లండన్ వెళుతున్న గోవిందుడు | Ram Charan-Kajal's Govindudu Andarivadele shoot in London | Sakshi
Sakshi News home page

లండన్ వెళుతున్న గోవిందుడు

Published Wed, Aug 13 2014 10:49 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

లండన్ వెళుతున్న గోవిందుడు - Sakshi

లండన్ వెళుతున్న గోవిందుడు

గోవింద్ విదేశాల్లో పుట్టి పెరిగిన కుర్రాడు. కానీ అతని మూలాలన్నీ ఓ తెలుగింట్లో ఉన్నాయి. అతగాడు తన వాళ్లను కలుసుకోవడం కోసం పల్లెటూరికి వస్తాడు. తాతయ్య, నానమ్మ, బాబాయ్, ఇతర బంధువులు, రక్త సంబంధాలు, ఆప్యాయతలు, అనురాగాలు, ఆ ఊరి వాతావరణం, ప్రకృతి... ఇవన్నీ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఈ గోవిందుడు అందరి మనసుల్లోనూ స్థానం సంపాదించుకుని అందరివాడు అనిపించుకుంటాడు. ఈ నేపథ్యంలోనే ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం రూపొందుతోంది.
 
  రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమలినీ ముఖర్జీ తదితర ప్రముఖ తారలంతా కీలకపాత్రలు పోషిస్తున్నారు. తెలుగింటి అందాల్ని, అనుబంధాల్ని తెరకెక్కించడంలో నేర్పరి అయిన కృష్ణవంశీ ఈ చిత్రానికి దర్శకుడు. బండ్ల గణేశ్ భారీ ఎత్తున ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సీలో ఏకధాటిగా చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 24 నుంచి లండన్‌లో రెండు పాటల్ని చిత్రీకరించబోతున్నారు.
 
 ఈ విశేషాల్ని బండ్ల గణేశ్ చెబుతూ -‘‘రామ్ చరణ్‌పై ఒక సోలో పాట, రామ్‌చరణ్-కాజల్‌పై డ్యూయెట్ లండన్‌లో తీయబోతున్నాం. హైదరాబాద్ రాగానే మూడు రోజులు షూటింగ్ చేస్తే సినిమా మొత్తం పూర్తయిపోయినట్టే. సెప్టెంబర్ రెండో వారంలో పాటలను, అక్టోబర్ 1న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌శంకర్ రాజా, ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement