'గోవిందుడు'కు మరో పాట.... | one more song in govindudu andari vaadele movie | Sakshi
Sakshi News home page

'గోవిందుడు'కు మరో పాట....

Published Thu, Oct 2 2014 8:58 AM | Last Updated on Tue, Aug 21 2018 11:39 AM

'గోవిందుడు'కు మరో పాట.... - Sakshi

'గోవిందుడు'కు మరో పాట....

ఈ మధ్య కాలంలో సినిమా విడుదల అయిన తర్వాత కూడా ఓ పాటనో లేక ఓ ఫైట్నో జత చేయటం కామన్గా మారిపోయింది. తాజాగా ఆ జాబితాలో రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం కూడా చేరింది. ఆ సినిమాలో మరో పాటను జత చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది.  దాంతో చిత్ర యూనిట్ దసరా పండుగకు సెలవు కూడా తీసుకోకుండా ఆ పాటను చిత్రీకరించటంలో నిమగ్నమైంది.  కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బుధవారం విడుదలయిన విషయం తెలిసిందే.  

హీరో రామ్ చరణ్ ఈ పాట చిత్రీకరణ కోసం దసరా పండుగ రోజు కూడా పని చేస్తున్నాడు. పాట పూర్తయ్యేవరకూ ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా పని చేయాలని డిసైడ్ అయినట్లు రామ్ చరణ్ తెలిపాడు. ముందుగా ఈ సినిమా ప్రీమియర్ షో కోసం యూఎస్ వెళ్లాలనుకున్నా సమయం లేకపోవటంతో వెళ్లలేకపోయినట్లు చెర్రీ పేర్కొన్నాడు.

ఈ దసరాను సెట్లోనే జరుపుకుంటున్నట్లు రామ్ చరణ్ వెల్లడించాడు. రామ్ చరణ్కు జంటగా కాజల్ నటించింది. శ్రీకాంత్, కమలినీ మరో జంటగా తెరపై సందడి చేయగా, సీనియర్ నటుడు రామ్ చరణ్కు తాతయ్య పాత్రలో కనిపించాడు. మరి  కొత్తగా జత చేయబోయే పాట సినిమాకు మరింత ప్లస్ పాయింట్ అవుతుందో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement