కోలీవుడ్‌లో గోవిందుడు అందరివాడు | Govindudu Andarivadele in Kollywood | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌లో గోవిందుడు అందరివాడు

Published Thu, Feb 26 2015 1:20 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

కోలీవుడ్‌లో గోవిందుడు అందరివాడు - Sakshi

కోలీవుడ్‌లో గోవిందుడు అందరివాడు

 తెలుగులో మంచి విజయాన్ని చవిచూసిన గోవిందుడు అందరివాడు చిత్రం ఇప్పుడు తమిళ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. యువ నటుడు రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి కుటుంబ కథా చిత్రాలను అందంగా తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. ప్రేమానుబంధాలు, ఆప్యాయతలు, చిన్న చిన్న మనస్పర్థలు అంటూ పల్లెటూరి వాతావరణంలో సాగే కుటుంబ కథా చిత్రం గోవిందుడు అందరివాడు.
 
 ఈ తరం కోరుకునే కమర్షియల్ అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఐఫర్ ఇంటర్నేషనల్ పతాకంపై రఫి మతిర్ రామ్‌లీలా పేరుతో తమిళంలోకి అనువదిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, రాజ్‌కిరణ్, కమలిని ముఖర్జి, రెహ్మాన్, ప్రగతి, శ్రీకాంత్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. చిత్ర అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నట్లు నిర్మాత తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement