తమన్ ఔట్! యువన్ ఇన్!! | Ram charan kicks out Thaman and roped Yuvan Shankar | Sakshi
Sakshi News home page

తమన్ ఔట్! యువన్ ఇన్!!

Published Tue, Apr 15 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 6:04 AM

తమన్ ఔట్! యువన్ ఇన్!!

తమన్ ఔట్! యువన్ ఇన్!!

టాలీవుడ్ బిజీ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఇప్పటికే ఆయన ఖాతాలో పలు మ్యూజికల్ హిట్లున్నాయి. ప్రస్తుతం మహేశ్ ‘ఆగడు’, ఎన్టీఆర్ ‘రభస’ చిత్రాలతో బిజీగా ఉన్నారు తమన్.

టాలీవుడ్ బిజీ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఇప్పటికే ఆయన ఖాతాలో పలు మ్యూజికల్ హిట్లున్నాయి. ప్రస్తుతం మహేశ్ ‘ఆగడు’, ఎన్టీఆర్ ‘రభస’ చిత్రాలతో బిజీగా ఉన్నారు తమన్. కృష్ణవంశీ-రామ్‌చరణ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రానికి కూడా తమన్ సంగీత దర్శకుడని గతంలో వార్తలొచ్చాయి. సంగీతాభిరుచి కలిగిన కృష్ణవంశీతో తమన్ చేసే ఈ చిత్రం కచ్చితంగా సంగీత సంచలనం అవుతుందని అందరూ భావించారు. అయితే... ఆ సినిమాకు ఇప్పుడు యువన్‌శంకర్‌రాజా సంగీత దర్శకునిగా తీసుకున్నట్లు తెలిసింది. యువన్ తెలుగులో ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’, ‘దూసుకెళ్తా’ తదితర చిత్రాలకు సంగీతం అందించారు. కృష్ణవంశీ, యువన్, చరణ్... ఈ నవ్యమైన కలయిక  మెగా అభిమానులకు ఓ కొత్త అనుభూతినివ్వడం ఖాయం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement