ఎందుకు రిజెక్ట్ చేశానంటే: రాంచరణ్
ఎందుకు రిజెక్ట్ చేశానంటే: రాంచరణ్
Published Tue, Sep 30 2014 2:31 PM | Last Updated on Sun, Jul 14 2019 1:57 PM
'మిర్చి' లాంటి బంపర్ హిట్ ను అందించిన కొరటాల శివ చిత్రాన్ని రాం చరణ్ తేజ్ రిజెక్ట్ చేయడం టాలీవుడ్ లో అప్పట్లో చర్చనీయాంశమైంది. కొరటాల శివ చిత్రాన్ని ఎందుకు అంగీకరించలేదనే విషయంపై రాంచరణ్ వివరణ ఇచ్చారు. అప్పటి వరకు యాక్షన్, మాస్ ఇమేజ్ ఉన్న చిత్రాల్లో నటించానని.. ఓ ఫీల్ గుడ్ ఉండే ఓ కుటుంబ కథా నేపథ్యంతో ఉండే చిత్రం కోసం ఎదురు చూస్తున్నానని, ఆ సమయంలో కృష్ణవంశీ చెప్పిన కథ నచ్చిందన్నారు. అందుకే తాను కొరటాల శివ సినిమాను రిజెక్ట్ చేశానని రాంచరణ్ వివరణ ఇచ్చారు.
'గోవిందుడు అందరివాడేలే' చిత్రంతో అక్టోబర్ 1 తేదిన ప్రేక్షకుల వద్దకు రానున్న రాంచరణ్ తేజ్ తమిళ, తెలుగు భాషల్లో ఓ చిత్రంలో నటించేందుకు దృష్టి పెట్టారు. తమిళ, తెలుగు భాషల్లో రూపొందే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. ఒకవేళ అనుకున్న ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే చిత్రం వచ్చే సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుంది. అంతకంటే ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఏమిలేదు అని రాంచరణ్ ఓ న్యూస్ ఏజెన్సీకిచ్చిన ఇంటర్యూలో తెలిపారు. ప్రస్తుతం అజిత్ కుమార్ తో రూపొందిస్తున్న చిత్రలో గౌతమ్ మీనన్ బిజీగా ఉన్నారు.
Advertisement