చరణ్ టీజర్ పై తమ్ముడి కామెంట్!
చరణ్ తాజా టీజర్ పై తమ్ముడు, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కొణిదెల సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు
రామ్ చరణ్ తేజ తాజా చిత్రం 'గోవిందుడు అందరివాడేలే'పై టాలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా 'గోవిందుడు అందరి వాడేలే' టీజర్ విడుదలై అభిమానులను ఆకట్టుకుంటోంది. చరణ్ తాజా టీజర్ పై తమ్ముడు, నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ కొణిదెల సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విట్టర్ లో కామెంట్ చేశాడు
'గోవిందుడు అందరివాడేలే'తో చరణ్ అన్న మళ్లీ తెరపైకి వచ్చాడు. టీజర్ కలర్ ఫుల్ గా ఆకట్టుకుంటోంది. ఎక్సైటింగ్ గా ఉంది. అన్నయ్య చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అనే ఆతృత మొదలైంది. గోవిందుడిని చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నాను అంటూ వరుణ్ తేజ్ కామెంట్ చేశారు.
మెగా ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు వరుణ్ తేజ్ పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. షూటింగ్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న వరుణ్.. అన్నయ్య టీజర్ చూసి సాదాసీదా అభిమానిగా స్పందించడం అందర్ని ఆకట్టుకుంటోంది.