వేలానికి హీరో రామ్చరణ్ బైకు! | hero ramcharan bike up for sale | Sakshi
Sakshi News home page

వేలానికి హీరో రామ్చరణ్ బైకు!

Sep 19 2014 6:54 PM | Updated on Sep 2 2017 1:39 PM

వేలానికి హీరో రామ్చరణ్ బైకు!

వేలానికి హీరో రామ్చరణ్ బైకు!

'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో హీరో రామ్చరణ్ వాడిన బైకు అమ్మకానికి పెట్టనున్నారు

హీరో రామ్చరణ్ బైకు అమ్మకానికి పెట్టనున్నారు. ఇంతకుముందు బాలకృష్ణ 'లెజెండ్' బైకును అమ్మకానికి పెట్టారు. ఇప్పుడు అదే తరహాలో చరణ్ బైకును వేలం వేయనున్నారు. 'గోవిందుడు అందరి వాడేలే' సినిమాలో రూ. 30 లక్షల విలువ చేసే హర్లీ డేవిడ్సన్ బైకు వాడాడు. ఈ సినిమా కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు.

సినిమా విడుదలైన తర్వాత ఈ బైకును వేలం వేయాలని నిర్మాత బండ్ల గణేష్ భావిస్తున్నారట. వేలం ద్వారా వచ్చే డబ్బును దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలను కుంటున్నారదన్నది చిత్రసీమ సమాచారం. 'లెజెండ్' సినిమాలో తాను వాడిన బైకును వేలం వేయడం ద్వారా సొమ్మును బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆస్పత్రికి అందజేశారు బాలకృష్ణ. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా అక్టోబర్ 1న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement