ముగిసిన గోవిందుడి జ్యేష్టాభిషేకం | End by Lord Govindarajaswami jyastabhisheakam | Sakshi
Sakshi News home page

గోవిందరాజ స్వామి, జ్యేష్టాభిషేకం, ముగిసింది

Published Sun, Jul 17 2016 5:16 PM | Last Updated on Tue, Aug 21 2018 11:39 AM

ముగిసిన గోవిందుడి జ్యేష్టాభిషేకం - Sakshi

ముగిసిన గోవిందుడి జ్యేష్టాభిషేకం

ముగిసిన గోవిందుడి జ్యేష్టాభిషేకం
శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఆదివారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్టాభిషేకం ఘనంగా ముగిసింది. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి నిత్యకైంకర్యాలు చేపట్టారు. శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి ఉత్సవమూర్తులను కల్యాణ మండపానికి వేంచేపు చేశారు. శతకలశ స్నపనం వైభవంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, పంచామృతం, చెరకు, వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మహాశాంతి హోమం, తిరుమంజనం, సమర్పణ, ఆరగింపు, అక్షతారోహరణం నిర్వహించి బ్రహ్మఘోష వినిపించారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు కవచ సమర్పణ చేశారు. సాయంత్రం ఉభయ నాంచారులతో కలిసి శ్రీవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. టీటీడీ స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో ప్రసాదమూర్తిరాజు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement