వేలానికి ‘ముకుంద మురారి’ బైక్
వేలానికి ‘ముకుంద మురారి’ బైక్
Published Wed, Nov 2 2016 11:36 AM | Last Updated on Mon, Sep 4 2017 6:59 PM
ప్రత్యేకంగా తయారు చేయించిన బైక్
బెంగళూరు: బాలీవుడ్‌లో విజయం సాధించిన ఓమైగాడ్‌కు రీమేక్‌గా కిచ్చ సుదీప్, ఉపేంద్రలతో ప్రధాన పాత్రధారులుగా నందకిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ముకుందమురారి చిత్రం కన్నడలో కూడా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ చిత్రం కోసమే చిత్ర దర్శకనిర్మాతలు ప్రత్యేకంగా తయారు చేయించిన బైక్ కూడా అందరిని ఆకర్షించింది. కాగా ఇపుడు ఆ బైక్‌ను నవంబర్11 న వేలం వేయనన్నారు. వేలం వేయగా వచ్చిన డబ్బును హీరోలు కిచ్చ సుదీప్, ఉపేంద్రలు తుమకూరు సిద్ధగంగ మఠానికి విరాళంగా ఇవ్వనున్నారని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.
Advertisement
Advertisement