ అని చెబితే ఎలా ఉంటుంది అని ఫిక్స్ అయ్యాను. ‘‘నీలిరంగు చీరలోన/ చందమామ నీవె భామా ఎట్ట నిన్ను అందుకోనే/ ఏడు రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా/ నిన్ను ఎట్ట అదుముకోనే’’ మామూలుగా స్త్రీకి ఏడు రంగులుండవు. కానీ స్త్రీలో కేవలం శృంగారమే ఉండదు. అమ్మ ఉంది. తోబుట్టువుంది. స్నేహితురాలుంది. చిన్నారి వేలు పట్టుకుని నడిచే కూతురుంది. అందుకే ఏడు రంగులున్న నడుము అన్నాను. స్థిరంగా ఉన్నదాన్ని కౌగిలించుకుంటాం గానీ తిరుగుతున్నదాన్ని ఎలా కౌగిలించుకుంటాం. జీవితం కూడా ఒకే దగ్గర ఉండదు. ‘‘ముద్దులిచ్చి మురిపిస్తావే/ కౌగిలిచ్చి కవ్విస్తావే అంతలోనే జారిపోతావే’’ పదేళ్లకిందటి నా జీవితం ఎక్కడుంది! ఎప్పుడో నా చేజారిపోయింది. ‘‘మెరుపల్లె మెరిసే జాణ/ వరదల్లె ముంచే జాణ ఈ భూమిపైన నీ మాయలోన/ పడనోడు ఎవడే జాణ’’ ‘‘జాణ అంటే జీవితం.. జీవితం నెరజాణరా దానితో సైయ్యాడరా ఎదురీదరా/ ఏటికీ ఎదురీదరా’’ ఈ పల్లవి చూపించగానే కృష్ణవంశీ బిగ్గరగా కౌగిలించుకున్నాడు. ‘అద్భుతమైనటువంటి ట్విస్ట్ ఇచ్చావు అశోక్.. ఇక చరణాల్లో ఏం చేస్తావో నీ ఇష్టం’ అన్నాడు. మరొక వారం రోజుల్లో చరణాలు రాసుకుని వెళ్లాను. చరణాలు నచ్చాయి. కానీ మద్రాసులో మ్యూజిక్ డెరైక్టర్‌కి ఇచ్చాక... ఆయననుకున్న ట్యూన్లకి, నేను రాసిన చరణాలు పొంతన కుదర్లేదు. మ్యూజిక్ డెరైక్టర్ యువన్‌శంకర్‌రాజా. ‘చరణాలకు నేను ముందు ట్యూన్ ఇస్తాను. దానికి తగ్గట్టు మార్చ’మన్నాడు. నేనూ, కృష్ణవంశీ మద్రాసులో హోటల్ రూం తీసుకుని వారంరోజులుండి ఆ పనికానిచ్చాం. కృష్ణవంశీ ఇల్లు ఆ పక్కనే ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి కలిసేవాడు. మొదటి చరణంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ చెప్పమన్నాడు. ఈ పాటకు సంబంధించి నా లక్ష్యమొక్కటే, అటు సి.నారాయణరెడ్డిగారికీ కనెక్ట్ అవ్వాలి, ఇటు సామాన్యుడికీ అర్థంకావాలి. చరణం: 1 ‘‘రాక రాక నీకైవచ్చీ పున్నమంటి చిన్నది ఇచ్చే కౌగిలింతె బతుకున వచ్చే సుఖమని’’ ‘‘పువ్వులాగ ఎదురే వచ్చి ముల్లులాగ ఎదలో గుచ్చీ మాయమయ్యె భామవంటిదే కష్టమనుకో’’ ‘‘ఏదీ కడదాకా రాదని/ తెలుపుతుంది నీ జీవితం నీతో నువు అతిథివనుకోని ’’ మనిషికి తనను మించిన అతిథి, ఆత్మీయుడు మరొకరు లేరు. ‘‘జాణకాని జాణరా - జీవితం నెరజాణరా జీవితం ఒక వింతరా - ఆడుకుంటే పూబంతిరా’’ బంతి మనల్ని ఆడుకుంటదా, మనం బంతితో ఆడు కుంటామా అనేది మన శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. చరణం: 2 ‘‘సాహసాల పొలమే దున్నీ/ పంట తీసే బలమే ఉంటే ప్రతిరోజు ఒక సంక్రాంతి అవుతుందిరా’’ ‘‘బతుకు పోరు బరిలో నిలిచీ/ నీకు నువ్వే ఆయుధమైతే ప్రతీపూట విజయదశమీ వస్తుందిరా’’ నీకు నువ్వే ఆయుధమవ్వాలనడంలో రెండు అర్థాలున్నాయి. ఒకటి ప్రపంచంతో పోరాడి గెలవాలి. నీలో ఉన్న బలహీనతలతోనూ పోరాడి గెలవాలి. ఇందులో ప్రతి మాట యూత్‌కి కౌన్సెలింగ్లా ఉపయోగపడాలి. అందుకే రామ్‌చరణ్‌తేజ స్టేజ్‌పై ‘ఇంతవరకూ చాలా సినిమాలు చేశాను అంకుల్. కానీ నాకు ఇంత మంచి పాట ఇచ్చింది మీరే’ అన్నాడు. ‘‘నీపై విధి విసిరే నిప్పుతో ఆడుకుంటే దీపావళి’’ దీపావళి నిప్పుతో ఆడుకునే పండగ. ప్రమాదంతో ఆడుకోవడం. మనిషి జీవితంలో విధి ఎప్పుడూ నిప్పులు జల్లుతానే ఉంటుంది. ‘‘చెయ్ రా ప్రతి ఘడియ పండుగే/ చెయ్ర...చెయ్ర...చెయ్ జీవితం అను రంగుల రాట్నమెక్కి ఊరేగరా జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా జీవితం ఒక జాతర చేయడానికే జన్మరా’’ రంగులరాట్నంలో ఒకడు గుర్రంమీద ఎక్కుతాడు, ఒకడు గాడిద మీద ఎక్కుతాడు. ఎవరు ఏ వాహనం ఎక్కినా అందరినీ ఒకేవిధంగా తిప్పుతుంది. ఒకే గమ్యానికి చేర్చుతుంది. ప్రతి ఒక్కరి ప్రారంభం ఒక్కటే, ప్రస్థానం ఒక్కటే. జీవితం ఒక ఉత్సవంలాంటిది. జాతర చేయడానికే వచ్చాం. అందుకే జాతర చేయడానికే ఈ జన్మరా... అని ముగించాను. రిపోర్టింగ్: భువనేశ్వరి -
మళ్లీ రీమేక్‌ల వైపు..
నృత్య దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు ప్రభుదేవా. తెలుగు, తమిళంలో తలా రెండు చిత్రాలు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, గిల్లీ, విల్లు) చేసి జయాపజయాలను సమంగా పొందారు. తర్వాత బాలీవుడ్ వెళ్లారు. అక్కడ రౌడీ రాథోర్, రామయ్య వస్తావయ్యా చిత్రాలతో విజయాలు అందుకున్నారు. తర్వాత తెరకెక్కించిన ఆర్.రాజ్‌కుమార్, యాక్షన్ జాక్షన్ చిత్రాలు నిరాశపరచాయి. విషయం ఏమిటంటే ప్రభుదేవా దర్శకత్వం వహించిన రీమేక్ చిత్రాలు విజయం సాధించాయి. సొంత కథలతో రూపొందించిన చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. దీంతో తనను విజయపరంపరపై కూర్చోబెట్టిన రీమేక్ చిత్రాలపై ప్రభుదేవా దృష్టి సారించారని సమాచారం. ఇటీవల తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన గోవిందుడు అందరివాడే చిత్రం చూశారని తెలిసింది. కుటుంబ అనుబంధాలు ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రభుదేవాను బాగా ఆకట్టుకుందని, దీన్ని హిందీలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. -
హిందీలోకి 'గోవిందుడు' రీమేక్?
రాంచరణ్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన గోవిందుడు అందరివాడేలే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసేందుకు ప్రభుదేవా సిద్దం అవుతున్నారట. ఆ సినిమాను ప్రభుదేవా కోసం ప్రత్యేకంగా ప్రదర్శించడంతో అది చూసినప్పటినుంచి దాన్ని ఎలాగైనా హిందీలో తీయాల్సిందేనని ప్రభుదేవా అంటున్నాడు. యాక్షన్ జాక్సన్ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తాకొట్టడంతో.. ఆ తర్వాత ఏదైనా విభిన్నమైన సినిమా తీయాలని అనుకుంటుండగా... కృష్ణవంశీ కళాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ఆయన దృష్టికి వచ్చింది. హిందీ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా ఉంటారని సమాచారం. ఆ సినిమాలో ప్రకాష్ రాజ్ నటన చూసి ప్రభుదేవా చాలా ఇంప్రెస్ అయ్యారని, దాంతో ఆయన తప్ప వేరేవెరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరనిపించి ఆయన్నే ఖాయం చేయాలనుకుంటున్నారని తెలుస్తోంది. ప్రభుదేవా ఈ సినిమాను ప్రత్యేక స్క్రీనింగ్‌లో చూసిన విషయాన్ని సినిమా నిర్మాత బండ్ల గణేశ్ కూడా నిర్ధారించినా, రీమేక్ విషయం గురించి మాత్రం ఆయనేమీ చెప్పలేదు. ప్రస్తుతానికి తాను ఇంతకంటే ఏమీ చెప్పలేనన్నారు. ఇంతకుముందు పోకిరీని వాంటెడ్గాను, విక్రమార్కుడిని రౌడీ రాథోడ్గాను తీసి బాలీవుడ్లో ప్రభుదేవా కొన్ని విజయాలు చూశారు. దాంతో ఇప్పుడాయన గోవిందుడు సినిమాను రీమేక్ చేయడం పెద్ద విచిత్రమేమీ కాదని సినీ పండితులు అంటున్నారు. -
గోవిందుడు అందరివాడేలే
-
మహిళలు మద్యం తాగే విషయం నాకు తెలియదు
పబ్‌లకు వెళ్లినా పండ్లరసమే సేవిస్తానంటున్నారు కాజల్ అగర్వాల్. ఏమిటి తాటి చెట్టు కింద చల్ల తాగుతున్నానన్న పాత సామెత గుర్తొస్తుందా? ఇంతకీ ఈ బ్యూటీ పబ్‌ల వ్యవహారం ఏమిటో చూద్దామా? ఆ మధ్య ప్రియా ఆనంద్ అరిమానంబి చిత్రంలో గ్లాసులు గ్లాసుల మద్యం తాగి రచ్చకెక్కింది. ఏమిటమ్మ ఆ నటన అంటే, ఏం మగాళ్లు మద్యం సేవించడం లేదా? వాళ్లకో న్యాయం ఆడళ్లకో న్యాయమా అంటూ ఎదురు ప్రశ్నలు గుప్పించి సంచలనం సృష్టించింది. ఆ సంఘటన మరుగున పడుతోందనుకుంటున్న సమయంలో కాజల్ అగర్వాల్ తెలుగు చిత్రం గోవిందుడు అందరి వాడే చిత్రంలో ఫారిన్ సరుకు గడగడా తాగేసి మరోసారి చర్చల్లో కెక్కారు. దీంతో కాజల్ అగర్వాల్ తరచూ పబ్‌లకు, బార్లకు వెళతారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇందుకు ఈ బ్యూటీ వివరణ భిన్నంగా ఉంది. గోవిందుడు అందరివాడే చిత్రకథ చెప్పినప్పుడే దర్శకుడు చిత్రంలో మద్యం తాగే సన్నివేశం ఉంటుందని చెప్పారన్నారు. అలాంటి సన్నివేశంలో నటించే విషయమై తాను సంకోచించగా ఈ రోజుల్లో చాలామంది ఆడవారు తరచూ పబ్‌లకు వెళుతున్నారు. అక్కడ వారు మద్యం సేవించడం అనేది సర్వసాధారణం అని చెప్పారన్నారు. దర్శకుడలా క న్విన్స్ చేయడంతో తాను అలా నటించానని వివరించారు. నిజానికి మహిళలు మద్యం తాగే విషయం తనకు తెలియదన్నారు. తానెప్పుడూ మద్యం తాగలేదన్నారు. చిన్న వయసు నుంచే ఏది తప్పు ఏది ఒప్పు అనేది తనకు కుటుంబ సభట్యులు నేర్పించారని పేర్కొన్నారు. అయితే స్నేహితులతో పబ్‌లకు వెళుతానని అక్కడ పండ్లరసం మాత్రమే సేవిస్తానని తెలిపారు. ఇక మగవారైనా, ఆడవారైనా మద్యం సేవించడం చెడ్డ అలవాటన్నారు. దీని వలన చాలా కుటుం బాలు వేదనకు గురవుతున్నాయన్నారు. ఇకపోతే సినిమాల్లో ఇలాంటి సన్నివేశాలు పెట్టేది జాలీ కోసమేనని స్పష్టం చేశారు. వాటిని నిజ జీవితంలో ఎవరూ అనుసరించరాదని కాజల్ హితవు పలికారు. -
మెగా ఫ్యామిలీపై దాసరి విసుర్లు!
ప్రముఖ దర్శక-నిర్మాత దాసరి నారాయణ రావు పరోక్షంగా మెగా ఫ్యామిలీపై చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన 'లక్ష్మీ రావే మా ఇంటికి' చిత్రం ఆడియో ఆవిష్కరణ సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రపరిశ్రమలో రౌడీయిజం నడుస్తోందని, పెద్ద సినిమాల కోసం చిన్న సినిమాలను బలి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులను తాను చూడలేదని, ఇటువంటి పరిస్థితులు వస్తాయని కలలో కూడా అనుకోలేదని అన్నారు. చిన్న నిర్మాతల సినిమాలకు థియేటర్లు కావాలని అడిగితే ''సినిమా రెడీ చేసి పెట్టుకో, వారం గ్యాప్ వస్తే వేసుకో, ఎప్పుడు ఖాళీ వస్తే అప్పుడు వేస్తాం'' అని అంటున్నారని చెప్పారు. 'లౌక్యం' సినిమా అద్భుతమైన వసూళ్లతో ముందుకెళుతున్న సమయంలో ఓ పెద్ద హీరో కోసం ఐదో రోజున 37 సెంటర్లలో ఆ సినిమా తీసేశారన్నారు. కానీ, ఆ హీరో సినిమా మూడు రోజులు కూడా ఆడలేదని, దాంతో మళ్లీ 'లౌక్యం' చిత్రాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టారని చెప్పారు. రామ్‌చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం గురించే దాసరి విమర్శించారని ఫిల్మ్‌నగర్ టాక్. 'లౌక్యం' మూవీ సెప్టెంబరు 26న విడుదలైంది. 'గోవిందుడు అందరివాడేలే' అక్టోబరు 1న విడుదలైంది. దీనిని దృష్టిలోపెట్టుకొనే దాసరి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. గతంలో కూడా ఒక సందర్బంలో దాసరి, రామ్‌చరణ్ ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. ఆ తరువాత దాసరి గానీ, రామ్ చరణ్ గానీ ఏమీ మాట్లాడలేదు. ఇప్పుడు 'లౌక్యం' సినిమా బాగా ప్రదర్శిస్తున్నప్పటికీ రామ్‌చరణ్ చిత్రం కోసం దానిని థియేటర్లలో ఎత్తివేయడంతో దాసరి ఈ వ్యాఖ్యలు చేశారని అనుకుంటున్నారు. ** -
మెగా ఫ్యామిలీపై దాసరి విసుర్లు!
-
వారికే ప్రాముఖ్యతనిస్తా
అభిమానుల అభిరుచి మేరకే తన నటన ఉంటుందని కాజల్ అగర్వాల్ అంటోంది. టాలీవుడ్లో గోవిందుడు అందరి వాడే చిత్రం అందించిన విజయంతో మంచి జోష్‌లో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లో దుమ్మురేపుతోంది. చిత్రాల కంటే వీటికే అధిక ప్రాముఖ్యత నిస్తున్నట్లున్నారు. ఇకపోతే తమిళంలో జిల్లా చిత్రం తరువాత మరో అవకాశం లేదీ అమ్మడికి. అందుకు కారణం నిర్మాతల కళ్లు బైర్లు కమ్మే పారితోషికం డిమాండ్ చేస్తోందన్న టాక్ బాగా స్ప్రెడ్ అవడమే. ఈ విషయం అటుంచితే ఎవరైనా విజయవంతమైన చిత్రం తీయాలనే ప్రయత్నిస్తారు. అయితే ప్రస్తుతం పది చిత్రాల్లో ఒక చిత్రం మాత్రమే హిట్ అనిపించుకుంటోంది. దీని గురించి కాజల్ మాట్లాడుతూ అభిమానులు సోషియల్ నెట్‌వర్క్స్‌లో తన గురించి చేసే వ్యాఖ్యలకూ ప్రాముఖ్యతనిస్తానని వారి సలహాలను స్వీకరిస్తానంది. సినిమా జయాపజయాలనేవి అభిమానుల చేతుల్లోనే ఉంటాయని చెప్పింది. అందువలనే వారి అభిరుచికి అనుగుణంగా నటించడానికి ప్రయత్నిస్తానంది. తన నటనపై విమర్శలు చేస్తే తదుపరి చిత్రంలో ఆ కొరతలు లేకుండా జాగ్రత పడతానని తెలిపింది. అదే విధంగా తనకు ఎలాంటి కాస్ట్యూమ్స్ బాగుంటాయన్న విషయంలో వారి సూచనలను పాటిస్తానని కాజల్ చెప్పడం గమనార్హం. -
‘గోవిందుడు అందరివాడేలే’ మూవీ సక్సెస్ మీట్
-
విమర్శలను గౌరవిస్తా: కృష్ణవంశీ
చెన్నై: తన సినిమాలపై వచ్చే విమర్శలను గౌరవిస్తానని క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ప్రేక్షకులు విమర్శలు పట్టించుకోరని, వారికి నచ్చితే సినిమా చూస్తారని చెప్పారు. తాను తెరకెక్కించిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా విజయవంతం కావడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా తీశానని కృష్ణవంశీ చెప్పారు. యాక్షన్ హీరో రామ్‌చరణ్ ను కుటుంబ కథా చిత్రంలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని ముందు కొంచెం భయపడ్డానని వెల్లడించారు. కొత్త అవతారంలో రామ్‌చరణ్ ను ప్రేక్షకులు ఆదరించడంతో తన అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పారు. -
ఆ క్రెడిట్ అంతా దర్శకుడు కృష్ణవంశీదే!
హైదరాబాద్: గోవిందుడు అందరివాడేలే చిత్రం ఆ విధంగా రూపొందించిన క్రెడిట్ అంతా దర్శకుడు కృష్ణవంశీదేనని ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. ఈ రోజు ఉదయం సాక్షి టీవీ చిట్‌చాట్‌లో బండ్ల గణేష్‌తోపాటు హీరో శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు. ఈ చిత్రంలో రామ్‌చరణ్ - కాజల్ మూడవసారి జంటగా నటించారు. హ్యాట్రిక్ విజయం సాధించారు. ఈ మూవీ నిర్మాణంలో ముగ్గురి పాత్ర కీలకంగా ఉన్నట్లు బండ్ల గణేష్ తెలిపారు. ఆ ముగ్గురు రామ్ చరణ్ - కృష్ణవంశీ - పరుచూరి వెంకటేశ్వర రావు అని వివరించారు. మెగాస్టార్ చిరంజీవి కూడా కొన్ని సలహాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితులలో ఇటువంటి సినిమా రావలసిన అవసరం ఉందని కృష్ణ వంశీ చెప్పినట్లు తెలిపారు.ఆయనపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు.తెలుగు చిత్రం పరిశ్రమకు ఆయన ఓ వరం అన్నారు. ఫ్యామిలీ డ్రామా, కుటుంబ బంధాలు - అనుబంధాలతోపాటు పల్లెటూరి నేపధ్యంలో చిత్రం నిర్మించడంలో కృష్ణవంశీ దిట్ట అన్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నారు. సినిమా పూర్తి అయ్యేవరకు ఇక్కడే ఉండి సహకరించినట్లు తెలిపారు. మెగా ఫ్యామిలీ చిరంజీవి-పవన్ కల్యాణ్- రామ్ చరణ్‌లతో చిత్రం నిర్మించే ఆలోచన ఏమైనా ఉందా? అన్న ప్రశ్నకు ఆ రకమైన ఆలోచన మరీ ఎక్కువ ఆశైపోతుందని గణేష్ అన్నారు. చిరంజీవి 150వ సినిమా నిర్మిస్తారా? అగి అడగగా, అటువంటి అవకాశం లేదని చెప్పారు. అయితే ప్రయత్నిస్తానని అన్నారు. గ్రామీణ వాతావరణంలో, కుటుంబ నేపథ్యంలో ఇటువంటి చిత్రాలు రూపొందించడంలో కృష్ణవంశీది అందెవేసి చేయని శ్రీకాంత్ అన్నారు. ఆయన కూడా పశ్చిమగోదావరి జిల్లా నుంచి వచ్చినట్లు తెలిపారు. ** -
శ్రీకాంత్ న్యూస్ చదివితే..!
-
గోవిందుడు ముచ్చట్లు!
-
అందరివాడు.. ఈ గోవిందుడు!
-
స్విట్జర్లండ్ వస్తానని నాన్నకు లేఖ రాశా!
తాను స్విట్జర్లాండ్ చూడాలనుకున్నప్పుడు నాన్నకు ఎలా చెప్పాలో తెలియలేదని, అందుకే ఆ విషయాన్ని ఒక లేఖలా రాసి ఆయన టేబుల్ మీద పెట్టేశానని 'గోవిందుడు అందరివాడేలే' హీరో రాంచరణ్ చెప్పాడు. విజయదశమి సందర్భంగా హీరో రాంచరణ్, హీరోయిన్ కాజల్ అగర్వాల్‌లను దర్శకుడు కృష్ణవంశీ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అమ్మానాన్నల్లో ఎవరంటే ఇష్టం అన్నప్పుడు ఈ ప్రస్తావన వచ్చింది. తనకు అమ్మదగ్గరే ఎక్కువ చనువని, అయితే పెద్ద పెద్ద విషయాలకు మాత్రం నాన్నను అడగాల్సి వచ్చినప్పుడు ఆయనకు లెటర్లు రాసేవాడినని చెర్రీ తెలిపాడు. ఇంద్ర సినిమాలోని 'దాయి దాయి దామ్మా' పాట షూటింగ్ స్విట్జర్లండ్లో చేశారని, అప్పట్లో తనకు ఆ దేశం చూడాలని చాలా ముచ్చటగా ఉండేదని అన్నాడు. దాంతో నతకు సెలవులు మొదలైపోయాయని, స్నేహితులంతా కూడా ఊళ్లు వెళ్లిపోయారని, మీరు ఏమీ అనుకోకపోతే మీదోపాటు స్విట్జర్లండ్ వస్తానంటూ ఓ లేఖ రాశానన్నాడు. చివర్లో నాన్నా.. నో అని మాత్రం చెప్పద్దు ప్లీజ్ అని రాసినట్లు కూడా చెర్రీ వివరించాడు. దాన్ని ఆయన టేబుల్ మీద పెట్టేసినట్లు తెలిపాడు. దాంతో నాన్న నవ్వేసి, వీడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటూ అమ్మతో చెప్పారని, అలా స్విట్జర్లండ్ వెళ్లానని చెప్పాడు. -
రమ్యకృష్ణ విషయంలో అస్సలు వంక పెట్టడానికి లేదు!
పరికిణీలూ పూలజడలూ... పట్టుచీరలూ ఏడువారాల నగలూ... ముంగిట్లో ముత్యాల ముగ్గులూ... పెరట్లో ధాన్యాల రాశులూ... అరిసెలూ సున్నుండలూ కజ్జికాయలూ... ఓర చూపులూ దోర నవ్వులూ చిలిపి ముద్దులూ.. ఆక్రోశాలూ.. ఉక్రోషాలూ.. తగాదాలూ తప్పిదాలూ... కృష్ణవంశీ సినిమా అంటే ఇవన్నీ ఉండాల్సిందే! పండగకు అమ్మమ్మగారి ఊరెళ్లినట్టుగా... ఇంట్లో ఐదు రోజుల పెళ్లి జరిగినట్టుగా... కృష్ణవంశీ సినిమా చూస్తుంటే ఏదో సంబరం..! ఇక్కడ సక్సెస్‌లూ, ఫెయిల్యూర్లూ పక్కన పెట్టండి. మన మూలాల్ని మనకు గుర్తు చేయడమే కృష్ణవంశీ చేసే పని. గుడ్ డెరైక్టర్ అనిపించుకున్న కృష్ణవంశీ... తను మాత్రం బ్యాడ్ హజ్బెండ్‌ని, బ్యాడ్ ఫాదర్‌ని అని చెబుతున్నారు. ఆయన తాజా సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’ కబుర్లతో పాటు కెరీర్ అచ్చట్లు... ఫ్యామిలీ ముచ్చట్లు మనసు విప్పి ‘సాక్షి’ ముందు ఆవిష్కరించారు. ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రాన్నే అటూ ఇటూ మార్చి ‘గోవిందుడు ఆందరివాడేలే’గా తీశారని కామెంట్... కృష్ణవంశీ: ఆ సినిమాను ఆదర్శంగా తీసుకుంటే తప్పేంటి? ఇవాళ్టి రోజుల్లో మన కుటుంబ వ్యవస్థలో ఎవరూ ఎవర్నీ కలుపుకొని పోవడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడంలేదు. అందుకే ఇలాంటి సినిమాల అవసరం ఉంది. నరుక్కోవడాలు, చంపుకోవడాలు, బాంబులు విసరడాలు.. ఇంకెంత కాలం చెప్పండి? మన సెన్సిబిల్టీకి తగ్గ సినిమా తీయాలని ఇది తీశాను. అది నచ్చింది కాబట్టే, ఈ సినిమాకి ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. ఫ్యామిలీ సినిమాలంటే ఒక మనవడో, మనవరాలో కుటుంబాన్ని కలపడానికి ట్రై చేయడం.. ఇదేనా.. వేరే కథలు రావా? వాస్తవానికి అప్పటి ‘దేవుడు చేసిన మనుషులు’, ఆత్మబంధువు’, ‘సంబరాల రాంబాబు’, ‘వారసుడొచ్చాడు’... ఇవన్నీ కూడా ఎవరో ఒకరు కుటుంబాన్ని కలిపే కథలే కదా. అన్ని కథలనూ అందరూ ఇష్టపడి చూశారుగా. ఇన్ని సినిమాలున్నప్పుడు మళ్లీ అవే చేయడం ఎందుకు? మన కథలన్నీ రామాయణ, భారతాల నుంచే పుడుతున్నాయి. ఎవరేం చేసినా, వాటి చుట్టూనే తిరగాలి. తప్పదు. అయినా నేనేం ఇది కొత్త కథ అనడం లేదు. కాకపోతే.. ‘గోవిందుడు..’ సినిమా కథ వేరు.. ఆ కథలు వేరు. అచ్చ తెలుగు సంప్రదాయాలతో సినిమా తీశారు సరే.. మరి హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో మందు కొట్టించే సన్నివేశం చేయడం అవసరమా? సమాజంలో ఎవరూ చేయడంలేదా. ఉన్నదే చూపించా. ఏం మగవాళ్లు మందు తాగొచ్చు కానీ, ఆడవాళ్లు తాగకూడదా? మగ, ఆడ సమానం అని హక్కులు మాట్లాడుతుంటారు కదా. మగవాళ్లు పెట్టిన ఆంక్షల ప్రకారం స్త్రీ బతకాలా? సినిమా గురించి పక్కనపెడితే.. వ్యక్తిగతంగా ఆడవాళ్లు మందు తాగడాన్ని మీరు హర్షిస్తారా? తప్పకుండా.. ఎందుకంటే అలవాట్లనేవి వారి వ్యక్తిగతం. పురుషాధిక్య ప్రపంచంలో ఆలోచనలన్నీ పురుషుడి పక్షానే ఉంటున్నాయి. నా దృష్టిలో స్త్రీ అంటే ఏంటో చెప్పనా.. ‘స్త్రీలు నాకన్నా తక్కువ అని నేననుకోను.. నాకన్నా పై మెట్టు మీద ఉన్న జాతికి చెందినవారు’ అనుకుంటాను. పదిమందికి నష్టం కలిగించని దేన్నయినా నేను ఆమోదిస్తాను. ‘‘కృష్ణవంశీతో ఇప్పుడు సినిమా అంటే నటన నేర్పిస్తాడు.. నేను అందుకు రెడీగా లేను’’ అని చిరంజీవిగారు బహిరంగంగా పేర్కొనడం పట్ల మీ ఫీలింగ్? అది ఆయన గొప్పతనం. ఆయనకు తెలియని యాక్టింగా? ది బెస్ట్ నుంచి ది వరస్ట్ అనదగ్గ దర్శకులందరితోనూ ఆయన చేశారు. ఆయన డైనమిజమ్, లైవ్లీనెస్, ఎమోషన్ అన్నీ ఇష్టం. గత తరానికి మహానటుడు ఎన్టీఆర్ ఓ నిఘంటువు అయితే.. ఈ తరానికి చిరంజీవి టెక్ట్స్‌బుక్. ఆయన నా గురించి అలా అన్నారంటే అదంతా ఆయన అభిమానం. ఈ చిత్ర ఆడియో వేడుకలో మీరు ఎమోషనల్ అయ్యారేం? మూడేళ్లుగా ఎదురైన అనుభవాలు, చూసిన పరిస్థితులు, నాతో కొందరు ప్రవర్తించిన విధానం, సినిమాలను సరిగ్గా తీయలేకపోయినందుకు పడిన బాధ.. ఇలా కొన్ని కారణాలున్నాయి. ఈ పరిస్థితుల్లో సడన్‌గా అన్నయ్య (చిరంజీవి)లాంటి పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి, చరణ్ లాంటి హీరో... నన్ను నమ్మి కథ పూర్తిగా వినకుండానే ‘సినిమా చేసేస్తాం’ అన్నారు. అప్పుడు భావోద్వేగానికి గురవడం సహజం కదా! ఇన్నేళ్ల కెరీర్లో జయాపజయాలకు అతీతంగా స్పందించడం మీకు అలవాటై ఉంటుంది. అలాంటిది ఏవో కొన్ని సినిమాలు ఆడకపోతే ఎమోషనల్ కావడమా? ‘సిందూరం’ చిత్రాన్ని తీసుకుందాం. ఆ సినిమా సక్సెస్, ఫెయిల్యూర్ గురించి పక్కనపెడదాం. వంద శాతం క్రియేటివ్ శాటిస్ఫేక్షన్ ఉన్న చిత్రం అది. కానీ, గత రెండు, మూడేళ్లల్లో నేను తీసిన సినిమాల్లో నేననుకున్నది తెరపై పూర్తిగా తీయలేకపోయాను. నేననుకున్నది స్క్రీన్ మీద పెట్టలేకపోయాను. దానికి రకరకాల కారణాలున్నాయి. ‘పైసా’ని తీసుకుందాం. మూడు నెలల్లో పూర్తి చేసిన ఆ చిత్రం విడుదలకు రెండేళ్లు ఆగాల్సి వచ్చింది. నేననుకున్నది తీయలేకపోవడానికి కారణం.. నేను ఎదుర్కొన్న పరిస్థితులు అలాంటివి. జనరల్‌గా ‘మేం అనుకున్నది తీయలేకపోయాం’ అని అప్‌కమింగ్ డెరైక్టర్లు అంటుంటారు. మీలాంటి దర్శకులు ఇలా అనడమా? నాలాంటి దర్శకులకే ఆ పరిస్థితి వస్తుంది. ఎందుకంటే, నేను రెగ్యులర్ సక్సెస్ఫుల్ ఫార్ములాలో సినిమాలు తీసే డెరైక్టర్ని కాదు. ఓ కొత్త జానర్లో తీస్తాను. సో.. నిర్మాతను, ఆరిస్టులను కన్విన్స్ చేయడం కష్టం. ఇప్పుడు ‘గోవిందుడు..’ సక్సెస్ అయ్యింది కాబట్టి, తర్వాత కూడా మళ్లీ అలాంటి సినిమానే చేద్దాం అంటారు. కానీ, నేనందుకు విరుద్ధం. వాళ్ల మైండ్‌సెట్‌ని దీన్నుంచి నా జానర్లోకి తీసుకెళ్లడానికి కష్టం అవుతుంది. కొత్త జానర్లో సినిమాలు చేసే హీరోలు లేరంటారా? ఇండియాలో ఆమిర్‌ఖాన్ తప్ప ఎవరున్నారు. ఒక్క ఆమిర్‌ఖాన్ ఎంతమందిని శాటిస్ఫై చేస్తాడు. అయినా హీరోలను తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే, వాళ్లు కనెక్ట్ కాని కథలో ఎలా ఇమిడిపోగలుగుతారు? ఆమిర్ఖాన్నే తీసుకుందాం. ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ‘లగాన్’ చిత్రం తీసిన దర్శకుడు ఆశుతోష్ గోవారీకర్ ‘స్వదేశ్’ కథతో ఆమిర్‌ఖాన్‌ని కలిస్తే, ‘నాకు కనెక్ట్ కావడం లేదు’ అని సింపుల్‌గా చెప్పేశాడు. ‘రోబో’ కథను షారుక్ ఖాన్‌కి శంకర్ చెబితే, ‘నా వల్ల కాదు’ అన్నాడు. డెరైక్టర్లను హీరోలు నమ్మకపోవడం ఎక్కువయ్యిందంటారా? అంత ఆలోచించలేదు నేను. ఏ హీరో అయినా కథకు కనెక్ట్ కాకపోతే, పాత్రకు ఎలా న్యాయం చేయగలుగుతాడు? కనెక్ట్ కాకపోతే కాన్ఫిడెన్స్ ఉండదు. పోనీ.. డెరైక్టర్ చెప్పిందల్లా చేసుకుపోవడానికి ఆ హీరో ‘రోబో’ ఏం కాదు కదా! గత ఐదేళ్లనే తీసుకుందాం.. హీరో పేరు మీదే 50, 60 కోట్లూ బిజినెస్ అవుతోంది. అన్నీ హీరో పేరు మీదే ఆధారపడుతున్నప్పుడు అతను జాగ్రత్తపడటంలో తప్పేంటి? గుళ్లో రాముడి విగ్రహం ఉందనుకోండి.. రాముడి గురించి ఆలోచిస్తారు తప్ప, దాన్ని చెక్కినవాడి గురించి మీరు ఆలోచిస్తారా? అంటే.. హీరో వర్షిప్ అనేది కరెక్టేనంటారా? ప్రపంచంలో ఏ భాషకు చెందిన పరిశ్రమను తీసుకున్నా.. హీరో వర్షిప్ కచ్చితంగా ఉంది. హాలీవుడ్ సినిమా ‘రాంబో’ని తీసుకుందాం. ఆ చిత్రదర్శకుడు ఎవరు అంటే ఎవరూ చెప్పలేరు? హీరో ఎవరు అంటే.. టకీమని చెప్పేస్తారు. సో.. ఎంత ప్రతిభ ఉన్న దర్శకుడైనా హీరోను అప్రోచ్ కావాల్సిందేనా.. హీరోలు తమంతట తాము రారా? అలా ఎందుకు ఎదురుచూడాలి? ఇప్పుడు నేనెవర్నీ నాకు అవకాశం ఇవ్వండని అడగను. కానీ, నా దగ్గరున్న కథకు ఏ హీరో యాప్ట్ అనిపిస్తే.. వాళ్లను అడుగుతాను. నేను అడగకుండా వాళ్లంతట వాళ్లు ఎందుకు వచ్చి అడగాలి? అసలు ఎవరైనా ఎందుకు అడుగుతారు? మీ సినిమాకీ సినిమాకీ మధ్య గ్యాప్ వస్తోంది? అనుకోకుండా వచ్చిన గ్యాప్ అది. ఇక ఆ దశ అయిపోయింది. గ్యాప్ లేకుండా చేస్తా. ఆ దశ పోయిందని బలంగా నమ్ముతున్నారా? ‘మురారి’ తీశాను. సంకల్పం అనేది ఆ చిత్రంలోని ప్రధానాంశం. నిజంగా కూడా నాది అదే మైండ్ సెట్. నేను అయిపోయానని ప్రపంచం ముద్ర వేసినప్పుడు నేనే తిరిగొచ్చాను. నేనే చిరంజీవిగారిని, చరణ్‌ని కలిసి, కన్విన్స్ చేశాను. ‘మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోవాలి.. మన కుటుంబాన్ని మనమే కలుపుకోవాలి’ అని ‘గోవిందుడు..’లో చెప్పాను. నిజజీవితానికి కూడా అదే వర్తిస్తుంది. నేను ఇంట్లో కూచుంటే ఎవరు పిలుస్తారు. మన ప్రయత్నం ఉంటేనే ఎదుటివాళ్లకి ‘ఇతని దగ్గర ఏదో ఉంది’ అనిపిస్తుంది. మీరెప్పుడూ ఎవరి దగ్గరా అవకాశాలు అడిగినట్లు లేరే? అడగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు అడగాలి. అందుకే అన్నయ్యను కలిశాను. ‘నిన్నే పెళ్లాడతా’ అప్పట్నుంచి అన్నయ్య ఇంటి తలుపులు నా కోసం తెరిచి ఉన్నాయి. అందుకే వెళ్లి కలిశాను. ఎక్కాల్సిన గడపే ఎక్కా! ప్రొడక్షన్ ఎందుకు ఆపేశారు? నిర్మాణం నా వల్ల కాదు. నేను డబ్బు మనిషిని కాదు కాబట్టి, నిర్మాణం నాకు సూట్ కాదు. కొంతమంది దర్శకులతో పోల్చితే దర్శకుడిగా కూడా మీ సంపాదన తక్కువేనేమో? నాకు సరిపోయేంత డబ్బు ఉంది. ఒకవేళ అది సరిపోదు.. ఇంకా ఎక్కువ కావాలంటే మా ఆవిడ దగ్గర బోల్డంత డబ్బు ఉంది (నవ్వుతూ). మనిషికి సరిపోయేంత డబ్బు అంటే... ఎంత? ఒక మంచి ఇల్లు, ఏసీ రూము, తిరగడానికి కారు, అందులో పుష్కలంగా పెట్రోల్ పోయించగలిగే కెపాసిటీ, ఏడాదిలో రెండు సార్లు విహార యాత్రకు వెళ్లడానికి కావాల్సిన డబ్బు, రెండు పూటలా తిండి, తాగడానికి మందు, పీల్చడానికి సిగరెట్లు, వేసుకోవడానికి మంచి బట్టలు, కట్టుకోవడానికి సెల్‌ఫోన్ బిల్లు, మన మీద ఆధారపడే మన కుటుంబ సభ్యులను సౌకర్యంగా ఉంచగలిగే స్తోమత... ఇంతకు మించి ఏం ఉన్నా... వాడు ఆ ఇంటికి వాచ్‌మేన్ కిందే లెక్క. పెద్ద ఇల్లు కట్టుకున్న తర్వాత, దాన్ని మెయిన్టైన్ చేయడానికి పనిమనుషులను పెట్టుకోవాలి. వాళ్లు పనులు చేసుకుని బయటికెళుతుంటే.. ఇంట్లోంచి ఏమైనా తీసుకెళ్లిపోతారేమో అని టెన్షన్.. లోపలి నుంచి ఎవరైనా బయటికొస్తే టెన్షన్.. ఇక సుఖం ఏం ఉంటుంది. భక్తి బాటలో వెళుతున్నట్లున్నారు. వయసు తెచ్చిన మార్పా? వయసా? నాకు వయసు పైబడిందని అనుకోవడం లేదు. అయినా మనకు పదేళ్ల వయసులో కరెక్ట్ అనిపించినది తర్వాత కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇరవయ్యేళ్ల వయసులో చేసినది ముప్ఫయ్ ఏళ్లల్లో తప్పనిపించొచ్చు. అనుభవం నేర్పే పాఠాల దారిలోనే మనసు వెళుతుంది. ఇలాంటి మార్పుని ‘మాట మార్చడం’ అంటారేమో? నేను మాట మార్చలేదు. నా విధానం మారిందని చెబుతున్నా. ఇప్పుడు మనం ఒక చొక్కా కొనుక్కుంటాం. ఓ ఏడాది తర్వాత అది పాతదైపోతుంది. దాన్ని మార్చేసి, కొత్త చొక్కా కొనుక్కుంటాం కదా. ఇదే బాగుంది కదా అని వేసుకోం కదా. ఇప్పుడు మా అబ్బాయిని తీసుకుందాం. వాటికి ఒకటి, రెండేళ్లప్పుడు నిద్రపోవడాన్ని ‘తాచ్’ అనేవాడు. ఇప్పుడా మాటను మేం సరదాగా అంటే, నవ్వేస్తాడు. ఇప్పుడు నిద్ర అంటాడు. ఇంకొన్నాళ్ల తర్వాత స్లీప్ అంటాడేమో. అంటే.. మాట మార్చాడని అనలేం కదా! ఎప్పుడూ ఒకే మాట మాట్లాడం కదా. జ్ఞానం పెరిగేకొద్దీమాట తీరు మారుతుంది. కానీ, ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని ఉద్దేశపూర్వకంగా మాట మార్చితే అది తప్పు. మీ సినిమాల్లో మన అరిసెలు, సున్నుండలు అన్నీ చూపిస్తారు. పర్సనల్‌గా మీకెలాంటి ఫుడ్ ఇష్టం? నాకు సున్నుండలు ఇష్టం. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారింట్లో పులిహోర ఇష్టం. రమ్యకృష్ణ చైనీస్ వంటకాలు తిందామంటుంది. సో.. దాన్నీ ఇష్టపడతాను. నాకు పప్పుచారు, ఆవకాయ ఇష్టం. అవి ఉంటే ఇష్టంగా తింటాను. అవి లేకపోతే నాకేదైనా ఒకటే! మన సంస్కృతి, సంప్రదాయాలపై మీరు విపరీతమైన అభిమానం చూపిస్తారు.. ఎందుకని? మన నేటివిటీ మీద మనకే ప్రేమ లేకపోతే వేరేవాళ్లకి ఎందుకుంటుంది? మన మూలాలను వెతుక్కోవాల్సి వస్తోంది. అవి గుర్తు చేయడం కోసమే సినిమాల్లో మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తాను. తెలుగు భాష చచ్చిపోతోందని కొంతమంది ఆంగ్లంలో బాధపడిపోతుంటారు. దానివల్ల లాభమేంటి? ఆరోగ్యం విషయంలో మీరెంత శ్రద్ధగా ఉంటారు? నాకు శ్రద్ధ లేదు. మా ఇద్దరికీ కలిపి రమ్యకు ఉంది. ఆరు నెలలకోసారి జనరల్ చెకప్స్ అంటూ చంపేస్తుంది. ఏం టెస్టులు అని విసుక్కుంటే గొడవ చేసేస్తుంది. నాకు సంబంధించి చాలా విషయాలు తనే చూసుకుంటుంది. అంత జాగ్రత్తగా ఉండే రమ్యగారు మిమ్మల్ని సిగరెట్లు మానేయమని ఎప్పుడూ అనలేదా? ఎందుకు చెప్పదు. ఆవిడ బాధ్యత ఆవిడ చేస్తుంది. నా బాధ్యత నేను చేయాలి కదా... (నవ్వు) మీరు తీసే సినిమాల్లో అందమైన కుటుంబాలు ఉంటాయి.. మరి.. మీ తోడబుట్టినవాళ్ల గురించి? ఓ తమ్ముడు చనిపోయాడు. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. అందరూ హైదరాబాద్‌లోనే ఉన్నారు. అందరూ హ్యాపీ. నేను ఫ్యామిలీ సినిమాలు తీస్తాను కానీ.. యాక్చువల్‌గా చాలా బ్యాడ్ ఫ్యామిలీ మేన్‌ని. ఉన్నమాట చెప్పాలంటే.. నాకు సినిమాలు తప్ప వేరే దేని మీదా ఆసక్తి ఉండదు. అదేంటి.. మీరు కానిది మీరు తెరపై ఎలా ఆవిష్కరించగలుగుతున్నారు? హ్యుమన్ ఎమోషన్స్ అనేది బయటికి చెప్పలేను కానీ.. లోపల ఉందేమో.. నేను కానిది తీస్తున్నానని ఎందుకు అనుకుంటున్నారు. నేనేం రాక్షసుణ్ణి కాదు. పక్కా ఎమోషనల్ పర్సన్‌ను. ఫైనల్‌గా.. మీ తదుపరి చిత్రం గురించి? ఏమీ నిర్ణయించుకోలేదు. ఓ రెండు నెలలు పూర్తిగా రిలాక్స్ అయ్యి, తదుపరి చిత్రం గురించి ఆలోచిస్తా. - డి.జి. భవాని మీరు చాలా సింపుల్‌గా కనిపిస్తారు.. బ్రాండెడ్ దుస్తులు వాడరా? నా డ్రెస్సులన్నీ మా ఆవిడే కొంటుంది. నన్ను ఆవిడెలా చూడాలనుకుంటుందో అలాంటి బట్టలు కొంటుంది. వాటిలో నాకు సౌకర్యవంతంగా ఉన్నవాటిని తొడుక్కుంటా. రమ్యకృష్ణగారి కోసం మీరేమీ షాపింగ్ చేయరా? లేదు. రమ్యకు నేను ఇచ్చిన అతి విలువైన బహుమతులు రెండున్నాయి. అవి ‘కృష్ణవంశీ, బేబో’. మా అబ్బాయి పేరు ఋత్విక్. మేం ముద్దుగా బేబో అని పిలుస్తాం. అసలు మొగుడుగా నువ్వు నాకేమీ ఇవ్వవా? అని రమ్య అడిగితే, ‘కృష్ణవంశీ’ని ఇచ్చాను కదా అంటుంటాను. రమ్య చాలా గ్రేట్. సింపుల్ పర్సన్. బేబో ఏం చదువుతున్నాడు? నాలుగో తరగతి. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రాన్ని చూశాడా? వాడికి రామ్‌చరణ్ అంటే ఇష్టం. ‘మగధీర’ను లెక్కలేనన్ని సార్లు చూశాడు. ఆ డీవీడీ అరిగిపోయింది కూడా. ‘గోవిందుడు..’ చూశాడు. వాడికి బాగా నచ్చింది. భర్తగా, తండ్రిగా మీరెంతవరకు బెస్ట్? నేను చాలా బ్యాడ్ హజ్బండ్ని.. బ్యాడ్ ఫాదర్‌ని. మరి.. మిమ్మల్నెంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న రమ్యకృష్ణగారు మీరు ‘బ్యాడ్’ అంటే భరిస్తారా? ఒకవేళ అందుకే ఇష్టపడిందేమో (నవ్వుతూ). నేను బ్యాడ్ కాబట్టే, తను బెస్ట్ మదర్, బెస్ట్ వైఫ్‌గా ఉంటుందేమో. కుటుంబాన్ని చూసుకునే విషయంలో రమ్య చాలా చాలా బెస్ట్. అస్సలు వంక పెట్టడానికి లేదు. రమ్యకృష్ణ, బేబో చెన్నయ్‌లో ఉంటున్నట్లున్నారు? నేను కూడా చెన్నయ్‌లోనే ఉంటున్నాను. షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడికొస్తున్నాను. ఫ్యామిలీతో హాలీడే ట్రిప్ వెళుతుంటారా? తప్పనిసరిగా వెళతాం. అది కూడా రమ్యే ప్లాన్ చేస్తుంది. ఫలానా చోటకి వెళతాం అని చెబుతుంది. ఇక, టికెట్లు బుక్ చేయడానికి, సూట్‌కేసులు మోయడానికి నేను రెడీ అయిపోతా (నవ్వుతూ). -
'గోవిందుడు'కు మరో పాట....
ఈ మధ్య కాలంలో సినిమా విడుదల అయిన తర్వాత కూడా ఓ పాటనో లేక ఓ ఫైట్నో జత చేయటం కామన్‌గా మారిపోయింది. తాజాగా ఆ జాబితాలో రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా చేరింది. ఆ సినిమాలో మరో పాటను జత చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. దాంతో చిత్ర యూనిట్ దసరా పండుగకు సెలవు కూడా తీసుకోకుండా ఆ పాటను చిత్రీకరించటంలో నిమగ్నమైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుధవారం విడుదలయిన విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ ఈ పాట చిత్రీకరణ కోసం దసరా పండుగ రోజు కూడా పని చేస్తున్నాడు. పాట పూర్తయ్యేవరకూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేయాలని డిసైడ్ అయినట్లు రామ్ చరణ్ తెలిపాడు. ముందుగా ఈ సినిమా ప్రీమియర్ షో కోసం యూఎస్ వెళ్లాలనుకున్నా సమయం లేకపోవటంతో వెళ్లలేకపోయినట్లు చెర్రీ పేర్కొన్నాడు. ఈ దసరాను సెట్లోనే జరుపుకుంటున్నట్లు రామ్ చరణ్ వెల్లడించాడు. రామ్ చరణ్‌కు జంటగా కాజల్ నటించింది. శ్రీకాంత్, కమలినీ మరో జంటగా తెరపై సందడి చేయగా, సీనియర్ నటుడు రామ్ చరణ్‌కు తాతయ్య పాత్రలో కనిపించాడు. మరి కొత్తగా జత చేయబోయే పాట సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అవుతుందో లేదో చూడాలి. -
సినిమా థియేటర్లో తొక్కిసలాట
ఎమ్మిగనూరులో ఒకరి మృతి ఎమ్మిగనూరు: ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విడుదల సందర్భంగా బుధవారం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని శివ థియేటర్లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఓ అభిమాని ప్రాణాన్ని బలిగొంది. అభిమాన హీరో రాంచరణ్ నటించిన సినిమాను మొదటి రోజే చూడాలని ఎమ్మిగనూరులోని బుడగజంగాల కాలనీకి చెందిన కన్నయ్య(19) ఒక రోజు ముందే టికెట్ కొనుగోలు చేసి స్నేహితులతో కలసి థియేటర్‌కు చేరుకున్నాడు. మధ్యాహ్నం 2.30 గంటలకు థియేటర్ గేట్లు ఒక్కసారిగా తెరవడంతో అప్పటికే అక్కడ గుమికూడిన అభిమానులంతా లోపలికి తోసుకెళ్లారు. ఈ సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకోవడంతో కన్నయ్య కింద పడి ప్రాణాలొదిలాడు. విషయం తెలుసుకున్న బంధువులు థియేటర్ వద్దకు చేరుకుని హీరో ఫ్లెక్సీలను తగులబెట్టి ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులతో చర్చించారు. థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి న్యాయం చేస్తామని నచ్చజెప్పారు. మృతునికి రెండు నెలల్లో వివాహం జరగనున్న నేపథ్యంలో చోటుచేసుకున్న ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. -
కృష్ణవంశీని ఆకాశానికెత్తిన కమలినీ ముఖర్జీ
చెన్నై: 'ఆనంద్' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ భామ కమలినీ ముఖర్జీ దర్శకుడు కృష్ణవంశీని పొగడ్తలతో ఆకాశానికెత్తారు. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించేసుకుని, ఆ తరువాత 'గోదావరి' సినిమాతో మరింత దగ్గరైన కమలినీ తాజాగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాలో నటించింది. ఇటువంటి కుటుంబ కథా చిత్రంలో నటించినందుకు గర్వపడ్తున్నాననీ కమలినీ చెప్పారు. ఈ చిత్రంలో నటించడం ద్వారా గొప్ప అనుభూతి పొందినట్లు పేర్కొన్నారు. కుటుంబ సంబంధాలు, మనుషులలో భావోద్వేగాలు, వారి మనస్తత్వాలు తెలియజేయడంలో కృష్ణవంశీ దిట్ట అన్నారు. కృష్ణ వంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్-కాజల్ జంటగా నటించిన 'గోవిందుడు అందరివాడేలే' ఈరోజు విడుదలైన సందర్భంగా కమలినీ ఈ సినిమా షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. చిత్ర యూనిట్ సభ్యులందరూ ఓ కుటుంబంలా కలిసిమెలిసి పనిచేసినట్లు చెప్పారు. తన కెరీర్లో దీర్ఘ కాలం 8 నెలలు షూటింగ్ చేసిన చిత్రం ఇదేనన్నారు. షూటింగ్ జరిగినంత కాలం చాలా ఆనందంగా గడిచిపోయినట్లు తెలిపారు. ఈ చిత్రం ఎన్నో మధురానుభూతులను మిగిల్చిందన్నారు. కృష్ణ వంశీ కెరీర్లో ఇది ఒక గొప్ప చిత్రంగా నిలుస్తుందన్నారు. కుటుంబ కథా చిత్రాలు నిర్మించడంలో ఆయనకు ఎంతో నైపుణ్యం ఉందని ప్రశంసించారు. తన కెరీర్లో నటించిన పాత్రలకు భిన్నమైన పాత్ర ఇందులో పోషించినట్లు చెప్పారు. ఇటువంటి పాత్ర తనతో చేయించినందుకు కృష్ణ వంశీకి కమలినీ కృతజ్ఞతలు తెలిపారు. ** -
'గోవిందుడు అందరివాడేలే' వర్కింగ్ స్టిల్స్
-
'గోవిందుడు అందరివాడేలే' పోస్టర్స్
-
'గోవిందుడు అందరివాడేలే' స్టిల్స్
-
ఎందుకు రిజెక్ట్ చేశానంటే: రాంచరణ్
'మిర్చి' లాంటి బంపర్ హిట్ ను అందించిన కొరటాల శివ చిత్రాన్ని రాం చరణ్ తేజ్ రిజెక్ట్ చేయడం టాలీవుడ్ లో అప్పట్లో చర్చనీయాంశమైంది. కొరటాల శివ చిత్రాన్ని ఎందుకు అంగీకరించలేదనే విషయంపై రాంచరణ్ వివరణ ఇచ్చారు. అప్పటి వరకు యాక్షన్, మాస్ ఇమేజ్ ఉన్న చిత్రాల్లో నటించానని.. ఓ ఫీల్ గుడ్ ఉండే ఓ కుటుంబ కథా నేపథ్యంతో ఉండే చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని, ఆ సమయంలో కృష్ణవంశీ చెప్పిన కథ నచ్చిందన్నారు. అందుకే తాను కొరటాల శివ సినిమాను రిజెక్ట్ చేశానని రాంచరణ్ వివరణ ఇచ్చారు. 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంతో అక్టోబర్ 1 తేదిన ప్రేక్షకుల వద్దకు రానున్న రాంచరణ్ తేజ్ తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రంలో నటించేందుకు దృష్టి పెట్టారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఒకవేళ అనుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే చిత్రం వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. అంతకంటే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఏమిలేదు అని రాంచరణ్ ఓ న్యూస్ ఏజెన్సీకిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ప్రస్తుతం అజిత్ కుమార్ తో రూపొందిస్తున్న చిత్రలో గౌతమ్ మీనన్ బిజీగా ఉన్నారు. -
అతడి కోసం రూ.2 కోట్ల అదనపు ఖర్చు!
విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఏ పాత్ర చేసినా అందులో ఒదిగిపోవడం ఆయన ప్రత్యేకత. ఆయన తమ సినిమాలో నటించాలని కోరుకుని హీరోలు అరుదు. హీరో రామ్‌చరణ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ప్రకాశ్‌రాజ్ కోసం అదనంగా రూ. 2 కోట్లు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడలేదు చెర్రీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. చరణ్ తాజాగా నటించిన 'గోవిందు అందరివాడేలే'లో తాత పాత్రకు ముందుగా రాజ్‌కిరణ్ ను తీసుకున్నారు. చిత్రీకరణ్ సమయంలో సంతృప్తి కలగకపోవడంతో రాజ్‌కిరణ్ ను తీసేసి ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నారు. ఇందుకోసం రూ. 2 కోట్లు అదనంగా ఖర్చయిందని చరణ్ వెల్లడించాడు. అయితే రూ. పదికోట్లకు సమానంగా ప్రయోజనం ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. చెర్రీ నమ్మకం నిజమవుతుందో, లేదో ప్రేక్షకులే తేల్చాలి. -
ఉపాసన నన్ను ప్రేమకథలు చేయమంటోంది!
ఒకే కోవలోని సినిమాలు చేయడానికి రామ్‌చరణ్ అస్సలు ఇష్టపడరు. ఆయన నటించిన తొలి మూడు సినిమాలే అందుకు ఉదాహరణలు. కొత్తదనం కోసం పరితపించడం తండ్రి చిరంజీవి నుంచి చరణ్‌కి అబ్బిన లక్షణం. రచ్చ, ఎవడు, నాయక్... చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకొని, అక్టోబర్ 1న ‘గోవిందుడు అందరివాడేలే’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారాయన. ఈ సందర్భంగా చరణ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘గోవిందుడు అందరివాడేలే’ అని టైటిల్ పెట్టడానికి కారణమేంటి? హీరో పాత్ర తీరుతెన్నుల్ని దృష్టిలో పెట్టుకొని పెట్టిన టైటిల్ అది. అంతేతప్ప ఆ సినిమాలో నా పేరు గోవిందుడేం కాదు. ఇందులో నా పేరు ‘అభిమన్యు’. ఎన్నారైని. తాత కోసం ఇండియా వస్తాను. ఆ తర్వాత ఏమైందనేది సినిమా. ఇప్పటివరకూ ఇలాంటి కోవలోని సినిమా నేను చేయలేదు. మీరూ, మీ నాన్నగారూ ఈ సినిమా చూశారా? విడివిడిగా చూశాం. అయితే... ఇద్దరం పూర్తిగా చూడలేదు. ఎడిటింగ్ టైమ్‌లో నేను కొంత చూశాను. నిజానికి ‘మగధీర’ తర్వాత చేయాల్సిన సినిమా ఇది. అప్పుడు కుటుంబ కథల కోసం చాలా ప్రయత్నించాను. చాలామంది కథలు వినిపించారు కూడా. అయితే... ఎవరూ నన్ను ఒప్పించలేకపోయారు. ప్రతి ఒక్కరూ కుటుంబ కథ అని మాస్ ఎలిమెంట్స్ ఉన్న స్టోరీ చెప్పేవారు. మిక్స్‌డ్‌గా ఉంటే బావుంటుందని వాళ్లెంత చెప్పినా నాకెందుకో మింగుడు పడేది కాదు. కృష్ణవంశీ ఈ కథ చెప్పినప్పుడు... నేను ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్న కథ ఇదే అనిపించింది. పైగా కృష్ణవంశీతో సినిమా చేయాలని నాకెప్పట్నుంచో కోరిక.. ఇలాంటి కథల్ని తెరకెక్కించడంలో ఆయన మాస్టర్. చాలామంది... మురారి, చందమామ చిత్రాల పోలికలు ఈ సినిమాలో ఉంటాయనుకుంటున్నారు. కొందరైతే... ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రంతో కూడా పోల్చి మాట్లాడుతున్నారు. వారి అంచనాల్లో నిజం లేదు. ఇదొక ఫ్రెష్ సినిమా. ఇందులో ఏ సినిమాల పోలికలూ ఉండవు. సినిమారంగంలో అందరూ సక్సెస్ వైపే పరుగెడుతుంటారు. మీరేంటి... పరాజయాల్లో ఉన్న కృష్ణవంశీతో సినిమా చేశారు? నేనెప్పుడూ సక్సెస్ వైపు పరిగెత్తలేదు. నాకు కథ ముఖ్యం. అందుకే తొందరపడి ఎవరికీ కమిట్ అవ్వను కూడా. మీరన్నట్లు కృష్ణవంశీ గత చిత్రాలు కొన్ని ఫ్లాపై ఉండొచ్చు. కానీ దర్శకునిగా ఆయన మాత్రం ఎప్పుడూ ఫ్లాప్ కాలేదు. ఇది నిజం. పైగా కృష్ణవంశీ ఏ విషయంలోనూ రాజీ పడరు. నాకు అలాంటి దర్శకుడే కావాలి. అందుకే చేశాను. ఎవరితోనూ తొందరపడి కమిట్ కాను అన్నారు. మరి మొదలై ఆగిన ధరణి దర్శకత్వంలోని ‘మెరుపు’, కొరటాల శివ సినిమాల మాటేంటి? అవి మొదలై ఆగిపోయాయి కదా? కథ నచ్చితేనే నిర్మాత దగ్గర్నుంచి డబ్బు తీసుకుంటాను. కొరటాల శివ కథ నాకు చూచాయగా నచ్చింది. అయితే... సంతృప్తిగా రాలేదు. అయితే... బండ్ల గణేశ్ ఒత్తిడి చేయడంతో ఆ సినిమాకు చెక్ తీసుకున్నాను. ఓపెనింగ్‌లో కూడా పాల్గొన్నాను. ఆ కథ కూడా ‘గోవిందుడు...’ లాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకే పక్కన పెట్టాల్సివచ్చింది. ఇప్పుడు కాకపోయినా... తర్వాతైనా కొరటాల శివతో సినిమా చేస్తాను. కథల విషయంలో చిరంజీవిగారి ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంటుందంటారు నిజమేనా? ఆయనకు నచ్చకపోవడం వల్లే ‘గోవిందుడు...’ ఆలస్యమైందని పలువురి అభిప్రాయం. డెరైక్టర్ కోరుకుంటేనే నాన్నగారి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అంతేతప్ప అనవసరంగా జోక్యం చేసుకోరు. ‘గోవిందుడు’ విషయం కొన్ని సీన్స్ నేటివిటీకి దూరంగా ఉన్నాయి. నాన్న సలహా మేరకు వాటిని మార్చాం. రాజ్‌కిరణ్‌ని తప్పించి, ప్రకాశ్‌రాజ్‌ని తీసుకోవడం ఎవరి ఆలోచన? నాన్నగారితో పాటు అందరి నిర్ణయం అది. రాజ్‌కిరణ్ గొప్ప ఆర్టిస్ట్. కానీ... ఎందుకో ఆ పాత్రకు ఆయనకంటే ప్రకాశ్‌రాజ్ కరెక్ట్ అనిపించింది. ఒకప్పుడు ఎస్వీరంగారావుగారిలా... ఈ తరానికి ప్రకాశ్‌రాజ్ అనాలి. ఆయన్ను మనం సరిగ్గా ఉపయోగించుకోవడం లేదంతే. అనుకున్నదానికంటే అద్భుతంగా నటించారాయన. ఆయన సూచనలు కూడా మాకు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రకాశ్‌రాజ్ సీన్స్ తీయడం వల్ల అయిదు కోట్ల రూపాయలు అదనపు భారం పడిందని చాలామంది అంటున్నారు కానీ... అలాంటిదేం లేదు. ఓ విధంగా బడ్జెట్ తగ్గింది. కృష్ణవంశీ సినిమాలకు భిన్నంగా... తక్కువ ఖర్చుతో, తక్కువ వర్కింగ్ డేస్‌లో పూర్తయిన సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. కృష్ణవంశీ ఆర్టిస్టుల్ని పిండేస్తారని, ఆయనకు ఏదీ ఓ పట్టాన నచ్చదని అంటుంటారు. నిజమేనా? ఆయన ఆర్టిస్టుల్ని పిండేస్తారు. అలాగే... మేమూ ఆయన్ను పిండేశాం. ఒకటి మాత్రం నిజం. ఆర్టిస్టుల నుంచి నటన రాబట్టుకోవడంలో కృష్ణవంశీ దిట్ట. సీన్ పేపర్ చదవగానే... ఈ సీన్ ఇలా చేయాలని ప్రిపేర్ అవుతాం. కానీ లొకేషన్లోకి వెళ్లాక... అదే సీన్‌ని ఆయన మరోలా నేరేట్ చేస్తారు. చాలా కొత్తగా ఉంటుంది. ‘ఇలా కూడా చేయొచ్చా?’ అనిపిస్తుంది. ఈ సినిమా వంద కోట్లు వసూలు చేస్తుందని బండ్ల గణేశ్, యాభై ఏళ్లు గుర్తుంటుందని కృష్ణవంశీ అంటున్నారు. మీరేం అంటారు? కోరికలుంటాయి. తప్పేం లేదు. నా వరకు సినిమా బాగా ఆడి నిర్మాతకు డబ్బులొస్తే చాలు. ఇంతకూ... శ్రీను వైట్ల సినిమా ఉన్నట్లా? లేనట్లా? కథ నచ్చితే కచ్చితంగా చేస్తా. త్వరలోనే ఆ విషయం చెబుతా. మణిరత్నం సినిమా చేస్తున్నారని వార్తలొచ్చాయి? ఆయన దర్శకత్వంలో నటించాలని ఎవరికుండదండీ. ఆయన ఫ్రేమింగ్, టేకింగ్ అద్భుతం. అయితే సినిమా అనేది వ్యాపారం. ఇక్కడ డబ్బులు రావడం ముఖ్యం. ఆయన చెప్పిన కథ నాకు నచ్చలేదు. ఇప్పుడు ఆ కథతోనే ఆయన మమ్ముట్టి కుమారుడితో సినిమా చేస్తున్నారు. మంచి కథ దొరికితే ఆయనతో చేస్తా. కోన వెంకట్, గోపీమోహన్‌ల కథ ఫైనల్ చేశారట? వారి కథ బాగుంది. అయితే... డెరైక్టర్ కోసం చూస్తున్నాం. అది కూడా త్వరలో చెబుతా. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా ఉంటుంది. బాలీవుడ్ ‘జంజీర్’ ఫలితం నుంచి నుంచి మీరు నేర్చుకున్నదేంటి? నేర్చుకున్నదేం లేదు. అది ఆడలేదంతే. ‘లగాన్’ ఫేమ్ ఆశుతోశ్ గోవారీకర్‌తో సినిమా చేస్తున్నారట కదా? అవును. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సినిమా ఉంటుంది. మీ సినిమాల విషయంలో మీ భార్య ఉపాసన ఏమైనా సలహాలిస్తుంటారా? ఆమె ప్రేమకథల్ని చేయమంటోంది. మంచి కథలొస్తే చేయొచ్చు. నిజానికి సరిగ్గా ట్రీట్ చేస్తే ‘ఆరంజ్’ మంచి ప్రయత్నం. కానీ ఆడలేదు... ఏం చేస్తాం. మీ నాన్నగారి 150వ సినిమాకు దర్శకుడు ఫైనల్ అయ్యారా? లేదు. సిట్టింగులు జరుగుతూనే ఉన్నాయి. మంచి ఎంటర్టైనింగ్ కథ కోసం చూస్తున్నాం. మీ నాన్నగారు తెలుగు సినిమాలో నంబర్‌వన్‌గా రెండు దశాబ్దాల పాటు కొనసాగారు. ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంది. దాని కోసం మీరు కూడా పోటీ పడుతున్నారా? నాన్న నంబర్‌వన్ అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు. వచ్చిన సినిమాల్లో మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకెళ్లారు. అనుకోకుండా ఆ స్థానం వరించింది. నేనూ అంతే... వచ్చిన సినిమాలను చేసుకుంటూ వెళ్తాను. ‘నంబర్‌వన్’ కావాలని మాత్రం ఆశించను. మీ బాబాయి ‘గోపాల గోపాల’ అంటున్నారు. మీరేమో ‘గోవిందుడు అందరివాడేలే’ అంటున్నారు. మీ తమ్ముడు వరుణ్‌తేజ్ ‘ముకుంద’ అంటున్నారు. ఏంటి మీ ఫ్యామిలీ మొత్తం కృష్ణుడి మీద పడ్డారు? ఏంటో అలా సెట్ అయ్యింది. అనుకుని చేసేదేం కాదు కదా. మీ బాబాయి పవన్‌కల్యాణ్‌తో కథల విషయంలో డిస్కస్ చేస్తారా? ఇంట్లో అందరం కలిసినప్పుడు చర్చించుకుంటాం. ఆయన కూడా సలహాలిస్తుంటారు. పవన్‌కల్యాణ్ ఎనిమిదో సినిమా ‘జానీ’. మహేశ్‌బాబు ఎనిమిదో సినిమా ‘నిజం’, ఎన్టీఆర్ ఎనిమిదో సినిమా ‘ఆంధ్రావాలా’. ప్రభాస్ ఎనిమిదో సినిమా ‘యోగి’, బన్నీ ఎనిమిదో సినిమా ‘ఆర్య-2’. ఇప్పుడు మీ ఎనిమిదో సినిమాగా ‘గోవిందుడు...’ రాబోతున్నాడు. ఈ ఎనిమిదో ప్రమాదం నుంచి గట్టెక్కగలరా? ‘గోవిందుడు అందరివాడేలే’ దాన్ని కచ్చితంగా బ్రేక్... చేసి, పెద్ద విజయం సాధిస్తుంది. వైజాగ్‌లో స్టూడియో కడుతున్నారని తెలిసింది నిజమేనా? తెలుగు సినిమా అక్కడ కూడా అభివృద్ది చెందే అవకాశం ఉందంటారా? కట్టాలనుకుంటున్నాం. అయితే... ఎక్కడో ఇప్పుడే చెప్పలేను. పరిశ్రమ ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నుంచి తరలుతుందని చెప్పలేం. ఎందుకంటే మద్రాసు నుంచి రావడానికే చాలా టైమ్ పట్టింది కదా. అయితే... ప్రత్యామ్నాయంగా మరో చోట సినిమా అభివృద్ధి చెందడం అవసరమే. అమెరికాలో చాలా ప్రాంతాల్లో స్టూడియోలు ఉన్నాయి. -
'ఆ సినిమా చూసి నాకు ఏడుపొచ్చింది'
రెండు రోజుల్లో విడుదల కాబోతున్న 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం తొలికాపీ చూసిన తర్వాత తనకు కళ్లవెంబడి నీళ్లు జలజలా రాలిపోయాయని చిత్ర నిర్మాత బండ్ల గణేశ్ అన్నారు. ఈ సినిమా తన కెరీర్లోనే మైలురాయిగా నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సినిమా బుధవారం నాడు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఎంత ఎమోషన్ చూసినా తాను సాధారణంగా కన్నీరు పెట్టనని, కానీ ఇది చూసిన తర్వాత మాత్రం వాటిని ఆపుకోలేకపోయానని గణేశ్ అన్నారు. బాపు గారి అత్యుత్తమ చిత్రం 'ముత్యాల ముగ్గు' అయితే.. కృష్ణవంశీ అత్యుత్తమ చిత్రం 'గోవిందుడు..' అవుతుందని చెప్పారు. అది విడుదలైన తర్వాత ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అనే విషంలో తనకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, కమలినీ ముఖర్జీ, శ్రీకాంత్, ఆదర్శ్ బాలకృష్ణ కూడా ఉన్నారు. యువన్ శంకర్ రాజా దీనికి సంగీతం అందించారు. -
2 వేల థియేటర్లలో గోవిందుడు అందరివాడేలే
హైదరాబాద్: రామ్‌చరణ్ - కాజల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన 'గోవిందుడు అందరివాడేలే' 1800 నుంచి 2000 థియేటర్స్‌లో విడుదలచేయనున్నట్లు ఈ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ చెప్పారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. పరమేశ్వర్ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ మూవీలో శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలను ఇంగ్లండ్‌లో చిత్రీకరించారు. ** -
మా గోవిందుడు అందరినీ అలరిస్తాడు...
అప్పన్నను దర్శించుకున్న చిత్ర నిర్మాత బండ్ల గణేష్ సింహాచలం: రామ్‌చరణ్ హీరోగా తాను నిర్మించి న ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని ఆచిత్ర నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. ఆదివారం ఉదయం సింహా చల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆయ న కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అక్టోబర్ ఒకటిన విడుదల అవుతున్న తమ చిత్రం విజయవంతంకావాలని స్వామికి పూజ లు నిర్వహించారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ‘గబ్బర్‌సింగ్’ సినిమా నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిం దన్నారు. అప్పటి నుంచి తన పరమేశ్వర ఆర్ట్స్ బేనర్ వేల్యూ పెరిగిందన్నారు. గోవిందుడు అందరివాడేలే కూడా స్వామి ఆశీస్సులతో పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానన్నారు. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ఒకటిన ఈ సిని మా రిలీజ్ అవుతోందన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్‌రాజ్, జయసుధతోపాటు దాదాపు 60 మంది ప్రముఖ నటీనటులతో ఈ చిత్రాన్ని తీశామన్నారు. ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా, మానవతా విలువలు, తాతా మనవళ్ల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పేవిధంగా చిత్రాన్ని రూపొందించామన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా మరో చిత్రాన్ని నిర్మిస్తున్నామని, సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు. శరణ్య వేంకటేశునికి పూజలు ఆనందపురం: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ దంపతులు పైడా ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఉన్న శ్రీ శరణ్య వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం దర్శించుకున్నారు. ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా విజయవంతం కావాలని కోరుతూ వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు కిశోర్ ఆచార్యులు స్వాగతం పలికి పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను అంద జేశారు. -
ఇంగ్లాండ్ పత్రికలో గోవిందుడి కవరేజ్
‘‘అది తెలుగు భాషకు సంబంధించిన చిత్రం. భారతీయ చిత్రపరిశ్రమలో అదో భాగం. హైదరాబాద్‌లో ఉంటుంది. తెలుగు చిత్రాలు రూపొందుతున్న పరిశ్రమను ‘టాలీవుడ్’ అంటారు. భారతీయ చిత్ర పరిశ్రమలో బాలీవుడ్ తర్వాత టాలీవుడ్డే పెద్దది’’... యూకేకి చెందిన ‘హెమల్ హెంప్‌స్టెడ్ గజెట్’ అనే స్థానిక పత్రికలో ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం గురించి ప్రచురితమైన వార్త ఇది. రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ పరిచయ సన్నివేశాలను ఆ మధ్య ఇంగ్లాండ్‌లో చిత్రీకరించారు. ఈ సన్నివేశాల్లో భాగంగా అక్కడి స్టేడియమ్లో ‘రగ్బీ’ గేమ్‌ని చిత్రీకరించారు. ఇంగ్లాండ్‌లో పెరిగిన గ్రామీణ భారతీయ యువకుని కథ ఇదని సదరు పత్రిక పేర్కొంది. హెమల్ స్టాగ్స్ ఏరియాలోని పెన్నీ వే స్టేడియమ్లో రగ్బీ ఆటను చిత్రీకరించారని, భారతీయ తెరపై తమ స్టేడియమ్ కనిపించనుందని కూడా సదరు పత్రిక పేర్కొంది. అలాగే, రగ్బీ ఆటను చిత్రీకరించడం తనకిది తొలిసారి అని, ఆ ఆట గురించి తనకేం తెలియదని, ఈ సినిమా కోసం సమాచారం సేకరించానని కృష్ణవంశీ తెలిపినట్టు కూడా ఆ పత్రిక ప్రచురించింది. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని, ఈ సినిమా నిర్మించడం తన పూర్వ జన్మ సుకృతమని నిర్మాత బండ్ల గణేశ్ తెలిపారు. -
అప్పుడు చిరంజీవే గుర్తొచ్చారు!
‘‘బంగారి మంచోడు. అయితే.. పెళ్లి చేయలేదని వాళ్ల నాన్న మీద అతనికి కోపం. అందుకే, నాన్నకు నచ్చని పనులు చేస్తుంటాడు. అతను చేసే పనులు నెగటివ్‌గా ఉంటాయి కానీ, అతను మాత్రం నెగటివ్ పర్సన్ కాదు’’ అని శ్రీకాంత్ అన్నారు. రామ్‌చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మించిన చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’ అక్టోబర్ మొదటి వారంలో విడుదల కానుంది. ఈ సినిమాలో చరణ్‌కి బాబాయిగా శ్రీకాంత్ నటించిన విషయం తెలిసిందే. ఇందులో తన పాత్ర తీరు తెన్నుల గురించి, సినిమా విశేషాల గురించి మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు శ్రీకాంత్. ‘‘ఇందులో నా పాత్ర పేరు బంగారి. ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. ఇందులో నేను రామ్‌చరణ్‌కి బాబాయినే అయినా, యంగ్‌గానే ఉంటాను. నా మరదలిగా కమలినీ ముఖర్జీ నటించారు. ప్రకాశ్‌రాజ్‌ది నా తండ్రి పాత్ర. మా ఇద్దరి మధ్య సన్నివేశాలు వినోదభరితంగా ఉంటాయి. ఇంట్లో నాకంటే రామ్‌చరణ్‌కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారని కొంచెం కోపంగా ఉంటాను. ఓ సందర్భంలో చరణ్‌ని కొడతాను కూడా. కానీ... చరణ్ మాత్రం నన్ను కొట్టడు. ‘ఎందుకు కొట్టడు?’ అనేది ఆసక్తికరమైన విషయం’’ అని చెప్పారు శ్రీకాంత్. కృష్ణవంశీ గురించి మాట్లాడుతూ -‘‘కృష్ణవంశీ దర్శకత్వంలో ఖడ్గం, మహాత్మ చిత్రాల్లో నటించాను. ఇది మూడో సినిమా. నిన్నేపెళ్లాడతా, మురారి, చందమామ చిత్రాలకు ఏ మాత్రం తగ్గకుండా, ఆ మాటకొస్తే ఆ సినిమాలకంటే ఓ మెట్టు ఎత్తులో ఈ సినిమా ఉంటుంది. చిరంజీవిగారు కూడా మొన్ననే రషెస్ చూశారు. చాలా హ్యాపీగా ఉన్నారు. అన్నయ్య సూచన మేరకు నేను, చరణ్ నటించగా కొన్ని సీన్స్ తీసి జత చేశారు’’ అని తెలిపారు. తనకు వ్యక్తిగతంగా చరణ్ చాలా ఏళ్లుగా తెలుసని, సెట్లోకి అడుగుపెట్టాక తన ప్రవర్తన గమనిస్తే చిరంజీవిగారే గుర్తొచ్చారని శ్రీకాంత్ గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో మహేశ్‌బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి టాప్‌స్టార్స్‌తో కూడా నటించాలని ఉందనీ, ప్రస్తుతం సోలో హీరోగా నాలుగు సినిమాలు చేస్తున్నానని శ్రీకాంత్ తెలిపారు. -
వేలానికి హీరో రామ్‌చరణ్ బైకు!
హీరో రామ్‌చరణ్ బైకు అమ్మకానికి పెట్టనున్నారు. ఇంతకుముందు బాలకృష్ణ 'లెజెండ్' బైకును అమ్మకానికి పెట్టారు. ఇప్పుడు అదే తరహాలో చరణ్ బైకును వేలం వేయనున్నారు. 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో రూ. 30 లక్షల విలువ చేసే హర్లీ డేవిడ్సన్ బైకు వాడాడు. ఈ సినిమా కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. సినిమా విడుదలైన తర్వాత ఈ బైకును వేలం వేయాలని నిర్మాత బండ్ల గణేష్ భావిస్తున్నారట. వేలం ద్వారా వచ్చే డబ్బును దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలను కుంటున్నారదన్నది చిత్రసీమ సమాచారం. 'లెజెండ్' సినిమాలో తాను వాడిన బైకును వేలం వేయడం ద్వారా సొమ్మును బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆస్పత్రికి అందజేశారు బాలకృష్ణ. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది. -
”గోవిందుడు అందరి వాడేలే” ఆడియో హైలెట్స్
-
నిజంగా చరణ్ విషయంలో గర్వంగా ఫీలవుతాను : చిరంజీవి
‘‘ ‘సినిమా రంగాన్ని విడిచి రాజకీయాల్లోకి వెళ్లారు కదా... మీకు బాధ అనిపించడం లేదా?’ అని చాలామంది నన్ను అడుగుతుంటారు. నిజానికి నాకు ఆ బాధ లేదు. దానికి కారణం చరణ్. నేను అనుకున్నదానికంటే తాను మంచి స్థాయికి చేరుకున్నాడు. ఈ రోజు చరణ్‌ని తెరపై చూస్తుంటే... నన్ను నేను చూసుకుంటున్నట్లుంటుంది. పాత్ర కోసం ఎంత కష్టానికైనా తాను నెరవడు. ఒళ్లు హూనం చేసుకొని ఇంటికొస్తాడు. కానీ... ఎక్కడా కష్టపడ్డట్టు కనిపించడు. ‘అంత కష్టపడతావ్. బాధ అని కూడా అనవేంట్రా...’ అని వాళ్ల అమ్మ అడిగితే... ‘నాన్న పడిన కష్టంతో పోల్చుకుంటే నాదీ ఓ కష్టమా’ అంటాడు. నిజంగా చరణ్ విషయంలో గర్వంగా ఫీలవుతాను’’ అని చిరంజీవి అన్నారు. రామ్‌చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. కాజల్ అగర్వాల్ ఇందులో కథానాయిక. శ్రీకాంత్, కమలినీముఖర్జీ, ప్రకాశ్‌రాజ్, జయసుధ కీలక పాత్రధారులు. యువన్‌శంకర్‌రాజా స్వరాలందించిన ఈ చిత్రం పాటల సీడీని సోమవారం హైదరాబాద్‌లో చిరంజీవి ఆవిష్కరించి, తొలి ప్రతిని సీనియర్ దర్శకుడు కె.రాఘవేంద్రరావుకు అందించారు. చిరంజీవి మాట్లాడుతూ -‘‘కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని నాకూ ఉండేది. కానీ... నటీనటుల నుంచి నటన రాబట్టడంలో ఆయన దిట్ట. ఇన్ని సినిమాలు చేశాక, ఆయనకు నచ్చేట్టు నటించడానికి నేను ఆయన ముందు తలవంచడం ఇష్టం లేక చేయలేదు. నాకు ఒక ‘విజేత’ సినిమాలా చరణ్‌కి ‘గోవిందుడు అందరివాడేలే’ నిలుస్తుందని నమ్మకంగా చెప్పగలను’’ అని చెప్పారు. ‘పవర్‌స్టార్... పవర్‌స్టార్’ అని అభిమానులు చేస్తున్న నినాదాలకు బ్రేక్ వేస్తూ -‘‘ ‘గోవిందుడు అందరివాడేలే’ 150వ రోజుల వేడుకకు కళ్యాణ్ వస్తే మీకేమైనా అభ్యంతరమా!’ అని చిరంజీవి అన్నారు. చరణ్ మాట్లాడుతూ -‘‘నేను ఎన్ని హిట్ సాంగ్స్‌లో నటించినా.... ఈ సినిమాలోని ‘నీలిరంగు చీరలో’ పాట అన్నింటికంటే బెస్ట్. సుద్దాల అశోక్‌తేజగారు గొప్పగా ఆ పాట రాశారు’’ అని తెలిపారు. చరణ్ చిత్రసీమలో జగదేకవీరునిగా ఎదగాలని కె.రాఘవేంద్రరావు ఆకాంక్షించారు. 30 ఏళ్ల క్రితం చిరంజీవిగారు ఇండస్ట్రీకి రాకుంటే... పవన్‌కల్యాణ్, చరణ్, బన్నీలను తెరకు పరిచయం చేయకుంటే... తెలుగు సినిమా పరిస్థితిని ఊహించలేమనీ బండ్ల గణేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ, పరుచూరి బ్రదర్స్, కె.ఎస్.రామారావు, వరుణ్‌తేజ్, సాయిధరమ్‌తేజ్ తదితరులు పాల్గొన్నారు. -
అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే అభ్యంతరమా?: చిరంజీవి
గోవిందు అందరివాడేలే చిత్ర 150 రోజుల దినోత్సవానికి పవన్ కళ్యాణ్ వస్తే అభ్యంతరమా అంటూ అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ప్రశ్నించారు. గోవిందుడు అందరి వాడేలే చిత్ర ఆడియో కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ అంటూ అభిమానులు అడ్డు తగిలారు. దాంతో మీ మా, అందరి సోదరుడు పవన్ కళ్యాణ్ అంటూ చిరంజీవి ఆడియో కార్యక్రమంలో మాట్లాడవల్సిన పరిస్థితి ఏర్పడింది. కుటుంబ కథ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు కృష్ణవంశీ ప్రత్యేకమైన శైలి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం విజేత తనకు ఎంత ఘనవిజయాన్ని అందించిందో.. ఈ చిత్రం కూడా చరణ్ కెరీర్ లో అలాంటి చిత్రంగా మిగులుతుందన్నారు. బి. గణేష్ అంటే బండ్ల గణేష్ కాదని.. బాక్సాఫీస్ గణేష్ అంటూ చిరంజీవి ప్రశంసించారు. -
కొడుకు సినిమాపై ఓ కన్నేసిన చిరంజీవి
నిన్న మొన్నటి వరకూ రాజకీయాలతో బిజీగా ఉన్న కేంద్ర మాజీమంత్రి, మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొడుకు సినిమాతో కుస్తీ పడుతున్నారు. రామ్ చరణ్ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' పై చిరు ఓ కన్నేసి ఉంచారు. ఓవైపు చెర్రీ విదేశాల్లో సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంటే...మరోవైపు చిరంజీవి గోవిందుడు కోసం ప్రత్యేకంగా శ్రద్ద పెట్టినట్లు తెలుస్తోంది. సినిమా ప్రమోషన్ పనులను చిరంజీవి దగ్గరుండి చూసుకుంటున్నారట. చెర్రి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండటంతో...సినిమా ట్రైయిలర్ దగ్గర నుంచి మిగతా పనులను నాన్నకు అప్పగించేసి నిశ్చంతగా ఉన్నాడట. ఇదే విషయాన్ని చిరంజీవి ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'గోవిందుడు అందరివాడేలే' అక్టోబర్ 1న విడుదలకు సిద్ధం అవుతోంది. వచ్చే నెల వరుస సెలవులు రావటంతో ఈ సినిమాకు కలిసి వచ్చే విషయంగా చెప్పవచ్చు. అక్టోబర్ రెండు గాంధీ జయంతి, దసరా, ఆ తర్వాత వీకెండ్, అనంతరం బక్రీద్...ఇలా వరుసపెట్టి ఆరు రోజులు సెలవులు రావటం ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండటం చెర్రీకి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం పై బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, కమలిని ముఖర్జీ, జయసుధ, శ్రీకాంత్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
గోవిందుడు అందరివాడేలే మూవీ న్యూ స్టిల్స్
-
లండన్‌లో గోవిందుడి చిందులు
ఇప్పటివరకూ విలన్ల ఆట కట్టించే మాస్ హీరోగానే రామ్‌చరణ్ కనిపించారు. తెగిన బంధాలను కలిపి, కుటుంబంలోని అందరి హృదయాల్లో ఆనందాన్ని నింపే వంశోద్ధారకునిగా మాత్రం ఆయన కనిపించలేదు. ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో చరణ్‌ది అలాంటి పాత్రే. ఈ సినిమాతో కుటుంబ ప్రేక్షకులకు చరణ్ చేరువ కావడం ఖాయమని చిత్ర దర్శకుడు కృష్ణవంశీ ఘంటాపథంగా చెబుతున్నారు. యాభై ఏళ్ల పాటు చెప్పుకునే సినిమాగా ‘గోవిందుడు....’ నిలుస్తుందని ఆయన చెబుతున్నారు. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. రామ్‌చరణ్ తాతగా ప్రకాశ్‌రాజ్, బాబాయ్‌గా శ్రీకాంత్ నటిస్తున్న ఈ చిత్రంలో కమలినీ ముఖర్జీ ఓ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. మూడు పాటలు మినహా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం లండన్‌లో జరుగుతోంది. అక్కడ రెండు పాటల్ని చిత్రీకరిస్తున్నట్లు బండ్ల గణేశ్ తెలిపారు. మిగిలి వున్న పాటను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తామనీ, దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని ఆయన చెప్పారు. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా శరవేగంగా జరుగుతోందనీ, ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 1న దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తామని బండ్ల గణేశ్ అన్నారు. జయసుధ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: పరుచూరి బ్రదర్స్, కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా. -
లండన్ వెళుతున్న గోవిందుడు
గోవింద్ విదేశాల్లో పుట్టి పెరిగిన కుర్రాడు. కానీ అతని మూలాలన్నీ ఓ తెలుగింట్లో ఉన్నాయి. అతగాడు తన వాళ్లను కలుసుకోవడం కోసం పల్లెటూరికి వస్తాడు. తాతయ్య, నానమ్మ, బాబాయ్, ఇతర బంధువులు, రక్త సంబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఆ ఊరి వాతావరణం, ప్రకృతి... ఇవన్నీ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ గోవిందుడు అందరి మనసుల్లోనూ స్థానం సంపాదించుకుని అందరివాడు అనిపించుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ తదితర ప్రముఖ తారలంతా కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగింటి అందాల్ని, అనుబంధాల్ని తెరకెక్కించడంలో నేర్పరి అయిన కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకుడు. బండ్ల గణేశ్ భారీ ఎత్తున ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్ఎఫ్సీలో ఏకధాటిగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 24 నుంచి లండన్‌లో రెండు పాటల్ని చిత్రీకరించబోతున్నారు. ఈ విశేషాల్ని బండ్ల గణేశ్ చెబుతూ -‘‘రామ్ చరణ్‌పై ఒక సోలో పాట, రామ్‌చరణ్-కాజల్‌పై డ్యూయెట్ లండన్‌లో తీయబోతున్నాం. హైదరాబాద్ రాగానే మూడు రోజులు షూటింగ్ చేస్తే సినిమా మొత్తం పూర్తయిపోయినట్టే. సెప్టెంబర్ రెండో వారంలో పాటలను, అక్టోబర్ 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్ రాజా, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి. -
చరణ్ టీజర్ పై తమ్ముడి కామెంట్!
రామ్ చరణ్ తేజ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'పై టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా 'గోవిందుడు అందరి వాడేలే' టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. చరణ్ తాజా టీజర్ పై తమ్ముడు, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కొణిదెల సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు 'గోవిందుడు అందరివాడేలే'తో చరణ్ అన్న మళ్లీ తెరపైకి వచ్చాడు. టీజర్ కలర్ ఫుల్ గా ఆకట్టుకుంటోంది. ఎక్సైటింగ్ గా ఉంది. అన్నయ్య చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆతృత మొదలైంది. గోవిందుడిని చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ వరుణ్ తేజ్ కామెంట్ చేశారు. మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు వరుణ్ తేజ్ పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వరుణ్.. అన్నయ్య టీజర్ చూసి సాదాసీదా అభిమానిగా స్పందించడం అందర్ని ఆకట్టుకుంటోంది. Charan anna is back and how! The teaser looks very colourful and engaging!..excited about the film already..can't wait!.. — Varun Tej Konidela (@IAmVarunTej) August 8, 2014 -
గోవిందుడు అందరి వాడేలే న్యూ మూవీ స్టిల్స్
-
గోవిందుడు అందరి వాడేలే' టీజర్ ఆవిష్కరణ
-
ఆ మూర్ఖత్వంతోనే...చిరంజీవి సినిమా చేయలేకపోయా : కృష్ణవంశీ
‘‘ప్రేక్షకులకు 50 ఏళ్ల పాటు గుర్తుండిపోయేలా ఈ సినిమా తీస్తున్నాను. నేను పొగరుతోనో, కొవ్వుతోనో ఈ మాట చెప్పడం లేదు. నమ్మకంతో చెబుతున్నాను’’ అని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ఆయన దర్శకత్వంలో రామ్‌చరణ్ కథానాయకుడిగా బండ్ల గణేశ్ నిర్మిస్తున్న చిత్రం - ‘గోవిందుడు అందరివాడేలే’. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్, కమలినీ ముఖర్జీ ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను గురువారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా కృష్ణవంశీ ఇంకా మాట్లాడుతూ - ‘‘నేను ఎవరికైనా అవకాశం ఇవ్వాలి కానీ.... నాకెవడు అవకాశం ఇచ్చేది? అనేంత మూర్ఖత్వంతో ఉండేవాణ్ణి. ఆ మూర్ఖత్వంతోనే... చిరంజీవిగారితో సినిమా చేసే అవకాశం వచ్చినా చేయలేకపోయా. ఒకానొక దశలో నా కెరీర్ డైలమాలో పడిపోయింది. అలాంటి సమయంలో నాకు అవకాశం ఇచ్చాడు చరణ్. ‘గోవిందుడు అందరివాడేలే’ నా కెరీర్లోనే ప్రత్యేకమైన సినిమా. ఇక ఈ సినిమాలో ఎవరూ నటించలేదు. బిహేవ్ చేశారు. ఇళయరాజాగారబ్బాయి యువన్, చిరంజీవిగారబ్బాయి చరణ్‌లతో కలిసి పనిచేసిన తొలి దర్శకుణ్ణి బహుశా నేనే. ఇళయరాజాగారు మేస్ట్రో అయితే, యువన్‌శంకర్‌రాజా మాస్టర్. ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు’’ అని చెప్పారు. ‘‘‘మగధీర’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి? అనే కన్ఫ్యూజన్లో ఉన్న టైమ్‌లో ఓ సారి కృష్ణవంశీ కనిపించారు. ‘సార్.. మనం ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేద్దాం’ అనడిగాను. బహుశా కృష్ణవంశీకి ఇది గుర్తు లేదనుకుంటా. అప్పుడాయన నా వంక ఓ చిన్నపిల్లాణ్ణి చూసినట్టు చూసి వెళ్లిపోయాడు. ఇన్నాళ్లకైనా ఆయనతో సినిమా చేసే అవకాశం వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఇప్పుడు చెబుతున్నాను... కృష్ణవంశీ తెలుగు సినిమాకు ఆస్తి. ఆయన అద్భుతంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. కాజల్ అగర్వాల్‌తో మూడు సినిమాలు చేశాను. గడచిన మూడు సినిమాల్లో కనిపించనంత అందంగా ఈ సినిమాలో కనిపించింది. సాంకేతికంగా ఈ సినిమా ఓ వండర్’’అని రామ్‌చరణ్ చెప్పారు. ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ -‘‘ప్రస్తుతం వస్తున్న తెలుగు సినిమాల ప్రచార చిత్రాలు చూస్తుంటే అసహ్యం వేస్తోంది. ‘గోవిందుడు...’ ట్రైలర్ చూసినప్పుడు మాత్రం ఎక్కడికో పోతున్న విలువలు గుర్తొచ్చాయి. తెలుగు సినిమా స్టామినాను తెలియజెప్పే సినిమా ఇదని కచ్చితంగా చెప్పగలను. డబ్బు కోసం కాదు కథలోని ఆత్మ నచ్చి ఈ సినిమా చేస్తున్నా. మారిపోతున్న మానవతా విలువలకు ప్రతిరూపంగా ఈ సినిమా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జయసుధ, కాజల్ అగర్వాల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, సమీర్, కాదంబరీ కిరణ్ తదితరులు మాట్లాడారు. -
కాజల్ నువ్వు ఏమనుకోనంటే...
హైదరాబాద్: 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో కాజల్ బాగా చేసిందని హీరో రామ్‌చరణ్ కితాబిచ్చారు. ఆమె కెరీర్ లో ఇదే బెస్ట్ అని కూడా అన్నారు. 'గోవిందుడు అందరి వాడేలే' ఆడియో టీజర్ ను గురువారం రాత్రి విడుదల చేశారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ... 'కాజల్ నువ్వు ఏమనుకోనంటే ఒక మాట చెబుతాను. ఈ సినిమాలోనే నువ్వు బెస్ట్ గా చేశావు' అంటూ పొడిగారు. ఈ సినిమా కోసం కాజల్ చాలా కష్టపడిందని తెలిపారు. షూటింగ్ కంటే జిమ్ లోనే ఎక్కువసేపు గడిపిందని వెల్లడించారు. ఈ సినిమాలో మరో ముఖ్యపాత్రలో నటించిన కమలీ ముఖర్జీపై కూడా చరణ్ ప్రశంసలు కురిపించాడు. ఆనంద్, గోదావరి సినిమాలు చూసి కమలీ ఫ్యాన్ అయ్యానని చెప్పాడు. 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా అందరికీ నచ్చుతుందని చరణ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కృష్ణవంశీతో సినిమా చేయాలని నాలుగేళ్ల నుంచి ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. తాను ఈ సినిమా చేయకుంటే ఫ్యామిలీ ఆడియన్స్ తనకు దూరమయ్యేవారని చరణ్ అన్నారు. 'గోవిందుడు అందరి వాడేలే' అందరికీ నచ్చే మంచి సినిమా అవుతుందని దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, పరుచూరి వెంకటేశ్వరావు, గణేష్, కాజల్, కమిలీ ముఖర్జీ తదితరులు పాల్గొన్నారు. -
గోవిందుడు ఆడియో టీజర్ విడుదల
-
రామ్ చరణ్ కొత్త సినిమాపై వదంతులు
రామ్ చరణ్ కొత్త చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' నిర్మాణం పూర్తి కాలేదు. షూటింగ్ జరుగుతూనే ఉంది. అప్పుడే ఈ సినిమా ఫ్లాప్ అంటూ వదంతులు వ్యాపించాయి. విడుదలకు చాలా సమయం ఉన్నది. అయినా రామ్ చరణ్ ఈ తాజా సినిమా ప్రాజెక్ట్‌కు అప్పుడే ఫ్లాప్ టాక్ వెంటాడుతోంది. మేకింగ్ స్టిల్స్ గురించి ఎవరు నోరు విప్పినా, ఫిల్మ్ నగర్ గాసిప్స్ విన్నా సరే నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించి చాలా విషయాలే బయటకు వచ్చాయి. నిర్మాత బండ్ల గణేష్, దర్శకుడు కృష్ణ వంశీలతో హీరో రామ్ చరణ్‌కు అస్సలు పొసగడం లేదని సమాచారం. కథను మళ్ళీ మార్చాలంటూ చరణ్ డిమాండ్ చేస్తున్నాడని ఫిల్మినగర్ వర్గాల టాక్. మల్టీస్టారర్‌గా మరో నటుడిని తీసుకోవాలని చరణ్ కోరుతున్నట్లు చెబుతున్నారు. ఇలా సినిమా యూనిట్‌పై ఒత్తిడి పెరుగుతోందని చరణ్‌పై విమర్శలు జోరుగా వినవస్తున్నాయి. అంతేగాక ఆ టార్చర్‌కు తట్టుకోలేక కృష్ణవంశీ అపోలో ఆసుపత్రిలో చేరినట్లు కూడా ప్రచారం నడిచింది. హీరో విక్టరీ వెంకటేష్ తాజా వ్యాఖ్యలు కూడా అందుకు అనుగుణంగానే ఉన్నాయని సినీ విమర్శకులు అంటున్నారు. మల్టీస్టారర్ సినిమాలపట్ల ఆసక్తి చూపే తన వద్దకి చాలా కథలు వస్తున్నాయని, కానీ ఏవీ తనకి నచ్చడం లేదని వెంకటేష్ చెప్పారు. గోవిందుడు అందరివాడేలే కథతో కృష్ణవంశీ తన వద్దకు వచ్చిన విషయాన్ని కూడా వెంకీ ప్రస్తావించాడు. అంటే, కథ నచ్చకే తానూ తప్పుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ తేజ సినీరంగ ప్రవేశం చేసి ఏడేళ్లు పూర్తి అయింది. ఇప్పటి వరకు ఆయన ఏడు సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి. వాటిలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు చిత్రాలు మంచి హిట్ సాధించాయి. ఇన్ని సినిమాలు విజయం సాధించడం తండ్రి చిరంజీవి అభిమానుల వల్లే అనేది అందరికీ తెలిసిన విషయమే. అంతేకాకుండా తండ్రిలా మాస్ పల్స్ ప్రకారం నడవడం వల్లే ఈ క్రెడిట్ సాధించినట్లు భావిస్తున్నారు. విడుదలకు ముందే 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంపై ఫ్లాప్ అంటూ ప్రచారం జరుగుతుందంటే ఎవరో కావాలని చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ - చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ మూవీపై అభిమానులకు చాలా ఆశలు ఉన్నాయి. దర్శకుడు కృష్ణ వంశీ సామాన్యుడు కాదు. కథ, కథనంలో కొత్తదనం చూపించగల దిట్ట. వీరి కలయికలో వస్తున్న చిత్రం చూడకుండా ఇలా పుకార్లు వ్యాపించడం ఏమిటి? ఇందులో చరణ్ ఇంతకు ముందు నటించిన పాత్రలకు భిన్నంగా కొత్త గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఇప్పటి వరకు షూటు, బూటులో కనిపించిన చరణ్ పల్లెటూరి చిన్నవాడి గెటప్‌లో కనిపించడం కొందరికి నచ్చకపోవచ్చు. అంతమాత్రాన ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తే ఎలా? కుటుంబ సంబంధాలు, సంప్రదాయాల నేపథ్యంలో వినోదాత్మకంగా కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ప్రధాన పాత్రలలో శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, తమిళ నటుడు రాజ్‌కిరణ్ నటిస్తున్నారు. - సూర్యభరత్ -
కొడుకుతో తిరుమలకు రమ్య'కృష్ణ'
తిరుమల : ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కుటుంబ సమేతంగా తిరుమల విచ్చేశారు. గురువారం వీఐపీ బ్రేక్ దర్శనంలో కృష్ణవంశీ, రమ్యకృష్ణ దంపతులు కుమారుడు రిత్విక్తో కలసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం కృష్ణవంశీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకునేందుకు వస్తామన్నారు. 'రమ్యకు వెంకటేశ్వరస్వామి అంటే చాలా ఇష్టం. గోవిందుడు అందరివాడేలే సినిమా షూటింగ్ జరుగుతుంది...దసరాకి విడుదల అవుతుంది' అని కృష్ణవంశీ తెలిపారు. ప్రస్తుతం బాహుబలి షూటింగ్ జరుగుతుందని, ఆ సినిమా తర్వాత ఇంకా ఏమీ అనుకోలేదని రమ్యకృష్ణ విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. బాహుబలి చిత్రంలో రమ్యకృష్ణ రాజమాతగా నటిస్తున్నారు. కాగా ఆలయం బయటకు వచ్చిన రమ్యకృష్ణను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. కాగా కుమారుడితో కలిసి కృష్ణవంశీ, రమ్యకృష్ణలు తొలిసారి కెమెరాకు చిక్కారు. -
గోవిందుడు అందరివాడేలే మూవీ న్యూ వర్కింగ్ స్టిల్స్
-
గోవిందుడు అందరివాడేలేలో జగపతి?
-
చిరంజీవిగారు ఈ సినిమా ఆపేయమనలేదు : నిర్మాత బండ్ల గణేశ్
‘‘మా సినిమాపై మీడియాలో వినిపిస్తున్నవన్నీ రూమర్లే. వాటిల్లో నిజాలు లేవు. ఇలాంటి రూమర్లు మాకు కొత్తేం కాదు. గతంలో ‘గబ్బర్‌సింగ్’ విషయంలో కూడా ఇలాగే జరిగింది. కానీ... అందరి అంచనాలనూ తారుమారు చేస్తూ అఖండ విజయాన్ని అందుకున్నాం. త్వరలో మా ‘గోవిందుడు అందరివాడేలే’తో అదే ఫీట్‌ని రిపీట్ చేయబోతున్నాం’’ అని బండ్ల గణేశ్ అన్నారు. రామ్‌చరణ్ కథానాయకునిగా కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం విశేషాలు తెలుపడానికి శనివారం బండ్ల గణేశ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘రామ్‌చరణ్‌కి జర్వం రావడంతో ‘గోవిందుడు అందరివాడేలే’ షూటింగ్‌కి కొంత విరామం ఏర్పడింది. ఇందులో ప్రథమంగా చరణ్ తాతయ్య పాత్ర కోసం రాజ్‌కిరణ్‌ని తీసుకున్నాం. ఆయనపై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం కూడా. రాజ్‌కిరణ్ అద్భుతంగా నటించారు. అయితే... ఆయన నటన తెలుగు నేటివిటీకి దూరంగా ఉందని అనిపించింది. అందుకే... ఆయన స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ని తీసుకున్నాం. ఈ చిన్న చిన్న అవాంతరాల కారణంగా చిత్రీకరణలో జాప్యం జరిగింది. అంతేతప్ప కొంద రు అనుకుంటున్నట్లు చిరంజీవిగారు ఈ చిత్రాన్ని ఆపేయమనలేదు. అసలు ఆయన ఈ సినిమా చూడనేలేదు’’ అని వివరించారు బండ్ల గణేశ్. మొదట వంద రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయాలనుకున్నామని, ఈ జాప్యం కారణంగా మరో ఎనిమిది రోజులు అదనంగా చిత్రీకరణ జరపాల్సి వస్తోందని, ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 1న విడుదల చేస్తామని బండ్ల గణేశ్ ప్రకటించారు. -
గోవిందుడు అందరివాడేలే మూవీ వర్కింగ్ స్టిల్స్
-
క్రియేటివ్ కృష్ణవంశీకి మెగా తలనొప్పి!!
ఎందరో టాలీవుడ్ స్టార్లకు సరికొత్త ఇమేజ్ ఇప్పించిన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీకి ఇప్పుడు 'మెగా' తలనొప్పి పట్టుకుందని వినికిడి. నాగార్జునతో నిన్నే పెళ్లాడతా, మహేష్ బాబుతో మురారి, రవితేజకు హీరో ఇమేజి తెచ్చిపెట్టిన సిందూరం.. ఇలా అనేక విజయవంతమైన సినిమాలను తన ఖాతాలోంచి ఇప్పించిన కృష్ణవంశీ.. తాజాగా కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి కుమారుడు రాం చరణ్ హీరోగా 'గోవిందుడు అందరివాడేలే' అనే సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఆయనకు రోజుకో కొత్త సమస్య తెచ్చిపెడుతూ.. కంటిమీద కునుకు పట్టకుండా కష్టపెడుదట. టాలీవుడ్లో ఫ్యామిలీ మూవీలు తెరకెక్కించడంలో కృష్ణ వంశీ దారే వేరు. ఆయన రాం చరణ్‌తో తీస్తున్న గోవిందుడు అందరివాడే అనే ఫ్యామిలీ మూవీ ఇప్పటికే మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. సహజంగానే దాన్ని తీసుకెళ్లి చిరంజీవికి చూపించాడు కృష్ణవంశీ. కానీ, ఆ రషెస్ చూసిన మెగాస్టార్‌కు అది నచ్చకపోవడంతో ఏకంగా స్టార్‌కాస్టింగ్ మార్చి మళ్లీ షూటింగ్ చెయ్యాలని ఆదేశించాడట. సాధారణంగా అయితే కృష్ణవంశీ చాలా సహజంగా తన చిత్రాలను తెరకెక్కిస్తారు. హీరో ఇమేజితో ఏమాత్రం సంబంధం లేకుండా కథనే హీరోగా చేసుకుని తన సినిమాలు తీస్తుంటాడు. కానీ ఈసారి మెగా జోక్యం వల్ల ఇప్పుడు కథలో కూడా మార్పులు చేయాల్సి రావడంతో ఆయన మార్కు ఫ్లేవర్ సినిమాలో కనపడుతుందో లేదోనని అభిమానులు తలపట్టుకుంటున్నారు. ఇదే టెన్షన్‌తో కృష్ణవంశీ ఆరోగ్యం కూడా పాడైందని వినిపిస్తోంది. -
టెన్షన్ పడుతున్న కృష్ణ వంశీ
-
స్క్రిప్ట్ లో వేలు పెడుతోన్న మెగాస్టార్
-
రామ్‌చరణ్‌కు తాతగా...
మహేశ్ ‘ఆగడు’ నుంచి బయటకొచ్చిన ప్రకాశ్‌రాజ్... రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలోకి ఫ్రెష్‌గా ఎంటరయ్యారు. మూడు తరాల కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్‌చరణ్ తాతగా ప్రకాశ్‌రాజ్ కనిపించనున్నారు. ఈ పాత్రకు ముందు తమిళ నటుడు రాజ్‌కిరణ్‌ని తీసుకున్నారు. రాజ్‌కిరణ్‌తో పలు కీలక సన్నివేశాలను కూడా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించారు. అయితే ఏమైందో ఏమో... ఇప్పుడు రాజ్‌కిరణ్ స్థానంలో ప్రకాశ్‌రాజ్‌ను తీసుకున్నారు. అలాగే, పైకి ప్రకటించని కొన్ని కారణాల వల్ల చిత్రీకరణకు విరామం ప్రకటించిన ఈ టీమ్ త్వరలోనే మళ్ళీ సెట్స్‌కి వెళ్లనుంది. మరి, ఇందులో చరణ్ తండ్రి పాత్ర పోషించే నటుడెవరో తెలియాల్సి ఉంది. -
తెగిన బంధాలకు ముడి...
చిరుత, రచ్చ, నాయక్, ఎవడు... యాక్షన్ సినిమాలు. ‘మగధీర’... ఫాంటసీ చిత్రం. ఆరంజ్... ప్రేమకథా చిత్రం. ఇక మిగిలింది కుటుంబ బంధాలు, భావోద్వేగాల నేపథ్యమే. అది కూడా చేస్తే భిన్న రకాల సినిమాలు చేసిన క్రెడిట్ కొట్టేస్తారు చరణ్. ఆ ప్రయత్నంలో భాగంగా ఆయన చేస్తున్న సినిమా ‘గోవిందుడు అందరివాడేలే’. మానవ సంబంధాలను జనరంజకంగా తెరకెక్కించే కృష్ణవంశీ ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు. బండ్ల గణేశ్ నిర్మాత. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ నానక్‌రామ్‌గూడాలోని రామానాయుడు సినీ విలేజ్‌లో శరవేగంగా జరుగుతోంది. చరణ్, కాజల్, శ్రీకాంత్, రాజ్‌కిరణ్, కమలినీ ముఖర్జీ తదితర ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు కృష్ణవంశీ. అలాగే... కొన్ని పోరాట సన్నివేశాలను కూడా ఈ షెడ్యూల్లోనే చిత్రీకరిస్తారు. వారం క్రితం మొదలైన ఈ షెడ్యూల్ 45 రోజుల పాటు జరుగుతుంది. తర్వాత ఫారిన్ షెడ్యూల్ ఉంటుందని సమాచారం. ఇందులో చరణ్ బాబాయ్‌గా శ్రీకాంత్, తాతగా రాజ్‌కిరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ తండ్రిగా ఓ ప్రముఖ నటుడు నటించనున్నారు. తెగిన బంధాలను మళ్లీ ముడివేసి, కుటుంబంలో ఆనందాన్ని నింపే పాత్రలో ఇందులో చరణ్ నటిస్తున్నారు. మెగా అభిమానులు పండగ చేసుకునేలా ఈ సినిమా వస్తోందని యూనిట్ సభ్యుల సమాచారం. దసరాగా కానుకగా విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: యువన్ శంకర్‌రాజా, కెమెరా: సమీర్‌రెడ్డి, నిర్మాణం: పరమేశ్వర ఆర్ట్స్. -
తమన్ ఔట్! యువన్ ఇన్!!
టాలీవుడ్ బిజీ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఇప్పటికే ఆయన ఖాతాలో పలు మ్యూజికల్ హిట్లున్నాయి. ప్రస్తుతం మహేశ్ ‘ఆగడు’, ఎన్టీఆర్ ‘రభస’ చిత్రాలతో బిజీగా ఉన్నారు తమన్. కృష్ణవంశీ-రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రానికి కూడా తమన్ సంగీత దర్శకుడని గతంలో వార్తలొచ్చాయి. సంగీతాభిరుచి కలిగిన కృష్ణవంశీతో తమన్ చేసే ఈ చిత్రం కచ్చితంగా సంగీత సంచలనం అవుతుందని అందరూ భావించారు. అయితే... ఆ సినిమాకు ఇప్పుడు యువన్‌శంకర్‌రాజా సంగీత దర్శకునిగా తీసుకున్నట్లు తెలిసింది. యువన్ తెలుగులో ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’, ‘దూసుకెళ్తా’ తదితర చిత్రాలకు సంగీతం అందించారు. కృష్ణవంశీ, యువన్, చరణ్... ఈ నవ్యమైన కలయిక మెగా అభిమానులకు ఓ కొత్త అనుభూతినివ్వడం ఖాయం. -
పల్లెటూళ్లో ఫారిన్ గోవిందుడు
రామ్‌చరణ్ తెరంగేట్రం చేసి ఏడేళ్లు. ఇప్పటికి ఆయన నటించిన ఏడు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో మగధీర, రచ్చ, నాయక్, ఎవడు... చిత్రాలు 45 కోట్ల రూపాయల షేర్ వసూలు చేశాయి. నేటి హీరోల్లో ఇది రికార్డే. తండ్రిలా మాస్ పల్స్ ప్రకారం నడవడం వల్లే ఈ క్రెడిట్ సాధించి ఉంటారు చరణ్. ప్రస్తుతం ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బండ్ల గణేశ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గోవిందుడు అందరివాడేలే’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఫారిన్లో పెరిగి పల్లెటూరికొచ్చిన ప్రవాసాంధ్రునిగా చరణ్ ఇందులో కనిపించనున్నారు. కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ బాబాయ్‌గా శ్రీకాంత్ కనిపిస్తారు. ఆయనకు జోడీగా కమలినీ ముఖర్జీ నటిస్తున్నారు. తమిళ నటుడు రాజ్‌కిరణ్ ఇందులో చరణ్‌కి తాతగా కథకు కీలకమైన పాత్రను పోషిస్తుండటం విశేషం. కన్యాకుమారి, పొలాచ్చిల్లో భారీ షెడ్యూల్ ముగించుకొని ఈ చిత్రం యూనిట్ హైదరాబాద్ చేరుకుంది. ఏప్రిల్ రెండోవారం నుంచి 40 రోజుల పాటు భారీ షెడ్యూల్ జరుపనున్నారు. నేడు చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా నిర్మాత బండ్ల గణేశ్ మాట్లాడుతూ ‘‘కుటుంబ బంధాలు, సంప్రదాయాల నేపథ్యంలో సాగే చక్కని వినోదాత్మక చిత్రంగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటివరకూ తీసిన సన్నివేశాలు అద్భుతంగా వచ్చాయి. కన్నుల పండువగా ఈ చిత్రం ఉంటుందని నమ్మకంగా చెప్పగలను. చరణ్, కాజల్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ, రాజ్‌కిరణ్.. ఇలా తారాగణం అంతా ఎంజాయ్ చేస్తూ నటిస్తున్నారు. ఏప్రిల్ రెండోవారం నుంచి హైదరాబాద్‌లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాం. రామానాయుడు సినీ విలేజ్‌లో వేసిన ఇంటి సెట్లోనూ, ఆర్ఎఫ్సీలోనూ ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నాం. ఆ తర్వాత విదేశాల్లో పాటల చిత్రీకరణ ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్‌రెడ్డి, సంగీతం: తమన్. -
గోవిందుడు అందరి వాడేలే మూవీ స్టిల్స్
-
గోవిందుడు అందరి వాడేలే?
ఇప్పటివరకూ మాస్ మసాలా కథలతో చెలరేగిపోయిన చరణ్... తన పంథాకి కామా పెట్టి, కాస్తంత కూల్‌గా ప్రేక్షకుల్ని పలకరించబోతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ఆయన నటించనున్న సినిమా చల్లని పైరగాలి లాంటిదేనని సమాచారం. బంధాలు, అనుబంధాల నేపథ్యంలో సాగే అందమైన కుటుంబకథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారట కృష్ణవంశీ. అందుకే... కథకు తగ్గట్టుగా ఈ సినిమాకు ‘గోవిందుడు అందరివాడేలే’ అనే టైటిల్‌ని ఖరారు చేసినట్లు సమాచారం. అచ్చమైన తెలుగుదనం మొత్తం ఈ పేరులో ఉంది కదూ. దీన్ని బట్టి సినిమా ఎలా ఉంటుందో ఓ అంచనాకొచ్చేయొచ్చు. కుటుంబాల్లోని ఆప్యాయతల్ని, అనురాగాల్ని తెరకెక్కించడంలో కృష్ణవంశీ దిట్ట. మురారి, చందమామ చిత్రాలే అందుకు నిదర్శనాలు. ఆ స్థాయిలోనే ఈ సినిమా కూడా ఉంటుందని వినికిడి. మూడు తరాల నేపథ్యంలో ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. సీనియర్ తమిళ నటుడు రాజ్‌కిరణ్ ఇందులో చరణ్‌కి తాతగా నటిస్తుండగా, బాబాయ్‌గా శ్రీకాంత్ కనిపిస్తారు. చరణ్ కెరీర్లోనే గుర్తుండిపోయే సినిమాగా ఈ మల్టీస్టారర్‌ని నిర్మించనున్నారు నిర్మాత బండ్ల గణేష్. కళాకారుల్లో ప్రతిభను రాబట్టుకోవడంలో కృష్ణవంశీ సిద్ధహస్తుడు. మరి ఈ సినిమా ద్వారా చరణ్‌ని నటుడిగా ఆయన ఏ స్థాయిలో చూపిస్తారో చూడాలి.