అనంతపురం సప్తగిరి సర్కిల్ : కాపులను బీసీలలో చేర్చేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాన్ని మానుకోకపోతే 2019 ఎన్నికల్లో టీడీపీని భూస్థాపితం చేస్తామని ఏపీ బీసీ, ఓబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు అన్నారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. గత ఎన్నికల్లో టీడీపీ బీసీల ఓట్లతో గెలిచిందన్నారు. గద్దెనెక్కిన తరువాత కాపులను బీసీల జాబితాలో చేరుస్తామనే నిర్ణయంతో బీసీలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చే అంశంపై జిల్లాకు ఈ నెల 17న జస్టిస్ మంజునాథన్ కమిషన్ బందం విచ్చేస్తోందని, ఈ సందర్భంగా తమ అభ్యంతరాన్ని తెలియచేస్తామన్నారు.
ఇందుకు సంబంధించి ఈ నెల 12న స్థానిక లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశానికి బీసీ కుల, ఉద్యోగ, సంక్షేమ సంఘాల నాయకులు, యువజన, విద్యార్థి సంఘాలవారు, కార్మికులు, కర్షకులు, మేథావులు హాజరుకావాలని ఆయన కోరారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌బాబు, రజకాభివధ్ది సంస్థ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమన్, జిల్లా సహాయ కార్యదర్శి కోట మల్లేష్, నాయీబ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ భూస్థాపితం
Published Sun, Oct 9 2016 10:34 PM | Last Updated on Tue, Aug 21 2018 11:39 AM
Advertisement