టీడీపీ ప్రభుత్వ తీరుపై ఉద్యమిస్తాం | we will fight over the manner of TDP government | Sakshi
Sakshi News home page

టీడీపీ ప్రభుత్వ తీరుపై ఉద్యమిస్తాం

Published Thu, Nov 5 2015 3:53 AM | Last Updated on Sun, Sep 3 2017 12:00 PM

టీడీపీ ప్రభుత్వ తీరుపై ఉద్యమిస్తాం

టీడీపీ ప్రభుత్వ తీరుపై ఉద్యమిస్తాం

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

 మాచర్లటౌన్ (గుంటూరు): రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వం కాపులను బీసీల్లో చేర్చేందుకు కమిషన్ వేయడంపై బీసీ సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేపట్టనున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రకటించారు. కాపులను బీసీల్లోకి చేర్చేందుకు చట్టబద్ధత లేదన్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాపులను బీసీ జాబితాలోకి చేర్చేందుకు కమిషన్‌ను ఏర్పాటు చేయడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు.

కాపుల కోసం రాజకీయ నిర్ణయాలు తీసుకుని 56 శాతం ఉన్న బీసీలకు అన్యాయం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. కోర్టు సైతం కాపులను బీసీలుగా పరిగణించడం సాధ్యం కాదని తీర్పునిచ్చిందన్నారు.  సమావేశంలో విద్యుత్ బీసీ ఉద్యోగ సంఘ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పరశ వెంకటేశ్వర్లు, జింకల నాగేశ్వరరావు యాదవ్, జిల్లా బీజీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement